Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా ఆబాలగోపాలాన్ని తీర్చి దిద్దుతుంటారు – ఆధ్యాత్మిక విషయాలలోనైనా సరే, లోకిక పరమైన విషయాలలో నైనాసరే.
సాయి పిల్లలంటే ఆపేక్షగా ఉండేవారు. వారి చదువు సంధ్యలలో తోడ్పడేవారు. ఒకొక్కసారి సాయి చేష్టలు అర్థంకావు సరికదా, అవి తప్పుదోవ పట్టిస్తున్నాయా? అనే అనుమానం రాకమానదు.
షిరిడీలో ప్రాథమిక పాఠశాల ఉండేది.
ఆ పాఠశాలకు ఒకసారి జయదేవ్ చిదంబరు అనే వ్యక్తి 1912లో షిరిడీకి ప్రథానోపాధ్యాయునిగా వచ్చాడు. ఆయన షిరిడీలోనే దాదాపు 14, 15 సంవత్సరములు పని చేశాడు.
ఇక ఆయనకు సాయి భక్తులకు పరిచయంగూర్చి చెప్పనవసరం లేదు.
ఆయన కాకా సాహెబ్ దీక్షిత్‌తో మనసు విప్పి మాట్లాడేవారు. కాకా సాహెబ్ దీక్షిత్ కూడా అంతే.
ఒకసారి చిదంబరు కాకాతో ”నేనింతవరకు శిక్షకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాను. కానీ, నా పేరు ఇక్కడ నాశనమై పోయేటట్లు ఉన్నది” అని వాపోయాడు. కారణం కూడా చెప్పాడు.
”ఇక్కడ పిల్లలు ఎవ్వరూ చదవరు”. పరీక్షలకు ఏం చేస్తారంటే ”మేము అప్పుడు సాయి బాబా ఊదిని తీసుకొని వస్తాము. దానిని నుదుట ధరిస్తాము. పరీక్షలలో ఉత్తీర్ణులమవుతాము అని చెప్పారు” అన్నాడు హెడ్‌మాస్టరు.
వార్షిక పరీక్షలు రానే వచ్చాయి. విద్యార్థులందరూ సాయి వద్ద ఊది తీసుకుని పరీక్షలు వ్రాశారు.పరీక్షలు మార్చి/ఏప్రియల్ మాసాలలో సాధారణంగా జరుగుతాయి. ఫలితాలు కొద్ది రోజుల తరువాత తెలుస్తాయి.
చిదంబరు మరల కాకాను కలసి ”పిల్లలు సాయి ఊది తీసుకుని పరీక్ష వ్రాశారు. ఉత్తీర్ణులయ్యారు” అని సంతోషంగా చెప్పాడు.
ఒకొక్కసారి సాయి చేసే పనులు అలాగే ఉంటాయి.
ఊది వ్యాధులు తగ్గిస్తుందని, ధన ప్రాప్తి కలిగిస్తుందని, మన ఆకలి తీర్చే మాతా అన్నపూర్ణ అందులో ఉందని మనందరికి తెలుసు. కానీ అందులో విద్యాదాత సరస్వతి మాత కూడా ఉన్నదని ఈ సంఘటన తెలియచేస్తోంది.
సాయియే విద్యాదాత, జ్ఞాన దాత, విజ్ఞాన ప్రదాత కూడా!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి లెక్క తప్పదు!…..సాయి@366 నవంబర్ 2…Audio
- లే! నడువు!! …..సాయి@366 ఏప్రిల్ 29….Audio
- విచిత్రాలు సహజమే!…..సాయి@366 జూన్ 6…Audio
- సాయి సేవలో 65 ఏండ్లు …..సాయి@366 ఏప్రిల్ 23….Audio
- మృత్యుంజయి మాలన్‌బాయి…..సాయి@366 ఆగస్టు 18….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments