సాయి సేవలో 65 ఏండ్లు …..సాయి@366 ఏప్రిల్ 23….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


నాందేడ్ లో అమీర్‌ ఉద్దీన్‌ అనే ఫకీర్‌ ఉండేవాడు.

ఒకనాటి  రాత్రి ఆయనకు స్వప్నంలో సాయిబాబా కనిపించి రెండు మామిడి పండ్లను ప్రసాదించి అబ్దుల్‌ అనబడే వ్యక్తితో ఆ పండ్లను తనకు పంపమన్నారు. అమీర్‌ఉద్దీన్‌ అలానే చేశారు.

అబ్దుల్‌ షిరిడీకి రాగానే ”నా కాకి వచ్చింది” అని అహ్వానించారు సాయి. ”నీకు ఇంకే పని వద్దు. నా సేవ చేయి చాలు” అని కూడా అన్నారు సాయి.

సాయి చెప్పిన పనిని తూ.చ. తప్పక పాటించే వాడు అబ్దుల్‌. రోజూ    మసీదు ఆవరణను, బాబా నడయాడే వీధులను, ప్రదేశాలను శుభ్రం చేసేవాడు.

లెండి వనంలో, మసీదులో, చావడిలో దీపాలు వెలిగించే వాడు. అన్ని వేళలా ధునిని పర్యవేక్షించే వాడు.

భిక్ష చేసి ఉదర పోషణ చేసుకునే వాడు. అంటే సాయి వలె భిక్షాటన చేశాడు. అయితే అబ్దుల్‌కు వివాహమైంది. సాయి చెంతను గాని, బయట గాని సేవ చేస్తూ ప్రతి రోజు మూడు సార్లు స్నానం చేసేవాడు.

ఇతను సాయి పల్కులను ఒక గ్రంథంంలో వ్రాసుకున్నాడు అనే కంటే సాయియే వ్రాయించుకున్నాడు అనేది నిజం. ఆ గ్రంథం ఇంకను ముద్రణ రూపంలో వెలుగు చూడలేదు.

ఒక రోజు సాయి మహా సమాధి అనంతరం అబ్దుల్‌ ఖురాన్‌ను మననం చేసుకుంటున్నాడు.

శిధిలావస్థలో ఉన్న ఆ గృహం మట్టి గోడలు హఠాత్తుగా కూలిపోయాయి. నడుము వరకు శిధిలాలలో అబ్దుల్‌ కూరుకు పోయాడు. అయినా అబ్దుల్‌కు ఏ విధమైన ప్రమాదం జరగలేదు. ఇది సాయి కృప.

సాయి మహాసమాధికి పూర్వం, అనంతరం సుమారు 65 సంవత్సరాలు సేవ చేసిన మహనీయుడు.ఆయన ఏప్రిల్‌ 1954న సాయిలో ఐక్యం అయ్యారు.

”స్వల్పంగా తిను, ఒక్క పదార్ధంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు, అతిగా నిద్ర పోవద్దు” అన్నారు సాయి అతనితో.

మనం కూడా సాయి చెప్పిన సూచనలను పాటింతుము గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles