దేవీ! బ్రోవ సమయమిదే!! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 6



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా వద్దకు అబ్దుల్ కరీంఖాన్ అనే సంగీత విద్వాంసుడు వచ్చాడు.

సాయిబాబా ఆయనతో కొన్ని పాటలు పాడించుకున్నారు. “హేచి దాస్ దేగా” అనే కీర్తనను (తుకారాం రచన) అతడు పీలు రాగంలో ఎంతో భక్తిగా పాడాడు.

సాయిబాబా కనులు మూసుకొని ఎంతో శ్రద్దగా ఆ భజన విన్నారు. భజన పూర్తి అయ్యాక “ఎంత అద్భుతంగా పాడాడు, ఎంతో భక్తిగా ప్రార్ధించాడు. వినగానే అతని ప్రార్ధనను మన్నించేలా ఉంది” అన్నారు.

కర్ణాటక సంగీత త్రయంలో పెద్దవాడు శ్యామ శాస్త్రి. త్యాగయ్య, రామ భక్తుడైనట్లు, శ్యామా శాస్త్రి తంజావూరు జిల్లాలోని తిరువాయూరులో ఉన్న కామాక్షి దేవి భక్తుడు.

అయన అర్చకత్వంతోను, గానంతోను బంగారు కామాక్షిని సేవించేవాడు.

“సతతము పద భక్తి నిమ్ము” అని ఆర్తితో, ఆవేదనతో శ్యామ శాస్త్రి పరాశక్తిని వేడుకునేవాడు.

ఆ కాలపు విద్వాంసుడైన బొబ్బిలి కేశవయ్య గారు తన జెండాను తంబురపై ఎగురవేస్తూ పండితులను సవాలు చేస్తూ, విజయాన్ని పొందుతూ, తంజావూరు ప్రవేశించాడు.

నగర విద్వాంసులందరూ శ్యామా శాస్త్రిగారి వద్దకు వచ్చి ఆ స్థానపు పరువును నిలబెట్టమని కోరినారు.

అప్పుడు శ్యామ శాస్త్రిగారు చింతామణి రాగంలో దేవి సమక్షంలో “దేవీ! బ్రోవ సమయమిదే” అనే కీర్తనను ఆలపించి కేశవయ్యను ఓడించారు.

తంజావూరు రాజస్థానంలో ప్రత్యర్థి కూర్చిన సింహనందిని తాళాన్ని అందుకుని పాడటమే కాక దానికి ప్రతిగా శరభనందన తాళాన్ని తానూ సృష్టించి పాడి ప్రత్యర్థి కేశవయ్యను పరాజితుడిని చేసి, ఆస్థాన ప్రతిష్టను కాపాడిన లయబ్రహ్మ శ్యామ శాస్త్రి.

శ్యామ శాస్త్రి కృతులు రెండు, మూడు వందలకు మించి ఉండవు. తెలుగు సంస్కృతము, తమిళములలో రచించారాయన.

త్యాగయ్య కృతుల వలె అందరినీ ఆకట్టుకోలేకపోవటానికి అది కొంత విద్వత్తుతో మేళవింపబడి ఉన్నాయి.

శ్యామ శాస్త్రి కీర్తనలలో భక్తి, ఆత్మార్పణలు ప్రధానంగా కనిపిస్తాయి. ఈయన కీర్తనలు శ్యామ కృష్ణ సోదరీ అనే ముద్రతో ఉంటాయి.

తన ఆవేదన కామాక్షికి విన్నపించుకునే వారు కృతుల రూపంలో. అనారోగ్యం వలన ఆయనకు అసౌకర్యం కలిగినప్పుడు కూడా ఏ విధమైన ఔషదములను సేవించక కామాక్షి దేవినే పదే పదే వేడుకునేవారు.

ఈయన జగదంబికను సగుణ రూపిగా దర్శించాలనే కాంక్షకంటె అనుగ్రహింపమని, పరితాపము తీర్చుమని నిరంతరం వేడుకునేవాడు.

శ్యామ శాస్త్రి, భక్తి అనే నౌకతో సముద్ర వివాహం జరిపించారు. శ్యామ శాస్త్రిది కదళీపాకం అంటారు. శ్యామ శాస్త్రి పూర్వికులు తెలుగు ప్రాంతం నుండి వెళ్ళినవారే.

తాను భౌతిక కాయాన్ని వీడే సమయాన్ని ముందుగానే తెలిపారు. ఫిబ్రవరి 6 న 1827 సం || లో సమాధి చెందారు. నేడు ఫిబ్రవరి 6. ఆయన కీర్తనతో కామాక్షిని స్మరిద్దాం!

మొర వినవా దురిత||  వికారిణి శ్రీ బ్రుహన్నాయకి!!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles