విభూదితోనే నాభార్య కష్టం దాటుకుంది.ఆ హనుమాన్ సాయిబాబా రూపములో వచ్చారు అని నాకు అనిపిస్తుంది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

నా పేరు పద్మరామస్వామి.

మా family ఫ్రెండ్ K.గోపాలకృష్ణగారిని బాబా ఎలా తన భక్తునిగా మార్చుకున్నారో ఆయన మాటలలో విందాము.

2015 జూన్ 10th నేను మాములుగా ఆఫీస్ కు వెళ్లాను.

నా భార్య ఇంటి పనులు చూసుకుంటూ ఉంది.

సాయంత్రం 5 గంటలకు sudden గా తలనొప్పి మరియు రెండు భుజాల నొప్పి.భరించరాని నొప్పితో మంచం మీద కూడా కూర్చోలేకపోయింది.

ఆనొప్పి కాళ్ళను కూడా పట్టేసింది.

ఇంతలో మాఇంటికి దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి పిలిచింది.

వెంటనే ఆవిడ వచ్చి చూసేసరికి నాభార్య డ్రాయింగ్ రూమ్ లోనే క్రిందపడివుంది మరియు చెమటతో తడిసిపోయివుంది.

నాభార్య కొంచెం స్పృహలో ఉంది.తనకు కలిగిన బాధ ఆ ఫ్రెండ్ కు చెప్పింది.

ఫ్రెండ్ తో అనింది నా తమ్ముని భార్య డాక్టర్ డ్యూటి నుండి వచ్చుంటే రమ్మను అని.

ఆవిడ ఇంతలో డ్యూటి నుండి వచ్చి ఫస్ట్ BP చెక్ చేసింది.BP 170/130 మరియు pulse rate(108) వుంది.

ఇంతలో నాభార్యకు వాంతులు కూడా మొదలయ్యాయి.

ఆ డాక్టర్ first aid tablet ఇచ్చి heart attack రాకుండా చూసుకుంది.

ఇవన్నీ నాకు తెలీదు.నేను ఇంకా ఆఫీస్ లోనే ఉన్నాను.

ఇంతలో నేను,నాకొడుకు ఆఫీస్ నుంచి దగ్గర దగ్గరగా 7.00 కు తాపీగా ఇంటికి వచ్చాము.ఎందుకంటే మాకు ఏమీ తెలీదు.ఇవన్నీ విని మేము ఆశ్చర్యపోయాము.

ముందురోజు కూడా BP 130/80 వుంది.మేము నాభార్యను హాస్పిటల్ లో అడ్మిట్ చేసాము.

Heart attack కాకపోయినా డాక్టర్ ICU లో పెట్టారు.ECG నార్మల్ ఉంది.

రాత్రి 10.00 గంటలకు డాక్టర్ CT scan చేసారు.అపుడు తెలిసింది ఆవిడకు brain haemorrhage. అని.

అపుడు డాక్టర్ చెప్పినట్లు వేరే హాస్పిటల్ కు వెళ్ళాము. అక్కడ cerebral angiography చేసారు 11th జూన్ మరియు డాక్టర్ అన్నారు ఒక సర్జికల్ ట్రీట్మెంట్ కూడా చెయ్యాలి,చాలా ఖర్చు అవుతుంది అని.

అయినా మా దగ్గర మెడికల్ policies ఉన్నందువలన సర్జరి చెయగలిగాము నెక్స్ట్ డే అంటే జూన్ 12th.

అపుడు అంటే జూన్ 12th సాయిబాబా మా జీవితంలోకి వచ్చారు 1st టైమ్.

నేను బాబా భక్తుడిని కాదు,హనుమాన్ భక్తుడిని గత 35సం|| నుండి.

హనుమంతుడి ని దర్శించుకొని హాస్పటల్ వెళ్తున్నాను.ఎందుకో కొన్ని అడుగుల దూరంలో సాయిబాబా నాతో వస్తున్నారు అనిపించింది.

నాతో సాయిబాబా “నీ భార్య ఆరోగ్యం బాగుంది,నా సంరక్షణ లోనే ఉంది.త్వరలోనే ఇంటికి వెళ్తుంది భయపడకు” అన్నట్లు అనిపించింది.

అపుడు నాకళ్లలో నీళ్ళు, మనసులో భక్తి భావం,ధైర్యం అన్నీ కలిసి సంతోషంగా హాస్పటల్ వెళ్లాను.

అక్కడ first టైమ్ పెద్ద సాయిబాబా ఫోటో చూశాను.

ఆయన ఆశీర్వాదం ఇస్తున్న చేయి చూడగానే అనిపించింది బాబా నా జీవితంలోకి వచ్చేశారు అని.

ఇదంతా నేను నాభార్య ఫ్రెండ్ తో share చేసాను.

అపుడు ఆమె చెప్పింది మీ వైఫ్ కు first రోజే అంటే జూన్ 10thనేను విభూది పెట్టాను అని.

అది విని జూన్ 10th బాబా మాఇంటికి వచ్చారు అనుకున్నాను.ఆవిడ విభూది ప్యాకెట్,సాయి సచ్చరిత్ర బుక్ నాకు యిచ్చి రోజు పారాయణ చెయ్యమని చెప్పింది.

ఆవిడ నాభార్యతో హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా రెండు,మూడు సార్లు క్రిటికల్ అయింది నాభార్యకు.

విభూదితోనే ఆమె కష్టం దాటుకుంది.అప్పటినుంచి నేను బాబా భక్తుడిని అయ్యాను.బాబా టెంపుల్ కు వెళ్ళాను.

భజనలు,పాటలు పాడతాను.

నావైఫ్ ను డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చాము.మలయాళం మా మాతృ భాష.

sudden గా ఆమె మలయాళం మాట్లాడడం మానేసింది.హింది మాట్లాడడం start చేసింది.

డాక్టర్ ని consult అయ్యాము.ఆయన అన్నారు brain haemorrhage వలన భాష మర్చిపోయింది.కొన్నిరోజుల తరువాత రావచ్చు అన్నారు.

మళ్ళీ 2015 జూలై లాస్ట్ వీక్ నిదానంగా మలయాళం కూడా ఆమెకు వచ్చేసింది.3 months సెలవు పెట్టి నాభార్యకు తోడుగా ఉన్నాను.

Continuous గా పారాయణ,హారతులు చేస్తున్నాం.

నాభార్య కూడా బాబా పారాయణ చెయడం start చేసింది.

ఇపుడు ఇంట్లో అందరూ బాబా భక్తులం అయ్యాం.

నేను ఒక భజన మండలితో షిర్డి వెళ్లాను.

August 15th సమాధి మందిరంలో ఒక పూజారి నాకు బాబా ఉన్న ఫోటో ఇచ్చారు బాబాగారి సమాధి దగ్గర.నాకు కళ్ళలో నీళ్ళు అలా తిరుగుతున్నాయి.

గురుస్థాన్ దగ్గర ఒక పూజారి వేప చెట్టు ఆకులు తెచ్చి ఇచ్చారు.బాబా ఫోటో దగ్గర ఇంట్లో పెట్టుకో అన్నారు.

అలా రోజు బాబా blessings నాకు అందుతూ ఉన్నాయి.

నేను మొత్తం బాబాకు surrender అయ్యాను.

ఆ హనుమాన్ సాయిబాబా రూపములో వచ్చారు అని నాకు అనిపిస్తుంది.

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “విభూదితోనే నాభార్య కష్టం దాటుకుంది.ఆ హనుమాన్ సాయిబాబా రూపములో వచ్చారు అని నాకు అనిపిస్తుంది.

naku baba help kavali plzzzzzz help me baba

Maruthi Sainathuni

Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles