Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
1923, ఏప్రిల్ 13న శ్రీరామనవమి ఉత్సవాలు దిగ్విజయంగా ముగిసాయి షిరిడీలో. ఉత్సవాల అనంతరం ఇతర ప్రదేశాల నుండి శ్రీరామనవమి ఉత్సవాలను చూచిన వారు తమ ప్రదేశాలకు బయలుదేరారు.
ఆ సంవత్సరం మామూలులాగే ముర్వేద్ నివాసి బాబా రామచంద్ర పత్తేవారు, ఆయన భార్య శ్రీమతి కృష్ణాబాయి కూడా బయలుదేరారు. వారితోపాటుగా దాసగణు మహారాజ్, దాము అన్నా (దాసగణు మహరాజ్ గారి శిష్యుడు) కూడా ఉన్నారు.
రైలు 11 గంటలకు ఠాణే స్టేషన్ చేరింది. తీవ్రమయిన ఎండమూలాన కృష్ణాబాయికి విపరీతమైన దాహం వేసింది.
ఠాణాలో కొంచెంసేపు రైలు ఆగుతుందనే ఉద్దేశంతో, ఆమె కుళాయి వద్ద నుండి నీరు తెచ్చుకుందామని, చెంబు తీసుకుని క్రిందకు దిగింది. కుళాయి వద్ద విపరీతమైన రద్దీ ఉన్నది. ఆమె అలాగే నిలబడి ఉన్నది.
ఆమె వంతువచ్చాక నీళ్ళను పట్టుకోసాగింది. భార్య రాలేదని భర్త, ఆ ఇద్దరూ రాలేదని దామూ అన్నా ఫ్లాట్ ఫారం మీద వెదకసాగారు.
ఇంతలో రైలు కూత వేసింది. కనిపించిన భార్యాభర్తలను ఏదో ఒక పెట్టెలో ఎక్కండి అని తాను వేరే పెట్టెలో ఎక్కాడు దామూ అన్నా.
భర్త ఏదో పెట్టెలో ఎక్కాడు. భార్య చేతిలోని మరచెంబువలన, పెట్టెలోకి ఎక్కలేక పెట్టెకు, ఫ్లాట్ ఫారంకు మధ్య నున్న ప్రదేశంలో పడిపోయింది.
సంఘటన చూచిన వారందరూ పెద్దగా అరవటంతో, రైలు ఆగింది. ఆమె భర్త, దామూ అన్నాల నోరు ఎండిపోయింది. చితికిపోయిన కృష్ణాబాయి శవాన్ని ఎక్కడ చూడవలసి వస్తుందోనని, వారు కన్నులు మూసుకున్నారు.
ఇంతలో కృష్ణాబాయి నవ్వుకుంటూ రైలు పట్టాల మధ్య నిలబడ్డది. ఎవ్వరో చేయి అందిస్తే ఫ్లాట్ ఫారం ఎక్కింది. ఆమె క్రింద పడగానే, సాయిని తలచుకున్నది.
సాయిబాబా ఆమెను ఫ్లాట్ ఫారం క్రిందనున్న ఖాళీ జాగాలోనికి నెట్టివేశారు. ఆమె అలా రైలు వెళ్ళేదాకా ఉంది. సాయి ఆమె ప్రక్కనే ఉన్నారు. ఆమెకు కొండంత ధైర్యం వచ్చింది.
ఈలోగా ఎవరో చేతిని అందివ్వగా ఫ్లాట్ ఫాం ఎక్కానన్నది. భక్తుల కోసం బాబా అలా ప్రకటమవుతారు.
సాయిబాబా కాక వేరెవరూ లేరు అనే భావన కలగాలి. సంపూర్ణ విశ్వాసం ఉంటే, సాయి భక్తునకు అనుభవం కలుగుతుంది.
సాయి మహాసమాధి అనంతరం కూడా అంతే!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శ్రీ మతి కృష్ణాబాయి–Audio
- రైలు ప్రమాదం లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన బాబా గారు.(బాబా పైన ఉన్న భక్తి ఎదుటి వ్యక్తిని కాపాడే శక్తి గా మారిన కథ).
- గురుభక్తి…..సాయి@366 ఏప్రిల్ 17….Audio
- ఎవడొస్తాడో చూస్తా! …..సాయి@366 మే 22….Audio
- విమానంలో సాయి సన్నిధికి …..సాయి@366 జూలై 5….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments