ఆమె కాలికి   చేయికి   ఉన్న   కట్టు  మీద   బాబా   చేయి   పెట్టేసరికి,కట్టులు   వూడి   పడిపోయాయి.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండ   కోట   బ్రహ్మండ   నాయక   రాజాధిరాజా   యోగిరాజ   పరబ్రహ్మ   శ్రీ   సచ్చిదానంద   సద్గురు   సాయినాథ్ మహారాజ్ కి   జై

సాయి   రామ్

నా   భార్య   పేరు   సుచిత్ర.ఆమె   2 -5 -2005   నాగపూర్ లో   ఒక   భయంకరమైన   ప్రమాదానికి   గురి   అయింది.

ఆమె   కుడి చేయి, భుజం,ఎడమకాలు,పాదాలు,వేళ్ళు   భయంకరంగా   విరిగాయి.

డాక్టర్   ఎముకలు   విరిగాయి   అని   చెప్పారు. కాలు, చేయి  చర్మం   కూడా   చీలిపోయింది.

నాగపూర్ లో   ఒక  డాక్టర్ కు   చూపిస్తే  చేతికి,కాలికి   పెద్దగా   లేపనం   పెట్టి   కట్టు వేసారు.

ఆమె   కుడి  చేయి  చాలా వంకరగా ఉందని   గొంతు  నుంచి   కట్టు   కట్టారు.

ఎడమ కాలు   కూడా  నేరుగా   అవ్వలేక  ఆమెకు  నడవడం   చాలా   కష్టంగా   వుండేది.

కొన్ని  రోజుల తరువాత   చాలా   కష్టం   మీదట   నడిచేది.

మెల్లగా,  ఆమె   బాబాకు   భక్తురాలు   అయింది.

ఆమె   మనస్తాపంతో   బాబాను శరణు   వేడింది.

బాబా, ఈ   కష్టాన్ని   దూరం  చేయి   తండ్రి   అని   ప్రార్ధిస్తూవుండేది.

అన్నిటికన్న,ఆశ్చర్యంలో   కెల్ల ఆశ్చర్యం   తెలుసా,25 -5 -2005   రాత్రి   1 .55  గంటలకు  పరమ   పూజనీయ   సాయినాధుడు   నా   భార్య   ఎదురుగా   వచ్చి నిలబడినారు.

నా  భార్య   అపుడు   నిద్ర  సరిగా   పట్టక   మేలుకొని  వుంది.

బాబా   ఆమెను  లేచి ,నిలబడు  అన్నారు.

ఆవిడ “బాబా   నాకు   కాలు,చేయి   నొప్పిగా   వున్నాయి,విరిగాయి   లెవ్వలేను   తండ్రి  అన్నది.

దానికి   బాబా   అన్నారు.ఎక్కడ దెబ్బ   తగిలింది   చూపించు”అన్నారు.

పాపం  ఆవిడి    చీరపైకి   ఎత్తి   తన   కాలి   దెబ్బ   చూపించలేకపోయింది.

అపుడు బాబా   అన్నారు “నేను   నీకు   తండ్రి,తల్లిని,తల్లి   దగ్గర   సిగ్గు   ఎందుకు”తీ  అని   ఆమె   చేయి   పట్టుకొని   తిప్పారు.

ఆమె కాలికి   చేయికి   ఉన్న   కట్టు  మీద   బాబా   చేయి   పెట్టేసరికి,కట్టులు   వూడి   పడిపోయాయి.

కట్టు  మీద  ఉన్న  లేపనం  అదే మంచం   మీద   పడిపోయింది.

బాబా  ఆమె   పక్కన   కూచున్నారు.ఆమెతో  అన్నారంట   చేయి తిన్నగా  పెట్టు   అన్నారు, అని   ఆమె   చేతి  మీద   తన   చేయి  పెట్టి  చేయి  తిన్నగా  చేశారు.

మళ్ళీ  చేయి  ముడుచుకో అన్నారు.

ఆమె  అలాగే చేసింది.అపుడు   బాబా   అన్నారు, ఇంక  నీవు   నయం   అయిపొయింది,అన్నారు.

బాబా   నిలబడి   ఆమెకు   ఆశీర్వాదం ఇచ్చారు.ఆమె   బాబాతో   బాబా   టీ చేస్తాను,తాగి   వెళ్ళు   అనిందంట.

దానికి   బాబా   చిన్న   చిరునవ్వునవ్వినారు.

ఆమె బాబాను, నాకు   చూపాలని ,”ఏమండీ, నిద్ర   లేవండి   బాబా   వచ్చారు” అని   అరిచింది.

నేను   లేచి   చూసేసరికి   బాబా వెళ్లిపోయారు.కానీ   గుర్తుగా  ఆమె  చేయి, కాలు   బాగుచేశారు.

ఆ   లేపనం   మా   మంచం   మీద  పడివుంది.కానీ   ఆమె   చేయి   ముడుచుకోని   వుంది.

నేను   అడిగాను   చేయి   నేరుగా వుంచు   అన్నాను.అపుడు   ఆమె  చేసి   చూపించింది. ఇంకేముంది   చేయి   తెరిచి   చూసేసరికి   చేతిలో   బాబా విభూతి  పెట్టి   వెళ్లారు.

నా   భార్య   సుచిత్ర   ఎపుడు   షిర్డీకి   వెళ్ళలేదు.కానీ   నాగపూర్ లో   మా   ఇంటి   దగ్గర   వున్న   బాబా  గుడికి రోజు   వెళ్ళి,  శ్రద్దగా  హారతి,పూజ   చేసి   వచ్చేది.

ఈ  బాబా   చేసిన   లీల  మాకు  ఎంతో  ఆనందాన్ని,  భక్తిని   బాబాపై పెంచేలా   చేసింది.
ఇలా   కొన్ని   రోజుల  తరువాత  మా  అమ్మాయి, అల్లుడు, అందరం  ఒక  కార్ ని   ఆర్డర్   చేసుకొని  షిర్డీకి  వెళ్ళాం.

అక్కడ లైన్ లో   నిలబడి  బాబా   దర్మనం   చేసుకున్నాము

ఆ   ఆనందాన్ని   మాటల్లో   చెప్పలేము. మళ్ళీ   ప్రసాదాలయానికి వెళ్ళాం.

అందరం   లైన్ గా   కూచున్నాము.అక్కడ   ప్రసాదాలయంలో   అన్నం, రోటి, పప్పు  అన్ని  వేశారు.

మేమంతా మామూలుగా   భోజనం   చేస్తున్నాం.

నా భార్య  సుచిత్ర  అన్నంలో  బాబా  ప్రసాదం  అన్ని  అక్కడ  సమాధి  మందిర్ లో బాబాకు  నివేదించింది.ఒక   బాబా  లాకెట్  అన్ని  ఆమె  అన్నంలో  వచ్చాయి.

మా  ఆశ్చర్యానికి  అంతేలేదు. అక్కడ  వడ్డన చేసే   వాళ్ళను   అడిగాము  ఈ  ప్రసాదం  ఎలా   వచ్చింది. లాకెట్  ఎలా  వచ్చింది? మీరేమన్నా  వేసారా  అని? వాళ్ళు తెల్లమొహం   వేసుకొని   నిలబడిపోయారు.అందరం  బాబా  చేసిన  ఈ  లీలను  చూసి  ఆశ్చర్యానికి లోను అయ్యాము.

మేము, నా భార్య   బాబా  ఆశేష  కృపకు  పాత్రులు  అయ్యాము. ఆయన  దీనజన  బాంధవుడు.

అందరూ  ఆయన చేసే  అద్భుతాలకు  తలవంచక  తప్పదు.

సర్వం  సాయినాధార్పణ  మస్తు

సాయిబాబా  సాయిబాబా  సాయిబాబా  సాయిబాబా 

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

3 comments on “ఆమె కాలికి   చేయికి   ఉన్న   కట్టు  మీద   బాబా   చేయి   పెట్టేసరికి,కట్టులు   వూడి   పడిపోయాయి.

Madhavi

Baba vaari leela nenu raasetappudu naaku kallalo neellu aagaledhu….Really i feel very happy..Sarva guna sampannudu sainaathude.

We are very lucky mam…to interact you such a staunch devotee of Baba…please write your miracles at least 1008

Madhavi

1008..??? My god..Nenu raastunnaanu.ante.antha false..Baba raayistharu..Ante totally true…Baba estam….Interesting telusa? Meeru nannu raayamani adige daaniki just mundhu roju..Oka baba devoti..Nuvvu anni raayi Madhavi..Annaru..Appudu emi raayali.anukunnanu.chusara…Baba aayana tho cheppincharu….I m very thankful to u..B,coz u have given a very gud platform to express our devotion towards sainaath..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles