Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ప్రతి సంవత్సరం మేము గురువుగారు పుట్టిన రోజు సమయంలో షిరిడిలో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉంటాము.
ఒక సంవత్సరం అలాగే అందరం కలిసి చేరుకున్నాము. ఆయన పుట్టినరోజు వేడుకగా చేయాలని అందరూ చాలా హడావిడిగా ఉత్సాహంగా తిరుగుతున్నాము.
అందరికి ఈ సందర్భం గుర్తుండి పోయేలా ఏదైనా పంచి పెట్టుకుంటే బావుంటుంది అని అలోచించి, నాప్కిన్స్ కొనాలని అనుకున్నాము.
మేము కాకినాడలో కొనడం మర్చిపోయాము, షిరిడిలో చూద్దామనుకున్నాము, ఈలోపు కొందరు పారాయణ చేస్తున్నారు, నేను సంతోషంతో చాలా హుషారుగా ఉన్నాను.
ఆ రోజు ఉదయం నేను ఐదింటికే నిద్ర లేచాను. నాకెందుకో గుండె దడగా ఉంది, కాసేపు పట్టించుకోలేదు, అయినా కాఫీ తాగాను, టిఫిన్ తిన్నాను, అయినా తగ్గటం లేదు.
9 గంటలైనా తగ్గలేదు. మా వారికి అప్పుడు చెప్పాను. దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది, సైలెంటుగా వెళ్లి ఒకతనికి చెప్పా.
అక్కడికి వెళ్లి చూపించుకున్నాను, మా అక్కయ్యని కూడా తీసుకువెళ్ళాను. నేను గట్టిగా అందరికీ చెబితే అందరూ డిస్టర్బ్ అవుతారు. ECG తీశారు, కోపర్గావ్ ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు.
అక్కడ ఒకరోజు ఉంచితే అప్పుడు చెబుతాము అన్నారు. మేము అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ మళ్ళీ ECG చేస్తామని, చేసేముందు గుండెలకి జెల్ రాసారు, నేను కళ్ళు మూసుకున్నాను.
నా పక్కనే బాబా నిలబడి, ఆయన చేత్తో నా గుండెల పైనుండి చేతిని కిందకి రాసినట్లు నాకు అనిపించింది.
వాళ్ళు ECG తీశారు. నాకు బాబా అలా రాసాక రిలీఫ్ గా అనిపించి కొంచెంగా దడ తగ్గింది. పదండి వెళ్ళిపోదాం అన్నాను.
ఒక పక్క పారాయణ జరుగుతుంటే నేనిలా ఇక్కడ ఉండటం అని, నాకు మనసులో బాధగా ఉంది.
నేను పారాయణ చేయాల్సిన అధ్యాయాలు 18, 19 . ఆ అధ్యాయాలు చదివే సమయానికి ECG రిపోర్ట్స్ పట్టుకుని వచ్చేసాము.
పారాయణ పూర్తి అయిపోయిన తర్వాత, తాను నా విషయం తెలుసుకొని (మా మరిది డాక్టర్), రిపోర్ట్స్ చూసి కండిషన్ సీరియస్ అని రిపోర్ట్స్ చూపిస్తున్నాయి, కానీ, వదినకు బాబా గారు ఆయన చేతి తోటి మొత్తం తీసేసారు అన్నాడు.
నాకేం కాదు నాకు బాబా ఉన్నాడు, పైగా నేనున్నది షిరిడిలో అదే నా ధీమా.
పండరీపూర్ లో పారాయణ చేయాలని గురువుగారి ఆఖరి కోరిక, అది ఎలాగైనా తీర్చాలని అనుకున్నాము.
అక్కడ పండరిలో, మన ఆంధ్రా భోజనాలు దొరకవు. అందుకని చాలా తక్కువ మంది తోటి వెళ్లి అక్కడ పారాయణ ముగించేసుకుందాం అనుకున్నాము.
కానీ రెండు వందల మందిమి అయ్యాము. పారాయణ అంతా బాగా జరిగింది. అక్కడి నుండి మరికొన్ని ప్రదేశాలు చూసుకుంటూ మేము షిరిడికి రావాలి,
దగ్గర దారి అంటూ మా బస్సుల డ్రైవర్స్, అడవి దారి పట్టారు, దారి తప్పిపోయాము. అందరిలో ఆడవారు, పిల్లల శాతం ఎక్కువగా ఉంది. చాలా భయపడ్డాము.
ఈ అడవిలో ఏ దొంగలు అయినా కత్తులు చూపించి అంతా దోచేసుకుంటే మా గతి ఏమి కాను, అంటూ భయపడుతున్నారు.
”బాబా నీ కార్యం అంటూ మొదలు పెట్టి అది పూర్తి చేసుకుని నీ దగ్గరికి వస్తున్నాము, నువ్వు ఎలాగైనా కాపాడి షిరిడి తీసుకువెళ్ళు బాబా”, అంటూ నేను మనసులో బాబాకు శతకోటి నమస్కారాలు పెడుతున్నాను.
ఒక బస్సు డ్రైవర్ కొంత దూరం వచ్చి, నిద్ర వస్తోంది అంటూ పడుకుండి పోవడం లేకపోతే వెనక బస్సు రావటం లేదు అంటూ ఆపేయడం చేస్తున్నాడు.
బస్సులో జనం మరింత భయపడుతున్నారు. చీకటి, అడవిలో ఏ జంతువులు ఉంటాయో, ఎలాంటి మనుషులు ఉంటారో అని భయం.
మొత్తానికి బాబా దయ వల్ల షిరిడి చేరాము, హమ్మయ్యా! అని అందరూ ఊపిరి పీల్చుకున్నాము.
సర్వం శ్రీ సాయినాధ చరణావిందార్పణ మస్తు
శుభం భవతు
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainthuni
Latest Miracles:
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, బాబా వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం.
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం
- పిలిస్తే పలికే దైవమని, భక్తురాలికి అనుభవపూర్వకంగా తెలియచేసిన బాబా వారు.
- బాబా ఏదో రూపంలో తమ ఇంటికి వస్తారు అని భావించిన భక్తుల నమ్మకాన్ని నిలబెట్టిన బాబా వారు
- భక్తురాలి అన్న సంతర్పణకు బాబా వారు వచ్చుట–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments