Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
శ్రీ R.మెర్ వాలా గారు running train నుండి పడిపోతున్న తనని బాబావారు ఎలా రక్షించారో ఇలా చెప్తున్నారు.
నేను ముంబాయిలో వకీలుగా పనిచేసేవాడిని.
నేను దేవి,దేవుళ్ళను అంత నమ్మేవాన్ని కాదు.కాని సాయిబాబా మీద నమ్మకం వుండేది.
అది 1963 సం||.ఒకరోజు లోకల్ train నుంచి ప్రయాణం చేస్తున్నాను.train లో చాలా మంది జనం ఉన్నారు.
అందుకని నేను entrance దగ్గరే నిలబడి ఉన్నాను.లోపల అంతా తోపులాటగా ఉంది.
అంతలో నేను క్రిందబడబోయాను running train నుంచి పడిపోతున్నాను,ఇంతలో మనసులో బాబా స్మరణ చేసుకున్నాను.
ఎలా వచ్చారో,ఎక్కడ నుంచి వచ్చారో ఒక వృద్ధ వ్యక్తి వచ్చి ఆ స్ప్రింగ్ ని పట్టుకొని లాగారు.train ఆగిపోయింది.
ఇంతలో train staff వాళ్ళు వెతికారు,ఎవరు లాగారు అని అడిగారు.
ఆ వృద్ధ వ్యక్తి ఇంక కనపడలేదు.అందరు ఆశ్చర్యచకితులు అయ్యారు.
నేను ఇంటికి వెళ్లి అంతా చెప్పాను ఇలా జరిగింది అని.
ఈ సంఘటన జరిగిన 11 సం||ల తరువాత మా అబ్బాయి ఒక సత్పురుషుడిని కలవడానికి “చాలీస్ గావ్”అనే పల్లెకు వెళ్ళాడు.
ఆ సత్పురుషుడు అడిగాడు, ఏమి నేను ఆరోజు మీ నాన్నను train నుంచి పడబోతుంటే రక్షించాలేదా!.
అంతే అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు.
దీనివలన స్పష్టమవుతుంది “బాబా సర్వ వ్యాపకుడు,జగదీశ్వరుడు అని, పిలిచిన వెంటనే సమయానికి వస్తారని తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారు అని”
R.మెర్ వాలా
ముంబాయి
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా స్మరణ మాత్రం చేతనే భయానకమైన Train Accident నుంచి రక్షించబడిన సాయి భక్తులు–Audio
- Merciful Sai sending Udhi prasad to a devotee
- Sai Saves a devotee from Train Accident
- SAI BABA SAVED A GRANDMOTHER FROM BEING RUN OVER BY TRAIN
- సాయినాథుడు train లో శ్రీమతి మణిశంకర్ ను రక్షించిన విధానం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments