బంధువులు  అందరూ   వదిలేశారు మమ్మల్ని.పిచ్చివాళ్ళ  లాగ  అయిపోయాము.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండ   కోటి   బ్రహ్మండ   నాయక   రాజాధి   రాజ   యోగిరాజ   పరబ్రహ్మ   శ్రీ సచ్చిదానంద   సద్గురు   సాయినాథ్   మహారాజ్   కి   జై

సాయి రామ్

నా   జీవితంలో  ఆ   నాలుగు   సంవత్సరాలు   నేను   అసలు మర్చిపోలేవి.

ఎపుడైనా   ఎవరికైనా   కష్టాలు   వచ్చినపుడు   బీదరికం   చాలా బాధలకు   గురిచేసినపుడు   ఎలాంటి   సంఘటలు   జరుగుతాయంటే   ఎవరికి ఇలాంటి   కష్టాలు   ఇవ్వకు   ప్రభూ   అనిపిస్తుంది.

అలాంటి   ఘటననే   నా జీవితంలో   కూడా   జరిగింది. భీకరమైన   తుఫానులో   నావ   ఎలాగైతే వూగిసలాడుతుందో, అలాగే   నా   మనసు   కూడా   వుండేది.

ఎలా   ఈ జీవితాన్ని గడపను, ఏమి   అర్ధం   కాకుండా   వుంది.

ఏ   మార్గం   కనపడకుండా   వుంది. అలాంటపుడు   మా   కరుణామయుడు   సాయిబాబా   నాకు   అండగా వున్నారు.

నేను   అంత   కష్టంలో   వున్నపుడు బాబా  నన్ను  రక్షించారు.

మేము   ముగ్గురు   అబ్బాయిలు, ముగ్గురు  అమ్మాయిలు   వుండేవాళ్ళం.

అందరికన్నా   నేను   పెద్దవాడిని. మా   నాన్నగారు   ఒక   ఫ్యాక్టరీలో   పని చేసేవారు.

మేము   అందరం   దాదర్ లో   ఒక   చిన్న   బస్తిలో వుండేవాళ్ళం.

మా ఆర్థిక   పరిస్దితి   అంత   బాగుండేదికాదు.

నా   వయసు   15   సంవత్సరాలు   వరకు అదో   రకంగా   గడిచిపోయేది.

మేమందరం స్కూల్ కి వెళ్ళి చదువుకునేవాళ్ళం.

ఇంటర్ వరకు   అందరం   బాగానే  చ దువుకున్నాం.

కష్టకాలం   ఎలా వచ్చిందంటే   అది   1987   సంవత్సరంలో  మా   నాన్న   పని   చేసే   ఫ్యాక్టరీ మూతపడిపోయింది.

మా   అందరి   జీవితాలు  అస్తద్యస్తం   అయ్యాయి.

ఇంక సంపాదించే   వాళ్ళు   లేనందున,నేను   చదువు   మానేసి  పని   చేయాలసి వచ్చింది.

కానీ  పని   దొరకడం   అంత  సులభంకాదు.

ఎన్ని   రోజులు  ప్రయత్నం  చేసిన   పని  దొరకలేదు.

బంధువులు  అందరూ   వదిలేశారు మమ్మల్ని.పిచ్చివాళ్ళ  లాగ  అయిపోయాము.

చూస్తు  చూస్తు  4  సంవత్సరాలు గడిచిపోయింది.

ఆగష్టు  నెలలో  నా   మిత్రుడు   షిర్డీ  వెళ్తూ  నన్ను వస్తావా  షిర్డీ వెళ్దాం  అన్నాడు.

నేను  ఉద్యగం  కోసం వెతికి  వెతికి, ఇంక   ఒక్కసారి   షిర్డీ  వెళ్దాం   అనుకున్నాను.

పైసలు  వాళ్ళను,వీళ్ళను  అడిగి  తెచ్చుకొని   వెళ్ళాను.

నేను  సమాధి   మందిరంలో   అడుగుపెట్టెసరికి   ఆ   సాయినాథుడి   దర్మనం అయ్యెసరికి, నా  క ళ్ళలో   నీళ్లు   ఆగలేదు.

నాకు   అపుడు   అనిపించింది   నేను ఆ   ప్రేమమూర్తి   సాయినాథుడిని   కలుసుకున్నాను.

నేను   సమాధి   దగ్గర   సాయి   పాదాలమీద   నా   తల   ఆనించి   చాలా   చాలా   ఏడ్చేసాను.

“ఈ   దారిద్ర   జీవితం   నుంచి   మమ్మల్ని బయట   పడవేయి   సాయి ” అని చాలా   వేదనగా   బాబాను  అడిగాను.

మళ్ళీ  ముంబై   వచ్చెశాము   మేము. ఆ బాబా   మీద   శ్రద్ద, భక్తి   విశ్వాసం   కలిగాయి.

నాకు   ఒక   కొత్త   ఆశాకిరణం కనపడింది. మళ్ళీ   ఉద్యోగ   ప్రయత్రం   చేశాను.

ఒక  బ్యాంకు లో   ఉద్యోగం కోసం  అప్లై   చేశాను.ఇంటర్వ్యూ   ఇచ్చారు.

1991  సంవత్సరంలో  నాకు  బ్యాంకు లో  ఉద్యోగం  వచ్చింది. జాయిన్  అయ్యాను. అప్పటి   నుంచి  బాబా  భక్తుడిని అయ్యాను. బాబా  ఆశేష  కృప   వలన  మా  బీదరికం  పోయింది.కష్టకాలం పోయింది.

1991  సంవత్సరంలో  2016   ఈ  25  సంవత్సరం  నుంచి  నేను   బాబా భక్తుడిని   అయ్యాను. అనేకమైన  అనుభవాలు  చవిచూశాను.

సాయిబాబా సాయిబాబా సాయిబాబా సాయిబాబా సాయిబాబా

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.

సాయిబాబా సాయిబాబా సాయిబాబా సాయిబాబా సాయిబాబా

సాయిబాబా సాయిబాబా సాయిబాబా సాయిబాబా సాయిబాబా

సద్గురు సాయి నాధార్పణమస్తు

ఎవరయితే నా నానాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిహా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles