తుఫాను నుండి సాయిబాబావారు మమ్మల్ని రక్షించారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

తుఫాను నుంచి రక్షించారు బాబా.

ఇపుడు నేను చెప్పబోయేది 2007లో జరిగింది.

మావారు అపుడు అస్సాం,గౌహటిలో పనిచేసేవారు.మేము మాపరివారంతో సహా ఒక పెద్ద బంగ్లాలో క్రింద రూమ్ లో వుండేవాళ్ళం.

అక్కడ మూడు సంవత్సరాలు తరువాత మావారికి ఢిల్లీ transfer అయింది.

మేము చాలా సంతోషంగా ఢిల్లీ వెళ్ళిపోవాలని అనుకున్నాం.ఎందుకంటే మావూరు ఢిల్లీనే.

ఆసమయంలో ఒక రోజు రాత్రి నాకు నిద్రలో ఒక దివ్య స్వరం వినబడింది “గౌహటి పూర్తిగా నీళ్ళలో మునిగిపోతుంది”అని.

నేను ఆస్వరం విని వెంటనే నిద్ర నుంచి లేచాను,ఎవరు నాకు అలా చెప్పారు అని.

నాకు ఎవరూ కనపడలేదు.

ఆరోజులలో గౌహటిలో వాతావరణం కూడా మామూలుగానే వుండేది.బాగా ఎండగా ఉండేది.

బ్రహ్మపుత్ర నది మామూలుగానే వుండేది.

ఇంక నేను ఎదో కలలే అనుకుని మర్చిపోయినాను.ఇంతలో మళ్ళీ 10 రోజుల తరువాత అలాగే రాత్రి నిద్రలో “గౌహటి పూర్తిగా నీటిలో మునిగి పోతుంది” అదే స్వరం మళ్ళీ వినబడింది.

నేను మావారికి ఈసారి చెప్పాను ఇలా వినబడుతోంది అని.

ఎలాగూ వెళ్లిపోతాము కదా అని మా సామాన్లు అన్ని ట్రక్ లో load చేసాం.truck ఢిల్లీకి రవాణా కూడా అయిపోయింది.

కొన్ని సామాన్లు మాత్రం మాదగ్గర పెట్టుకున్నాం,ఎందుకంటే మేము train లో వెళ్ళాలనుకున్నాం.మాకు గౌహటి-ఢిల్లీ train లో 5 రోజుల తరువాత మా టికెట్ వుండినది.

ఇంతలో ఆశ్చర్యంగా గౌహటిలో మేఘాలు,మబ్బులు కమ్మేసాయి.ఆగకుండా వానపడటంమొదలయింది.

మేము వాన ఆగిపోతుందిలే,అనుకున్నాం.కాని అస్సలు ఆగలేదు.slowly మొత్తం టౌన్ తుఫానులో చిక్కుకుపోయింది.

ఎలా వెళ్ళగలం,అని నేను చాలా వేదనలో వుంటిని.

అపుడే ఆశ్చర్యం,సాయిబాబా నాదగ్గరకు వచ్చి చెప్పారు నేను చెప్పాను కదా నీకు రెండుసార్లు.గౌహటిలో తుఫాను వస్తుంది” ,వెంటనే రైల్వేస్టేషన్ కు వెళ్ళిపొండి అక్కడ రూమ్ తీసుకొని వుండండి అని చెప్పారు”.

ఇంక మేము బాబాకు మనసులో నమస్కరించుకొని వెంటనే మా కొద్ది సామాన్లు తీసుకొని వెళ్ళిపోయాము.

వెంటనే రాజధాని train లో టికెట్ తీసుకొని వెళ్ళిపోయాం.

అక్కడనుంచి మాపక్కన ఇంటి వాళ్లకు ఫోన్ చేసాం,ఎలా ఉన్నారు, మేము వెంటనే రావలసి వచ్చాము అని చెప్పాము.

అపుడు వాళ్ళు మీరు వెళ్ళడం మంచిది అయింది.మీ బంగ్లాలో మీరు ఉన్న రూమ్స్ అన్ని జలమయం అయిపోయినాయి.మొత్తం గౌహటి తుఫానులో చిక్కుకుంది,అస్తవ్యస్తం అయింది.ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షించాడు అని చెప్పారు.

ఇదంతా విన్నాక నాకు ఆ దివ్య స్వరం సాయిబాబాది మళ్ళీ నాచెవులలో ధ్వనించింది “గౌహటి పూర్తిగా నీళ్ళల్లో మునుగుతుంది” అని.

అపుడు అనుకున్నాను బాబా తననే నమ్మిన వాళ్లకు ఎలా సహాయాన్ని అందిస్తారో.స్వయంగా నాదగ్గరికి వచ్చి ఆయన స్వరం ద్వారా సంకేతాన్ని ఇచ్చారు,మమ్మల్ని రక్షించారు.మమ్మల్ని కృతార్ధులను చేసారు.

“హే సాయినాథ్ నీవు నీభక్తుల గురించి ఎంత చింత చేస్తావు,నా సంపూర్ణ జీవితాన్ని నీకే అర్పిస్తున్నాను” అని మనసులో అనుకున్నాం.

సంధ్యా చౌదరి

నొయిడా

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “తుఫాను నుండి సాయిబాబావారు మమ్మల్ని రక్షించారు.

ee leela chaduvuthunte vallu gagupodichinatlu ayindi…very thankful to Madhavi mam and Maruthi Sainathuni.

Maruthi Sainathuni

Sai Baba…Sai Baba…Sai Baba.Its my pleasure

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles