షిరిడీలో బాబాకి మేము పంపిన దక్షిణ ముట్టిన వెంటనే, గురువు గారు(రామ్ రతన్ జీ బాబా గారు) వచ్చి మా ఇంటిలో జ్యోతి వెలిగించుట.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఆ తర్వాత మా కుటుంబం అంతా అంటే మా అత్తగారు, మామగారు, మా మరిది, తోటికోడలు నేను పిల్లలు మా వారు లేకపోయినా నేను మా వాళ్ళందరితోనూ కలిసే వుంటున్నాను.

అందరం కలిసి ఒక సారి శిరిడి వెళ్ళాము. బాబాను దర్శనం చేసుకొని బయటకి వచ్చేటప్పటికి, ఒక ముసలాయన ఒక క్యాన్‌ లో మూత తిరగేసి పట్టుకుని అందులోంచి ప్రసాదం తీసి అందరకి పంచిపెడుతున్నాడు.

ఆయన దగ్గర అందరూ తీసుకుంటున్నారు. ఆయన చూస్తే ఒక ముష్టివాడిలా ఉన్నాడు, మాసిపోయిన బట్టలు, చింపిరి తల, గడ్డం ఉంది.

ఆయన్ని నేను చూస్తూనే మొహం పక్కకి తిప్పుకొని “ప్రసాదం కావాలంటే బయటకి పోయి కొనుక్కోవాలి కానీ పోయి పోయి ఆయన దగ్గర ప్రసాదం తీసుకోవటం ఏమిటో”? అని అనుకుంటున్నాను.

అందరు వరసగా లైన్లో ఆయన ముందుకే వెడుతున్నాము. నా ముందు మా వాళ్ళంతా ఆయన దగ్గర ప్రసాదం తీసుకుంటున్నారు.

నా ముందు మా తోటికోడలు తీసుకుంది. నా వంతు వచ్చింది. నన్ను తీసుకో అంది మా తోటికోడలు, ఇంక తప్పదనుకొని ఆయన ముందు నా చేయి చాపబోయాను.

ఆయన ఉన్నట్టుండి లేచి పరుగు పెట్టడం మొదలు పెట్టాడు. నాకు ప్రసాదం తీసుకోవటం ఇష్టం లేదు కదా ఆయన అలా వెళ్ళిపోతే ఊరు కోవచ్చుగా అలా కాక నేను ఆయన వెనుక పరుగు పెట్టాను.

ఆయన ముందు నేను వెనుక అలా నాలుగు వీధులు పరుగు పెట్టాము.

అలా కొంచెం సేపు అయ్యాక ఒక హోటల్‌ లో దూరి ఆయన నేను వెనకాల వస్తున్నానా లేదా అని వంగి వంగి చూస్తున్నాడు.

నేను వెళ్లేసరికి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయి, ముందు ఎక్కడి నుండి బయలుదేరాడో అక్కడికే వచ్చి యదాతధంగా కూర్చున్నాడు.

నేను ఇప్పుడు ప్రసాదం పెట్టమని చెయ్యి చాపాను. ఆయన నా తలపై ఒక చిన్న దెబ్బ వేసి నవ్వుతూ నాకు అప్పుడు ప్రసాదం పెట్టాడు. ఆయన బాబాయే అని నా విశ్వాసం.

ఆ తర్వాత మా ఇంటి దగ్గర చంద్రకళ గారని ఒకావిడ వున్నారు. వాళ్ళింట్లో కూడా రామ్‌ రతన్‌ జీ గారు జ్యోతిని పెట్టారు.

వాళ్ళింట్లో నేను శ్రీసాయి సచ్చరిత్ర చదువుతుండగా నాకు తెలియకుండా నా కళ్ళలోంచి నీళ్ళు కారాయి.

అది గమనించి “ఆవిడ ఎందుకు నువ్వు బాధ పడుతున్నావు” అంటూ నన్ను అడిగింది.

“నేనా నేనేం బాధపడటం లేదే” అన్నాను. “లేదు నువ్వు బాధపడుతున్నావు లేకుంటే నీ కళ్ళ వెంట నీళ్ళు ఎందుకు వస్తునాయి అంది.

నీ మనసు ఎందుకో భారంగా ఉంది. ఆ బాధంతా తొలిగిపోతుంది. నువ్వు కూడా మీ ఇంట్లో జ్యోతి పెట్టుకో” అంది.

“నాకు పెట్టుకోవాలనే ఉంది. కానీ నాకు ఆ స్తోమత లేదు. అన్ని రోజులు అంటే నేను ఎలా చూసుకోవాలి. నాకెవరి సాయం అయినా కావాలి అన్నానుఆవిడతో.

ఆ తరువాత మళ్ళీ ఆవిడ నా దగ్గరకి వచ్చి “మగ్గం వర్కుకోసం బట్టలు ఉన్నాయి ఇప్పుడు ఇస్తే ఎప్పుడు ఇస్తావు అని అడిగి, జ్యోతి విషయం గురించి ఏమి చేశావు నళినీ! పెట్టుకో నీకు బాగుంటుంది” అని అంది.

అదేనండి నేను కూడా ఆలోచిస్తున్నాను అన్నాను నేను మళ్ళీ కూడా ఏం చెప్పక పోయే సరికి ఈసారి వచ్చి నాకు వర్క్‌ కోసం బట్టలు ఇచ్చి జ్యోతి గురించి ఏం మాట్లాడకుండా వెళ్లిపోయింది.

నాలుగు రోజులు తరువాత బట్టలు తీసుకోవటానికి వచ్చి జ్యోతి గురించి అప్పుడు అడిగింది.

నేనుకొంచెం మొహమాటంగా, పెట్టుకుంటానండి కానీ మాకు సాయంగా మా ఇంట్లో నిలబడడానికి మా పిన్ని రావాలి. ఆవిడ వస్తే నేను పెట్టుకుంటాను అన్నాను. ఆవిడ వెళ్ళిపోయింది.

ఇదంతా మా అమ్మాయి చూస్తూవుంది. ఎందుకమ్మా ఆంటీ చేత అన్నిసార్లు అడిగించుకుంటావు, ఆ జ్యోతేదో పెట్టుకోరాదా అంది.

నీకు తెలియదు, జ్యోతి వెలిగించగానే అయిపోదు. 49 రోజులపాటు ఎలోటు రాకుండా బాబాకి 4 హారతులివ్వాలి. అంతా సరిగా సక్రమంగా జరిగేటట్టు చూసుకోవాలి అని అన్నాను.

ఫర్వాలేదమ్మ నేనున్నానుగా నేను చూసుకుంటాను అని అంది. అసలు మా అమ్మాయి బాబాను నమ్మదు. అలాంటిది దాని నోటివెంట బాబా ఈ మాటలు పలికించాడు.

ఆ చంద్రకళ గారు నా దగ్గర జ్యోతి విషయం మూడు సార్లు ప్రస్తావించినా నేను ఎలా చేస్తానో అనే భయంతో కాదన్నాను.

ఆ సమయంలో మా పిన్ని వాళ్ళు శిరిడి బయలుదేరుతున్నారు. నేను ఇంట్లో అప్పుడపుడు బాబా కోసమని నాణేలు ‘దాచిపెట్టాను అవి బాబా కోసం శిరిడికి పంపాలని అనుకొని ఎవరితోనైనా పంపుదామనుకుంటూ ఎప్పుడు మర్చిపోతున్నాను.

మా స్టూడెంట్‌ ఒకమ్మాయి మా పిన్ని వాళ్ళతోటి కొంత డబ్బులు శిరిడిలో బాబా హుండిలో వేయదానికి ఇస్తానని చెప్పింది.

ఆ అమ్మాయి 9 గురువారాలు పూజ కూడా చేసింది. ముడుపు కూడా కట్టింది. ఆ డబ్బులు శిరిడికి పంపించాలని అనుకొని నన్ను అడిగింది.

అప్పుడు నేను ఆ అమ్మాయి ముడుపులు, నా దగ్గర ఉన్న చిల్లర డబ్బులు కూడా వేసి మా పిన్నికి ఇచ్చి పంపించాము.

వాళ్ళు శిరిడి వెళ్లి ఆ డబ్బులు హుండిలో వేసి, దర్శనం అయ్యాక నాకు ఫోన్‌చేసి విషయం చెప్పారు. “నీ డబ్బులు బాబాకందాయే  నళినీ” అంది.

మా పిన్ని ఫోన్‌ పెట్టేసిన వెంటనే చంద్రకళ గారు నాకు ఫోన్‌ చేసి ఫలానా తారీకున గురువు గారు వస్తున్నారు. నీ పేరు కూడా చెప్పనా అని అడిగింది.

నేను మా అమ్మాయిని అడిగి వెంటనే ఒప్పుకున్నాను.

మా ఇంట్లో గురువు గారు వచ్చి జ్యోతి వెలిగించారు.  ఏడుగురుకి ఆయన చేతుల మీదుగా శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకాలు ఇచ్చారు.

The above miracle has been typed by: Sreenivas Murthy Muppalla

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles