Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా షిరిడీ చేరినప్పుడు ఆయనను సేవించిన భక్త త్రయం మహల్సాపతి, అప్పా జోగ్లేకర్, కాశీరాం షింపె.
కాశీరాం సాయిబాబాకు ఆకుపచ్చని కఫనీ, అదే రంగు టోపీని సమర్పించాడు. సాయి మహా సమాధి అనంతరం అవి సాయినాథుని భౌతిక శరీరంతోపాటు సమాధి చేయబడినవి.
సాయి ఇతని వద్ద నుండి పైసా, రెండు పైసలు తీసుకునేవారు.
ఈతడు తన డబ్బు సంచీని సాయి ముందుంచి ఇష్టం వచ్చినంత తీసుకోమనే వాడు ప్రేమతో.
రాను రాను ఆ ప్రేమ స్థానంలో అహంభావం పేరుకుపోసాగింది. అది గ్రహించిన సాయి దక్షిణను పదే, పదే అడిగేవాడు. ఉన్న డబ్బంతా ఖర్చయిపోగా అప్పులపాలయ్యాడు కాశీరాం.
అప్పుడు అతనికి తెలిసింది తాను ఎంత పొరబడ్డానో అని. అప్పటి నుండి అహంభావం తొలగిపోయింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపింది.
సాయిబాబాకు మొదట ఫోటో తీయించింది ఈయనే అంటారు.
ఇతనికి జానకీదాస్ అనే పేరు గల సత్పురుషుడు చీమలకు పంచదారను వేయమని చెప్పాడు.
కాశీరాం వద్ద ఎల్లప్పుడూ పంచదార మూట ఉండేది. అందులోంచి చీమలకు పంచదార పెట్టేవాడు. ఇది అతని నిత్య వ్రతం.
కాశీరాం బట్టల వ్యాపారి. షిరిడీ చుట్టుప్రక్కల జరిగే సంతలలో బట్టలు అమ్మే వాడు. ఒకసారి సాపూర్ సంత నుండి తిరిగి వస్తుంటే దోపిడీదొంగలు అటకాయించారు. దోచుకున్నారు ఉన్నదంతా.
ఆ దొంగల దృష్టి మూటపై పడ్డది. దానిని ఇమ్మన్నారు దొంగలు. అతడు ఇవ్వలేదు. అందులో ధనమున్నదని దాని కోసం తలపడ్డారు.
అతడు కత్తితో ఇద్దరిని చంపేశాడు. మరో దొంగ అతని తలపై బలంగా కొట్టగా స్పృహతప్పి పడిపోయాడు. దొంగలు అతను చనిపోయాడని భావించి వెళ్ళిపోయారు.
స్పృహ వచ్చిన తరువాత, అతను చుట్టూ మూగిన జనం అతనిని ఆసుపత్రికి తీసుకుపోదలిస్తే, కాదని పట్టుబట్టి సాయి వద్దకే తనను తీసుకుపొమ్మన్నాడు.
సాయియే అతని ప్రాణదాత అయ్యారు. ఇతను దొంగలతో కలియబడుతుంటే, సాయి ద్వారకామాయిలో తిట్లు, శాపనార్ధాలు మొదలుపెట్టారు.
అది చూచి అక్కడున్నవారంతా సాయి ఎవరినో కాపాడుతున్నారని గ్రహించారు. తీరా చూస్తే కాపాడింది కాశీరాంనే.
అతడు చైత్రశుద్ధ ఏకాదశి (ఏప్రిల్) రోజున సాయిలో ఐక్యం అయ్యాడు!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- పోగొట్టుకున్నది ఏది?…..సాయి@366 నవంబర్ 19….Audio
- లే! నడువు!! …..సాయి@366 ఏప్రిల్ 29….Audio
- ఓం శ్రీ సాయి హనుమాన్ …..సాయి@366 ఏప్రిల్ 1…..Audio
- ప్రసాదం – ధన ప్రసాదం…..సాయి@366 ఆగస్టు 19….Audio
- శ్రీ సాయి రక్ష సర్వజగద్రక్ష…..సాయి@366 ఏప్రిల్ 14….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “ఆసుపత్రికి కాదు, సాయి వద్దకే!…..సాయి@366 ఏప్రిల్ 19….Audio”
Sunithaguvvala
April 20, 2020 at 12:48 pmPeaceful and happy☺️