చలనం రావటం గమనించిన డాక్టర్ ఆశ్చర్యపోయి ఇది నిజంగా మీరు కొలిచే ఆ సాయిబాబా లీలే అన్నారు.–13



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగిరాజ

పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు  సాయినాథ్ మహారాజ్ కి జై

కర్నూలు వాస్తవ్యులు వీరభద్రప్పగారు తెలిపిన బాబా లీల ….

1 -12 -2003 న నా స్నేహితుడు ఫక్కిరరెడ్డిగారి కూతురు శిరీష M .B .B .S చదువుతూ ఉండగా ఆరోగ్యం బాలేక కోమాలోకి వెళ్ళింది.

డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా లాభం లేదు, ఇంక బ్రతకదు అని చెప్పారు.న స్నేహితుడు నాకు ఫోన్ చేసి విషయం చెప్పగానే నేను దైర్యం చెప్పి వెంటనే మా బాబా మందిరానికి వెళ్లి బాబాకు పండ్లు నివేదనగా పెట్టి,న స్నేహితుని బిడ్డను కాపాడమని బాబాను ఆర్తిగా అర్ధించాను.

బాబా నా మొర ఆలకించారు.మరుసటి రోజు ఉదయం శిరీష కాలు కదపటం డ్యూటీ నర్స్ చూసి డాక్టర్ కి చెప్తే ఆయన నమ్మలేదు.

కాసేపాగి శిరీష లో చలనం రావటం గమనించిన డాక్టర్ ఆశ్చర్యపోయి ఇది నిజంగా మీరు కొలిచే ఆ సాయిబాబా లీలే అన్నారు.

శిరీష కోమా నుండి బయటకు వచ్చింది.5  రోజులలో పూర్తిగా కోలుకుంది,హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసారు.

నా స్నేహితుడు  వెంటనే షిర్డీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని బాబాకు తన హృదయపూర్వ నమస్కారాలు తెలుపుకున్నారు.కానీ షిర్డీ వెళ్లేముందు నాకు కూడా థాంక్స్ చెప్పాడు.కానీ నేను దానికి బదులు ఒకటి చేయాలని నియమం పెట్టాను.తాను సరే అని షిర్డీ వెళ్లి వచ్చాక నన్ను ఏమి కావాలి అని అడిగాడు.

నేను మనకర్నూల్ బాబా మందిరం లో బాబాకు ఒక గులాబీ పూలదండ, ఒక 6  మీటర్ల వస్త్రం,ఒక శాలువ,బాబాకు అభిషేకం చేయించమని చెప్పాను.అది విని ,నువ్వు  డబ్బులు ఇవ్వమంటావు అనుకున్న కానీ బాబాకు సేవ చేయమన్నావు,చాల సంతోషం అన్నాడు.

దీంట్లో  నేను చేసింది ఏమి లేదు,బాబానే నీ బిడ్డను కాపాడాడు అన్నాను .బాబానే మన అందరి రక్షకుడు.

బాబా దయవలన ఇప్పుడు శిరీష డాక్టర్ అయ్యి పేదలకు సేవ చేస్తుంది.

ఈ  బాబా లీలను నేను స్వయంగా  చూసాను.కాబట్టి బాబా ఎప్పుడు తన భక్తులను వెన్నంటి కాపాడతారు అనేందుకు ఇదే నిదర్శనం .

                                             -సద్గురు సాయినాధార్పణమస్తు-

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “చలనం రావటం గమనించిన డాక్టర్ ఆశ్చర్యపోయి ఇది నిజంగా మీరు కొలిచే ఆ సాయిబాబా లీలే అన్నారు.–13

Sreenivas

Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles