ఎప్పుడైతే బాబానే మనస్పూర్తిగా ప్రార్థించానో అపుడు ఆమెలో చలనం వచ్చింది మరియు ఆమె బాబా ఫోటో ఇచ్చి నాబిడ్డను కాపాడింది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

నేను సాయిబాబా పత్రికకి లైఫ్ member.ఎపుడు లీలలు చదివినా నాకు రాయాలనిపించేది.

అందుకే నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనివుంది.

నేను,మావారు ఇద్దరం doctors.ఆయన eyes specialist,నేను గైనకాలజి.

మా ఇద్దరి వివాహం కూడా బాబాగారి ఆశీర్వాదం వల్లనే అయింది.

నేను,నా పేషంట్ గురించి ఒక లీల మీతో పంచుకుంటున్నాను.

ఆమె నాదగ్గరికి వచ్చేముందే ఇద్దరు పిల్లలకి తల్లి.ఆమె 9th month pregnant

అన్నివిధాలా పరిస్థితి బాగున్నప్పుడు మేము నార్మల్ డెలివరీనే చేస్తాము.

ఆమె పరిస్థితి అన్ని విధాలుగా బాగనే వుండినది.

ఆమెకు నొప్పులు start అయ్యాయి.నేను ఆమెను labour రూమ్ లో పరిక్షలన్ని చేసి ఇంకా గంట పట్టచ్చు డెలివరీకి అనుకొని మా ఇంటికి వెళ్లివద్దామని వెళ్లాను.పక్కనే ఇల్లు.

కాని ఇంటికి వెళ్ళాక  ఎందుకో అయ్యో ఆమెను అలా వదిలి రావడం బాగలేదు అనిపించి రెండు నిమిషాలలో మళ్ళీ క్లినిక్ కి వచ్చేసాను.ఎప్పుడైతే నేను ఆమెను చూడడానికి labour రూమ్ లోకి వెళ్ళానో, అంతా పరిస్థితి తారుమారయింది.

ఆమె గర్భకోసం చినిగిపోయింది.ఆమెకు విపరీతమయిన చెమటలు పట్టేసి,pulse కూడా down అయిపోయింది.

నేను వెంటనే అనస్థీషియా డాక్టర్ కు ఫోన్ చేశాను వెంటనే రమ్మని.ఆయన బజారులో ఉన్నాడు వెంటనే వచ్చాడు.

పేషంట్ కు వెంటనే ఆపరేషన్ చెయ్యాలి

ఆమెను labour రూమ్ నుంచి ఆపరేషన్ theatre కు తీసుకెళ్ళాం.

ఆమె పరిస్థితి చూసి ఆ డాక్టర్ అన్నాడు “madem ఈమెకు pulse,BP ఏమి చూపడం లేదు.మీటర్ straight లైన్ వచ్చేసింది.కాని ఈమె శరీరం కొంచం వేడిగా వుంది.

ఆపరేషన్ చేస్తార అని అడిగాడు.నేను అపుడు సాయినాథుడిని తలచుకొని,”ఊ,చేస్తాం,అన్నీ బాబా చూసుకుంటారు” అని వెంటనే చెప్పాను.

ఆపరేషన్ చేసాను.అబ్బాయి,మంచిగా వున్నాడు.

కాని ఆమె మాత్రం చలనమే లేదు,అట్లని చనిపోలేదు.

నేను మాబాబాను చాలా దుఃఖంగా మనసు వికలంకాగా, ప్రార్థనచేసాను “బాబా ఇంతవరకూ నాచేతిలో ఎవరూ చనిపోలేదు,ఆపరేషన్ theatre లో నున్న DOT(death ఆన్ ఆపరేషన్ టేబుల్) అనే భయంకరమైన పరిస్థితి నుంచి రక్షించు,నువ్వే రక్ష ప్రభు అని వేడుకుంటూనే ఉన్నాను కళ్ళ నీళ్ళతో.ఆమెకు రక్తస్రావం కూడా ఆగలేదు అంతవరకు.

ఎప్పుడైతే బాబానే మనస్పూర్తిగా ప్రార్థించానో అపుడు ఆమెలో చలనం వచ్చింది.ఆమె మెల్లగా కదిలింది.

“తన బాబు ఏడీ” అని అడిగింది.ఆమెకు dressing కూడా మర్చిపోయి బాబానే తలచుకుంటున్నాను.

అపుడు నర్స్ ఆమెకు dressing చేసి ఆపరేషన్ theatre నుంచి బయటకు వచ్చింది.

అపుడు ఆ అనస్థీషియా డాక్టర్ చెప్పాడు,madem ఈమెకు నేను BP నార్మల్ అయ్యే injection మాత్రమె ఇచ్చాను,ఇంకా ఏమి ఇవ్వలేదు.

మీరు ఆపరేషన్ చేసిన చలనం లేని వ్యక్తి మీ ప్రార్థనతో జీవించి వుందంటే,ఆదైవం ఎంత కృప చూపించారో మీరే ఆలోచించండి.

నేను ఆమెకు only ఆక్సిజన్ పెట్టాను అని కూడా చెప్పాడు ఆ డాక్టర్.

ఆమె డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు నా కాళ్ళకు దండం పెట్టింది.అపుడు చెప్పింది,నాకు ఈకాన్పుకు ముందు రెండుసార్లు గర్భస్రావం అయింది అని.

నేను అన్నాను,ఈమాట నువ్వు నాకు ముందే చెప్పాలి.చెప్పనందువలన నువ్వు చావు,బ్రతుకుల మధ్య వుండినావు అన్నాను.

ఇలా రోజులు గడుస్తున్నాయి.ఆబాబా దయవలన నాపిల్లలు BITS Pilani లో చదువుతున్నారు.

మళ్ళీ 7 years తరువాత ఆమె మాఇంటికి వచ్చింది,ఒక పెద్ద బాబా ఫోటో తీసుకొని.

అపుడు,ఆసమయంలో మాఅబ్బాయికి job రాలేదని ఒకటే బాధపడేవాడు.

Bits pilani లో చదివినా మంచి job రాలేదని ఎపుడూ బాధతో పిచ్చివానిలాగ వుండేవాడు.

నేను,మావారు చాలా భాధతో ఉన్నాము.అపుడు ఈవిడ తన 7 years బాబును తీసుకొని,ఒక పెద్ద బాబా ఫోటో తీసుకొని వచ్చింది.నిజానికి నేను ఆమెను గుర్తుపట్టలేదు.

ఎవరమ్మా నువ్వు? అని అడిగాను.అపుడు ఆమె గుర్తుచేసింది,ఆరోజు బాబా కృప వలన నన్ను మీరే బ్రతికించారు.ఈ కొడుకు వాడే.ఈరోజు వాని పుట్టినరోజు,మీరు ఆశీర్వదించండి అని అడిగింది.

అపుడు నేను అన్నాను “నేను నిన్ను,నీబిడ్డను కాపాడాను అని నువ్వు అంటున్నావు,నేను “నువ్వు బాబా ఫోటో ఈరోజు నాకు యిచ్చి నాబిడ్డను కాపాడావు”అని అన్నాను.

ఆవిడ ఆశ్చర్యపోయింది.ఎలాగండీ! అని అడిగింది.

నువ్వు వచ్చి బాబా ఫోటో ఇచ్చావు,దానితో పాటు మావాడికి job వచ్చింది అని

appointment ఆర్డర్ పోస్ట్ man యిచ్చి వెళ్ళాడు.

నేను నిన్ను,నీబిడ్డను కాపాడాను.నువ్వు నాకొడుకుకు ఈబాబా ఫోటో యిచ్చి మంచి చేసావు.

కాని నిజానికి మనిద్దరికీ బాబానే అండదండలు,ఇంక నువ్వు వెళ్ళు అన్నాను.

ఆమె వెళ్ళాక ఆ ఫోటో మా అబ్బాయికి చూపించి,ఇంక బాధపడకు బాబా నీకు తోడు,నీడగా ఉంటాడు అని చెప్పాను.

అప్పటినుంచి regular షిర్డి వెళ్తాము.అంతా బాబా కృపవల్లనే జరుగుతాయి.

డాక్టర్ మాధురి గుప్త.

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

3 comments on “ఎప్పుడైతే బాబానే మనస్పూర్తిగా ప్రార్థించానో అపుడు ఆమెలో చలనం వచ్చింది మరియు ఆమె బాబా ఫోటో ఇచ్చి నాబిడ్డను కాపాడింది.

Mrekha

Sai baba saibaba

T.v.pramada

Sai ram

Maruthi Sainathuni

E baba vaari leela type chesetappudu,…”meeru operation chesina chalanam leni vyakthi mee praarthanatho jeevinchi vundante, aa daivam entha krupa choopincharo meere alochinchamdi”..ane line na manassuni kadililinchindi…aa line type cheseppudu naa kalla numdi neeru vachhayi….baba vaari leelalu chala adbhuthamu.Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles