బాబానే గోవింద పాటిల్ రూపంలో వచ్చి 40 మంది తన భక్తులను రక్షించారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

శరీరం వదిలి వెళ్ళినా,నా భక్తుల కోసం నేను మళ్ళీ పరుగులు పెట్టుకుంటూ వస్తాను.ఇది నిజం మీరే చదవండి.

మాకు కాలం ఆసన్నమైంది కాని సమయం ఇంకా రాలేదు.

ఆరోజు 22-3-2010.నేను  అందరితో కలిసి శ్రీక్షేత్రం షిర్డికి వెళ్లాను నా స్నేహితులతో రామనవమి ఉత్సవాలకోసం.

నేను రామనవమి,గురుపూర్ణిమ,దసరాకి సాయిబాబా దర్శనం చేసుకోవడం కోసం షిర్డి వెళ్తాను ప్రతి సంవత్సరం.

ఆరోజు 25-3-2010.మధ్యాహ్నం గోపాల్ కాలా ఉత్సవం చూసి,ప్రసాదం తీసుకొని ఒక ప్రవేట్ బస్సులో వెనక్కి వెళ్దాం అనుకున్నాను.

దగ్గర దగ్గరగా 4 నుంచి 4.15 లోపల 1 NO నాసిక్ రోడ్ దగ్గర బస్సు పంచర్ అయింది.అది బాగు అయినాకనే మేము ముందుకు పోగలము.

ఆసరగావ్  నుంచి షహపుర్ మధ్యలో బస్సు 90 నుంచి 100km వేగంగా పోతోంది.

అపుడే బస్సు యొక్క వెనకాల wheel ఒక్కొక్కటిగా అన్ని screws విరిగి పడిపోతున్నాయి.

అపుడే మా బస్సు వెనకాల తన motor సైకిల్ లో గోవింద పాటిల్ అనే అతనికి అది కనపడింది(అంటే బస్సు screws పడిపోవడం).

అందువలన అతను రాబోయే కష్టాన్ని ముందే ఊహించి అతను మాబస్సు వెనకాల 100km వేగంతో వచ్చి ,మా బస్సు డ్రైవర్ కు చెప్పాడు.

బస్సు ఆపు,ఆపు అని గట్టిగా అరచి చెప్పాడు.బలవంతంగా బస్సును ఆపించేసాడు.అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు.

అందరు బాబానే స్మరణ చేసుకుంటున్నారు.ఏమైందో తెలీదు ప్రయాణికులకు.

క్రిందికి దిగారు అందరూ.చూస్తే అన్ని wheels screws పడిపోయినాయి.ఒక్కటి మాత్రం కొంచెం వుంది అంతే.

40 మంది ప్రాణాలు రక్షించబడినాయి.బస్సు repair కోసం garage కు పంపారు.

కాని repair ఇంత తొందరగా అవ్వదు అన్నారు.

ఏమి చేయాలి అని అందరూ ఆందోళనగా గోవింద పాటిల్ నే అడగాలనుకున్నారు.చూస్తే ఎక్కడా అతను కనపడలేదు.motor సైకిల్ లేదు.

అందరూ ఆశ్చర్యంతో నోర్లు తెరచుకొని చూస్తున్నారు.

తరువాత ఆ డ్రైవర్ ను అందరూ “ముందు చూసుకోవద్దా నీ వలన 40 మంది ప్రాణాలు పోయేవి” అని గొడవపడ్డారు.

ఇంతలో బాబా కృపవలన ఆ కంపెనీ bus ఇంకొకటి వస్తూ కనపడింది వీళ్ళకు.అమ్మయ్య అనుకున్నారు అందరూ.

ఇక్కడ బాబానే గోవింద పాటిల్ రూపంలో వచ్చి 40 మంది తన భక్తులను రక్షించారు.

మళ్ళీ bus కంపెనీ వాళ్లకు ఫోన్ చేసి ఇంకో బస్సు తెప్పించి,అందరిని వాళ్ళ వాళ్ళ  ఇండ్లకు క్షేమంగా చేర్చారు.

ఇలా చేసి బాబా తన మాటను నిలబెట్టుకున్నాడు, “నా శరీరం వదిలి వెళ్ళినా కూడా నా భక్తుల సంరక్షణార్థం తప్పకుండా తిరిగి వస్తాను” అని ప్రమాణంగా చూపించారు మనకు.

ఓం సాయి,శ్రీ సాయి,జయ జయ సాయి.

సర్వం సాయినాథార్పనమస్తు.

పురుషోత్తమ్.విఠల్ బావకర్

ముంబాయి.

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles