కఠినం …. మహనీయులు – 2020… ఏప్రిల్ 6



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా తన గురువు చెట్టుకొమ్మనుండి తనను తలక్రిందులుగా వ్రేలాడదీసారని చెప్పారు.

హాజీవారిస్ షా కూడా కఠినమైన శిక్షణ ఇస్తుండేవాడు అయన శిష్యులకు, హాజీవారిస్ షా సాయిబాబాకు గురువని కూడా కొందరి అభిప్రాయం.

అజ్మీర్ వాస్తవ్యుడైన మస్తకీ షాను హాజీవారిస్ అలీ షా కన్నులు మూసుకోమని, తాను తిరిగి ఆజ్ఞాపించేవరకు కన్నులు తెరవరదని ఆదేశించెను.

అతడు పరిపూర్ణ ఆనందంతో గురువు ఆజ్ఞను స్వీకరించి జీవించిన 70 సంవత్సరాలపాటు ఏ క్షణాన కూడా కన్నులు తెరవలేదు. అలా కన్నులు మూసుకునే ఉండేవాడు.

అక్బరాబాద్ వాస్తవ్యుడు గులాబ్ షాను కన్నులు మూయరాదు, తెరిచే ఉంచు అని ఆజ్ఞాపించారు. ఫలితముగా అతను 44 సంవత్సరములు ఆ కఠినమైన దీక్షను కొనసాగించాడు.

నిద్ర రాకుండేందుకు కోసుగా ఉండే ఒక రాతి మీద కూర్చుని, అటు ఇటు పడకుండా నిలబడి జపం చేసేవాడు. జీవితాంతం కన్నులు మూయలేదు గులాబ్ షా.

బారాబంకీ గ్రామస్తుడు అబ్దుల్ రజాక్ నోరుజారి మాటాడరాని మాటను హాజీవారిస్ అలీ షా ముందు పలికాడు.

గురువు “నీవు మాట్లాడరాదు. మౌనంగా ఉండు” అన్నారు అబ్దుల్ రజాక్ తో. రెండేళ్లపాటు రజాక్ మౌనంగా ఉన్నాడు.

అబ్దుల్ స్నేహితుడు హాజీవారిస్ షా తో అబ్దుల్ రజాక్ కు వేసిన శిక్షను రద్దుచేయమని కోరాడు.

అబ్దుల్ రజాక్ వంక చూచి హాజీవారిస్ ఆలీషా “నీకు మాటాడాలని ఉందా? ఉంటే చెప్పు” అన్నారు రజాక్ తో. అబ్దుల్ రజాక్ మౌనంగా ఉన్నాడు.

గురువు సంతృప్తిగా చిరునవ్వు నవ్వి అతడిని దీవిస్తూ “నీకు మిగిలి ఉన్న ఈ కొలది కాలం మౌనంగానే గడుపు, మంచి జరుగుతుంది, నిజానికి అల్లాయే స్వయంగా వచ్చి నిన్ను అడిగినా, నీవు మౌనమే వహించు. మాట్లాడకు” అన్నారు.

అబ్దుల్ రజాక్ గురు పాదాలపై పడి కృతజ్ఞతతో ముద్దు పెట్టుకున్నాడు.

అబ్దుల్ రజాక్ కు సాక్షాత్తు అల్లా దర్శనమే అవుతుందని అంతర్లీనంగా ఉన్న భావాన్ని గ్రహించాడు.

శిష్యుడైన ఏకనాథ్ కు దత్తగురు దర్శనం చేయించిన గురువులు అరుదుగా ఉంటారు. అటువంటి వారిలో ఒకరు హాజీవారిస్ అలీ షా.

ఆ దినం ఏప్రియల్ 6, 1905. “నేను నా ప్రియుడితో కలవాలి” అంటూ హాజీవారిస్ అలీ షా చెప్పి ధ్యానంలోనికిపోయి కన్నులు మూసుకున్నారు.

అంతే. అయన భగవానునిలో ఐక్యమయ్యారు. కన్నులు తెరవలేదు. ఈ ప్రపంచాన్ని తిరిగి చూడలేదు.

“తనను సదా శుభ్రమార్గంలో నడిపించిన సృష్టికర్త ఐన పరమాత్ముని దీవెనకై ప్రార్థిస్తూ జీవించటమే మానవుని ధర్మం”.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles