పద్మాకర్,నిజంగానే నీబాబా చమత్కారం చేసి నాలాంటి నమ్మని వాళ్ళని కూడా తన దగ్గరికి లాగేస్తారు అన్నారు సోదీ సాహెబ్.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

మా ఆఫీసర్ సిక్కు సాబ్ అన్నాడు మీ సాయిబాబా చమత్కారాలు చేస్తాడు అని.

అది 6-jan-1980.మా డిపార్ట్మెంట్ హెడ్ ఒక సిక్కు వచ్చాడు.అతనికి బాబా మీద అసలు నమ్మకం లేదు.ఆయన పేరు సోది.

ఆయన మా ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు నేను ఆఫీస్ లో లేను.సెలవులో వున్నాను.ఎందుకంటే మా అమ్మాయి 1st birthday ఆరోజు.

ఆరోజు నాకూతురు birthday పార్టీకి మా colleague ఒక  అతను వచ్చాడు.అతను చెప్పాడు ఈరోజు ఒక సిక్కు ఆఫీసర్ join అయ్యాడు అని.

నేను మనసులో చాలా ఆందోళన పడ్డాను అది విని.ఎందుకంటే మేము ముందే విన్నాం ఆయన గురించి,ఆయనకు చాలా అహంకారం వుంది అని.

కాని కొన్నిరోజులు అతనితో కలిసి పనిచేసాక నేను,సోది సాహెబ్,పద్మాకర్ మంచి స్నేహితులం అయ్యాం.

ఒకరోజు సోదీ సాహెబ్ ఆయన cabin లో వున్నారు.చాలా చింతతో,అనారోగ్యంతో వున్నట్లుగా వున్నారు.

అది చూసి మేము అతని cabin కు వెళ్ళాలనుకున్నాం కాని అతను మమ్మల్ని రానివ్వలేదు.మేము వెనక్కు వచ్చేసాము.

సాయంత్రం office అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి పలకరిద్దాం అనుకొని ఆయన cabin కు వెళ్లాం.

అపుడు ఎందుకు సర్,అలా ఉన్నారు?అని అడిగాము.నేను ఒక పెద్ద సమస్యలో ఉన్నాను,నాకు చాలా డబ్బు అవసరమైంది.నాకు ఏమి చేయాలో తెలీడం లేదు అని దుఃఖపడ్డాడు.

పద్మాకర్ అపుడు తన దగ్గర వున్న రామబాణాన్ని వేసాడు.

సాబ్,మీరు బాబాను ఎందుకు ప్రార్థన చేయరు,చెయ్యండి సార్ ఆయన అన్ని సమస్యలు సమాధానం చేస్తారు అన్నాడు.

ఇంతలో సోదీ సాహెబ్ కు కోపం వచ్చి “అరే నీబాబా ఏమి చేస్తాడు,ఎపుడు చూసిన బాబా,బాబా అంటావు” అని విసుక్కున్నారు.

అపుడు పద్మాకర్ అన్నాడు,మీకు సాయిబాబా అంటే నమ్మకం లేకపోవచ్చు కాని మీఇంట్లో మీభార్య,తల్లిదండ్రులు,బంధువులు ఎవరో ఒక్కరన్నా వుంటారు కదా బాబాను నమ్మేవాళ్ళు.

వాళ్ళ దగ్గర ఖచ్చితంగా బాబా ఫోటో వుంటుంది “ఫోటో చూసి ఏమి చేస్తావు నువ్వు బాబా.అందరూ నిన్ను నమ్ముతారు” అని ప్రశ్నలు అడగండి.అపుడు చూడండి ఏమైతుందో అన్నాడు.

తరువాతరోజు సోది సాహెబ్ చాలా సంతోషంగా office కు వచ్చాడు.ముందు నన్ను cabin కు పిలిచాడు.నేను భయపడుకుంటూ వెళ్లాను.అపుడు అన్నాడు “అరే,మీసాయిబాబా చాలా చమత్కారం చేసాడోయ్” అన్నాడు.

ఏమైంది సార్?అన్నాను.నువ్వు చెప్పినట్లు రాత్రి “బాబాను దబాయించి అడిగాను”.ఈరోజు పొద్దున ఒక అతను వచ్చి ఎపుడో నేను ఆయనకు పైసలు ఇచ్చానంట అవి return చేసి వెళ్ళాడు.ఆవిషయం నేను మర్చిపోయాను.అది చాలా పెద్ద amount.అతను తర్వాత నాకు కనపడలేదు.ఈరోజు పొద్దున వచ్చి యిచ్చి వెళ్ళాడు.

పద్మాకర్,నిజంగానే నీబాబా చమత్కారం చేసి నాలాంటి నమ్మని వాళ్ళని కూడా తన దగ్గరికి లాగేస్తారు అన్నాడు.

తరువాత కొన్ని రోజులకి అతనికి heart ఆపరేషన్ అయింది.దాని గురించి అడిగితే “నాకు ఏమి problem లేదు,అన్ని బాబా చూసుకుంటాడు,”అన్నాడు.

చూడండి బాబాను సందేహించే వాళ్ళు కూడా గుండె ఆపరేషన్ అన్నా భయపడని స్థితికి బాబా తెస్తారు.

జై సాయిరాం.

సూర్యకాంత యాదవ్.

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles