ఏ ఉద్యోగం లేదు అని బాధ పడుతున్న నాకు, తన గుడిలోనే ఉద్యోగం ఇప్పించిన బాబా వారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


గోపాలకృష్ణ గారి అనుభవములు రెండవ భాగం

ఆ మధ్యన నేను కొన్ని రోజులు ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేశాను. అది కొన్ని రోజుల క్రితం నేను మానేసాను.

6 నెలల పాటు పని లేక ఖాళీగా ఉండవలసి వచ్చింది. ఇద్దరం సంపాదిస్తూంటేనే గడవని కాలం. మా ఆవిడ ఉద్యోగం చేస్తున్నా తన జీతం ఇంటి అవసరాలకి సరిపోవడం లేదు.

అక్కడా ఇక్కడా జాబ్ కోసం ప్రయత్నిస్తూన్నాను కానీ, నా ప్రయత్నానికి ఫలితం ఏ మాత్రం లేదు.

రోజు రోజుకి నా పరిస్థితి దిగజారి పోతుంది. ఆ సమయంలో నా ఫ్రెండ్ ప్రసాద్ ఒక సారి వచ్చాడు. నన్ను నా వాలకాన్ని గమనించి “గోపాల్ మనిద్దరం ఒక సారి షిరిడీకి వెడదామా” అని అడిగాడు.

నా పరిస్థితి అంతా మా వాడికి తెలుసు. అలాగే ఉంటే నేనేమై పోతానోనని కూడా మా వాడు మరీ ఈ ఆలోచన చేసి ఉంటాడు.

వెళదామంటే అంటే వెడదామనుకున్నాం ఇద్దరం బయలుదేరి రైల్వేస్టేషన్ కు వెళ్లి, మాకు రిజర్వేషన్ ఎం లేదు, కాబట్టి వెళ్లి జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాము.

టాయిలెట్స్ దగ్గర నిలబడ్డాం. ఇసక వేస్తే రాలనంత జనం. విపరీతమైన వాసనలు వస్తున్నాయి.

నిలబడలేకపోతున్నాము. ఆ బాధకి రైలు దిగి పోదాం అనుకున్నాము కూడా. చాలా చిరాకుగా ఉంది.

ఈ లోపల T .C వచ్చాడు. ఆయనతో మా ప్రసాదు “T .C గారూ! మాకు ఎమన్నా రెండు బెర్తులు దొరుకుతాయా? అని అడిగాడు. ఆయన బెర్తులు లేవు సార్ అన్నాడు.

మీరు ఎలాగైనా, హెల్ప్ చేస్తే ఇక్కడే అక్కరలేదు, A / C లో నైనా పరవాలేదు, నేను మీకు కావలసిన డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు మా వాడు.

అప్పుడు T .C నసుగుతూ “ఇక్కడ లేవండీ రెండు బెర్తులు A / C  లో ఉన్నాయి. అవి ఇప్పటిదాకా ఎవరడిగినా ఇవ్వలేదు. ఎందుకో మరి మీకివ్వాలనిపిస్తుంది అంటూ ఇచ్చాడు.

మేము జై సాయినాధ అంటూ పక్క స్టేషన్ లో దిగి మాకు కేటాయించిన బెర్తులు ఎక్కి రాత్రంతా హాయిగా నిద్రపోయి సుఖంగా షిరిడీకి చేరాము.

చూసారా సీట్ రిజర్వేషన్ కూడా లేని మాకు, ఎంతో దయతో సాయినాధుడు ఏసీ లో బెర్తులు ఇప్పించి ఎంతో సుఖంగా షిరిడీకి పిలిపించుకున్నారు.

అక్కడికి వెళ్ళాక, మేము బాబా దర్శనానికి వెళ్లి, బాబా ఎదురుగా నిలబడి, నా బాధనంతా వెళ్లగక్కుకున్నాను.

“బాబా ఏమిటయ్యా! నీ చర్యలకి అర్ధం. భార్యాభర్తల మిద్దరమూ సంపాదిస్తూంటూనే రోజులు గడవటం కష్టం అవుతుంది. ఆ సంగతి నీకూ తెలుసు, నీకూ తెలియదని చెప్పడం లేదు,

ఇప్పుడు నాకు 53 సంవత్సరాలు. ఈ వయసులో నాకు ఉద్యోగం ఎవరు ఇస్తారు. నేనీ ఉద్యోగాన్వేషణ ఎలా చెయను. నేనింకా తిరిగి హైదరాబాద్ కి వెళ్ళను. ఇక్కడే ఉండిపోతాను. నువ్వే ఒక దారి చూపించు బాబా” అంటూ సమాధి మందిరం లో గట్టిగా ఏడ్చాను.

నా బాధ వర్ణనాతీతం. కాసేపటికీ తమాయించుకున్నాను. ఒక రోజు అయ్యాక తిరిగి హైదరాబాద్ వచ్చేసాము.

ఇంటికి రాంగానే నాకు తెలిసిన ఒకాయన (నాగేశ్వర రావు గారు) కనపడి, “గోపాల్! నీవు ఏదో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావుగా నాకు తెలిసిన గుడిలో ఒక మనిషి కావాలంటున్నారు. మీరు వెడతారా అని అడిగారు.

నేను సంతోషంగా ఎక్కడా? ఏ గుడీ? అనడిగాను. దానికాయన లోయర్ ట్యాంకుబండ్ లో బాబా గుడిలో అన్నాడు.

బాబా గుడి అనగానే నేను చాలా ఆశ్చర్యపోయి, ఎగిరి గంతేసినంత పని చేసి సరేనని, వాళ్ళు జీతం ఎంత ఇస్తారనేది కూడా నేను ఆలోచించ లేదు.

బాబా గుడి, బాబా సేవ అంతే! అనుకున్నాను. ఆ ఉద్యోగం లో మరునాడే చేరిపోయాను.

నేనా ఉద్యోగంలో బాబా నాకిది చూపించాడన్న భరోసా తోనే ఒప్పుకున్నాను. నేనక్కడ పని చెయ్యడం నా భాగ్యంగా భావించాను.

అక్కడ నేను 6 నెలలు పని చేశాను. ఆ తరువాత నా బావమరిది స్నేహితుడు నన్ను వాళ్లకి తెలిసిన ఒక కంపెనీ లో నెలకి  Rs . 18000 /- రూపాయలు, గుడిలో నేను చేసే ఉద్యోగానికి మూడు రెట్లు జీతం ఇప్పించాడు బాబా.

అది కూడా ఎటువంటి ఇంటర్వ్యూ లు లేకుండా నన్ను కంపెనీ తీసుకుంది.

ఈ రోజు నా జీతం బాబా దయ వల్ల Rs . 25000 /- రూపాయలు. ఇస్తున్నారు. మేనేజర్ క్యాడర్ వాళ్లకి ఎవ్వరికీ ఇన్సెంటివ్స్ ఇవ్వరు కానీ నాకు బాబా ఒకే సంవత్సరం లో రెండు సార్లు ఇన్సెంటివ్స్ వచ్చేలా చేసాడు.

నాకు జరిగేవన్నీ గురువారం నాడే జరుగుతాయి. అది నా నమ్మకమో, బాబాలీలో తెలియదు.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

గోపాలకృష్ణ గారి అనుభవములు మూడవ భాగం తరువాయి….

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “ఏ ఉద్యోగం లేదు అని బాధ పడుతున్న నాకు, తన గుడిలోనే ఉద్యోగం ఇప్పించిన బాబా వారు

Archana

Jai sai ram nenu archana ni nakadtalu kuda teruchu baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles