Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా జీవితమంతా మత సహనానికి నిదర్శనం. ఆయనకు ముస్లిం భక్తులున్నారు. సూఫీ యోగుల పేరు గలిగిన భక్తులున్నారు.
బాబా ఉర్సు ఉత్సవాలను చేయించేవారు. సాయి మహాసమాధి అనంతరం ఆ సంప్రదాయాన్ని పాటించిన మహనీయుడు దర్గాబాబా.
దర్గాబాబా అసలు పేరు సుబ్బారాయుడు. అయన జూలై 6, 1931న జన్మించారు.
సాయి భక్తుడు నానావళి అసలు పేరు శంకరనారాయణ. శంకరనారాయణ, సూఫీ యోగి నానావళి భక్తుడు. అందుచేత నానావళి అయ్యాడు.
సుబ్బారాయుడు సద్గురు హజరత్ దర్బార్ అలీషా వలి. సద్గురు హజరత్ జలీల్ మస్తాన్ వలీల సమాధులను సేవించేవాడు. అందుచే దర్గాబాబా అయినాడు.
దర్గాబాబా ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమినాడు ఇద్దరు బాబాలకు, మూడు రోజులపాటు ఉర్సు ఉత్సవం చేసేవారు.
దర్గాబాబా సాయిబాబా భక్తుడు. సాయి భక్తిని తనవరకే పరిమితం చేసుకోకుండా దర్బార్ సాయి మందిరమును నీలకంఠరావు పేటలో నిర్మించారాయన.
వివాహం చేసుకున్నా, భార్యా భర్తలు మరో రామకృష్ణ పరమహంస, శారదాదేవివలె జీవించటం వారికే చెల్లింది.
ఒక భక్తురాలు (ఛాయగారు) సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు చెందిన పెద్దమండ బ్రాంచిలో పనిచేస్తున్నారు. తానుండే ఊరికి ఎంతో దూరం.
ఈ విషయాన్ని ఆమె దర్గాబాబాకు విన్నవించుకుంది. “పోమ్మా! అదే (బ్యాంకు) మీ ఊరు వస్తుంది” అన్నారు. దర్గాబాబా ఆ మాటలను హాస్యానికి అన్నారనిపిస్తుంది వినేవారికి.
ఒకసారి సాయిబాబా జీవిత చరిత్రలో నార్కే అనే భక్తుడు తనకు ఉద్యోగం ఎక్కడ వస్తుంది అని అడిగేవాడు బాబాను.
“పూనాలో” అనేవాడు సాయి. పూనాలో నార్కే చదువుకున్న చదువుకు తగిన విద్యాసంస్థలెదు.
అటువంటి విద్యాసంస్థ పెట్టే సూచన కనుచూపు మేరలో లేదు. అకస్మాత్తుగా పూనాలో ఒక సంస్థలో అతనికి తగిన ఉద్యోగం ఏర్పాటైంది. పూనాలో నార్కే చేరాడు.
దర్గాబాబా చెప్పినట్లు ఆమె నివసించే మదనపల్లిలోనే ఆ బ్యాంకు పెట్టారు. ఆమె అక్కడ చేరింది.
ఒకసారి ఒక భక్తుడైన శంకరనారాయణ కేదారనాథ్ ను దర్శించటానికి వెళ్ళాడు. అక్కడ ఏడు రోజులుగా వర్షం కురుస్తుంది.
కొండచరియలు విరిగి దారికి అడ్డంగా పడ్డాయి. ఈ విషయాన్ని దర్గాబాబాకు ఫోన్ చేసి చెప్పాడు భక్తుడు. ఆ ఫోనులో దర్గాబాబా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.
ఇదంతా అయోమయమనిపించింది అతనికి. దర్గాబాబాకు అంత కోపం కలిగించే పని తాను ఏం చేశానా అని ఆలోచించసాగాడు.
తెల్లవారింది. వాతావరణం చక్కబడింది. దర్శనం అయ్యింది వెంటనే.
దర్గాబాబా అనేకచోట్ల సాయిబాబా విగ్రహాలను ప్రతిష్టించారు. బాల బాలికలకు నామకరణం చేసేవారు. అన్నదానమే కాదు. విద్యాదానం కూడా చేశారు దర్గాబాబా.
నేడు జూలై 6, దర్గాబాబా జయంతి. ఆయనను స్మరిద్దాం –
శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయినాథాయ నమః
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- విదేశాల్లో ప్రథమ సాయి మందిరం…..సాయి@366 జూలై 29….Audio
- తెలుగు వారి శారదా మాత! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 12
- ఓం సత్యనారాయణ స్వామినే నమః…..సాయి@366 జూలై 10….Audio
- పడనీయను …..సాయి@366 జూలై 14….Audio
- పశు వైద్యుడు…..సాయి@366 జూలై 30….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments