Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
1993 వ సం”లో కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఆ పుష్కరాలకి మా వారు నన్ను తిసుకువెళ్ళారు.
అక్కడ స్నానాలు అవీ అయ్యాక నేను ఒక పుస్తకాల షాపు ముందునుంచుని అందులో పుస్తకాలు చూస్తున్నాను.
నాకు ఆ షాపులో శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకం పైన కళ్ళు నిలబడున్నాయి. అది గమనించి నాకు మా వారు ఆ పుస్తకము కొనిచ్చారు.
నా పెళ్ళి అయ్యాక నాకు మావారు ఇచ్చిన మొదటి కానుక అది. అది నా చేతిలోపెట్టారు. కానీ, నేను ఏనాడూ ఆ పుస్తకం తెరిచి చదివే పని పెట్టుకోలేదు.
మా ఇంటి దగ్గర ఒకళ్లింట్లో రామ్ రతన్ జీ బాబాగారు జ్యోతిపెట్టారు. అక్కడ ఏడు వారల పాటు ఏడుగురు శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకాలు చదవాలి.
అక్కడకెళ్ళి నేను పారాయణం మొదటి సారిగా చేశాను. ఆ తరువాత మరొకరి ఇంట్లో కూడా ఇలాగే జ్యోతిని పెట్టుకున్నారు . వారింట్లో కూడా నేను శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం చేయడం జరిగింది.
ఆ తర్వాత 2004లో మా వారికి ఒంట్లో బాగుండక హాస్పిటల్ లో చేర్చించాము. చాలా సీరియస్ అయ్యింది. డాక్టర్స్ అందరూ మా వారు బ్రతకరు అని చెప్పేశారు.
ట్రీట్మెంట్ అయ్యాక అక్కడ డాక్టర్ నీ తాళిబొట్టు గొప్పదంది. నేను మనసులోనే బాబాకి నమస్కరించుకున్నాను.
ఆ తరువాత మూడు రోజులకే మా వారికి ఉన్నట్టుండి యూరిన్ బంద్ అయిపోయి అది గుండెలోకి ఎగదన్ని చనిపోయారు.
నా కళ్ళ ముందంతా చీకట్లు అలుముకున్నాయి. ఇన్నాళ్ళ నుండి నేను బాబాను పూజిస్తే నాకు ఆయన ఇచ్చిన ఫలితం ఇదా? ఇంక ఏమైనా కూడా బాబాకు పూజ చేయకూడదు అని తీర్మానించుకున్నాను.
బాబాకి పూజ చేయటం మానేశాను. ఆయనకి నేను పూజలు చేస్తే నాకు ఆయన ఇచ్చింది ఇదా అన్నదే నా బాధ, ఆలోచన,
అలా చాలా రోజులు నేను బాబా పూజలు మానుకున్నాను. బాబా గుడికి కూడా వెళ్ళలేదు. ఆయన మీద కోపం.
ఒకసారి మా మేనమామ గారి భార్య (అత్తమ్మ) మా ఇంటికి వచ్చింది. నన్నూ నావాలకాన్ని గమనించింది.
దేవుడు గూట్లో ఉన్న బాబా విగ్రహానికి కళా కాంతులు లేవు. మట్టికొట్టుకొని పోయి ఉన్నాయి విగ్రహాలన్నీ.
అది చూసి మా అత్తమ్మ “ఎందుకు నువ్వు బాబా పూజలు చేయడం లేదు” అని అడిగింది.
“ఏమిటి అత్తా! విషయం తెలిసికూడా ఇలా అడుగుతావు. ఆయన పూజ, సేవ చేసినందుకు నాకు ఎంత పెద్ద శిక్ష వేసాడో చూసావుగా. ఇంకా ఆయన్ని ఎలా పూజించమంటావు అన్నాను (ఏడుస్తూ).
దానికి అత్తమ్మ, “చూడు నళినీ అలా ఎప్పుడూ అనుకోకూడదు, మనం బజార్ కి వెళ్ళి ఏమయినా కాయలో, పండ్లో కొనాలనుకుంటే ఏం చేస్తాము. ముందుగా నాణ్యత చూస్తాము. ఆ తర్వాత రేటు చూస్తాము. ఆ రెండు కుదిరాక అందులోంచి కొన్ని మాత్రమే ఏరుకుంటాం. అన్ని తెచ్చేసుకోంగా.
అలాగే భగవంతుడు కూడా ఆయనక్కావాల్సిన వాళ్ళను ముందే ఏరేసుకుంటాడు. మంచి వాళ్ళని భగవంతుడు ముందే తీసుకుపోతాడు. అంతే తప్ప నువ్విలా పూజలు మానద్దమ్మా” అని చెప్పింది.
అపుడు నేను నా తప్పు తెలుసుకున్నాను. ఈ నాటకం లో ఆయన పాత్ర అయిపోయింది, ఎవరి సమయం వచ్చినపుడు వాళ్ళు ఈ వేషాలు వదిలేసి వెళ్ళిపోవాలిసిందే.
ఆయన పాత్ర ముందే అయిపోయింది. అందుకే వెళ్ళిపోయారు అనుకుని, నేను తిరిగి బాబా పూజలు మొదలు పెట్టాను.
ఇంకెప్పుడు కూడా అనవసరంగా బాబాను నిందించకూడదు, దూషణ కూడా చేయకూడదు అని నిర్ణయించుకున్నాను.
నేను ఎక్కువగా చదువుకోలేదు. మా వారు చనిపోయాక కుటుంబ పోషణ నేనే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకా పిల్లల చదువులు పూర్తి కాలేదు. వాళ్ళకో దారి చూపించాల్సిన బాధ్యత నాకుంది.
కానీ నాకేం చేయాలో తోచటం లేదు. ఆ సమయంలో మా మేనమామ ఒక ట్రస్ట్ లో పెయింటింగ్స్ నేర్పుతున్నారు అని తెలిసి నన్నూ ఆ కోర్సు చేయమన్నారు,
ఎందుకంటే నాకు పెయింటింగ్ మీద కాస్త ఇంటరస్ట్, చిన్నప్పుడు కూడా నేను డ్రాయింగ్ బాగా వేసేదాన్ని. ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది అని నేర్చుకున్నాను.
మా వారు పోయి నెల అవ్వకుండానే నన్ను అందులో చేర్పించారు. నేను పెద్దగా మాట్లాడలేను. నలుగురిలోకి వచ్చి ఎరగను. కానీ తప్పదు.
నేను కోర్సు మూడు నెలలలో పూర్తి చేశాను. దాని తరువాత నేను ఒక చోట పెయింటింగ్ నేర్పించే టీచర్ గా అప్పాయింట్ అయ్యాను. బాబా దయతోనే నాకీ ఉద్యోగం దొరికింది.
నేను అక్కడ మంచి పేరు సంపాదించుకున్నాను. అక్కడ నాతోటి పని చేసే వాళ్ళు నన్ను ఎంతో మర్యాదగా ఒక తోడబుట్టిన అక్కచెల్లెళ్ళు లాగా నాకు ఎంతో గౌరవమిచ్చి నన్ను ప్రోత్సహించేవారు.
మా వాళ్ళు, నువ్వు మగ్గం వర్కు కూడా నేర్చుకున్నావు కదా! నీకు కలర్ కాంబినేషన్ కూడా బాగా తెలుసు, మరి నువ్వే ఈ బిజినెస్ ఎందుకు పెట్టకూడదు, అని నా చేత మగ్గం వర్క్ బిజినెస్ పెట్టించారు.
The above miracle has been typed by: Sreenivas Murthy Muppalla
Latest Miracles:
- కష్టములొ ఉన్న భక్తురాలికి, మరచిన మ్రొక్కును గుర్తు చేసిన బాబా వారు….
- ఏ ఉద్యోగం లేదు అని బాధ పడుతున్న నాకు, తన గుడిలోనే ఉద్యోగం ఇప్పించిన బాబా వారు
- బాబా ఆశీర్వాదంతో మంచి ఉద్యోగం లభించింది
- పెళ్లి చేసి ఉద్యోగం ఇప్పించిన బాబా వారు
- నచ్చిన ఆహారాన్ని వదిలిపెట్టమని సందేశం ఇచ్చి ఉద్యోగం ఇప్పించిన బాబా వారు …..!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments