నాకు మంచి ఉద్యోగం,ఆర్థికస్థితి ఇప్పించమని బాబాని వేడుకునేవాడిని.–14



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నేను ఉండగా నా భక్తుని ఇంట అన్న పానీయాలకు లోటు ఏల….

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగి రాజ

పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు  సాయినాథ్ మహారాజ్ కి జై

సాయిబంధువు ,షిర్డీ వాస్తవ్యులు అయిన దేశముఖ్ గారి అనుభవం తెలుసుకుందాము….

మాది ఉమ్మడి కుటుంబం.నేను 25 సంవత్సరాల క్రితం మా కుటుంబ కలహాలవల్ల అనుకోకుండా షిర్డీ రావటం జరిగింది.నాకు అప్పుడు షిర్డీలో ఎటువంటి ఉద్యోగంలేదు.

ఇంటినుండి తెచ్చుకున్న కొంత డబ్బుతోనే షిర్డిలో ఉండేవాడిని.

ఒక వ్యాపకంగా,ప్రతిరోజు మొదట్లో బాబా మందిరానికి మాములుగా వచ్చేవాడిని.

బాబా మీద నాకు తెలియకుండానే ఆకర్షితుడనయ్యాను.

రోజు బాబా మందిరానికి వచ్చి దర్శనం చేసుకోవటం,దాదాపు రోజు మొత్తం బాబా దగ్గరే ఉండటం చేసేవాడిని.

నాకు మంచి ఉద్యోగం,ఆర్థికస్థితి ఇప్పించమని బాబాని వేడుకునేవాడిని.అలా చాలా రోజులు గడిచాయి.

ఒకరోజు నేను దర్శనం కోసం వచ్చాను.

క్యూలో నాతో నడుస్తున్న ఒక వ్యక్తి తనంత తానే నన్ను పలకరించి,నాకు ఎటువంటి ఉద్యోగం లేదు అని తెల్సుకుని తనది ఢిల్లీ లో ఒక transformers shop అని చెప్పారు.తనతో పాటు  ఢిల్లీరమ్మని,నాకు ఆ వర్క్ నేర్పిస్తా అని చెప్పారు.

నేను బాబా మీద భారం వేసి నాకు కొత్తగా పరిచయం అయిన  అతనితో వెళ్ళాను.ఆయన మాట ఇచ్చినట్లుగానే వర్క్ బాగా నేర్పారు.

కొన్ని రోజులు అక్కడ వర్క్ చేసాక నేను షిర్డి తిరిగి వచ్చి సొంతగా వ్యాపారం పెట్టుకున్నాను.మెల్లిగా వృద్ధిలోకి వచ్చాను.

 ఒక సంవత్సరం బాబాని ప్రార్దించాక,బాబా తన సమక్షంలోనే వేరే వ్యక్తి ద్వారా సహాయం అందేలా చేసారు.

ఇది ఖచ్చితంగా  బాబా కృప అని ఘంటాపదంగా  చెప్పగలను.నాకు మంచి స్వయంఉపాధి,వివాహం,నా పిల్లల భవిష్యత్తు విషయంలో బాబా అనుక్షణం చాలా సహాయం చేసారు.

నేను షిర్డిలోనే స్థిరపడ్డాను.ఇంక బాబాని వదలలేను.

”బాబా ఒక అయస్కాంతంలాంటివారు.ఎందుకంటే ప్రతి సాయిభక్తుడు బాబాను అంతరంగంలో తనసొంత కుటుంబ సభ్యుని మాదిరి అనుకోవటం సహజం.

భక్తులు ఆయనఫై చూపించే ఆప్యాయతను,తిరిగి బాబా మనపట్ల  ఆయనకి ఉన్న ప్రేమను ,లీలలద్వారా చూపించి   భక్తులను కట్టిపడేస్తారు.”

“ఆయన సాక్షాత్తు దత్త స్వరూపమైన లీలావిశ్వంభరుడే.” ఇలా అనటానికి నిదర్శనం షిర్డికి ప్రతి రోజు వచ్చే అసంఖ్యాకభక్తులే

                                                      –  సద్గురు సాయినాథార్పణమస్తు  –

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “నాకు మంచి ఉద్యోగం,ఆర్థికస్థితి ఇప్పించమని బాబాని వేడుకునేవాడిని.–14

Sreenivas

Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles