పిలిస్తే పలికే దైవమని, భక్తురాలికి అనుభవపూర్వకంగా తెలియచేసిన బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఓం సాయిరాం

బాబా నమ్మినవాళ్ళ ను చేయిపట్టి నడిపిస్తారు.

బాబా నా కుటుంబము పై చూపించిన ప్రేమ, కరుణ సాయి బంధువులకు తెలియజేయాలని,

నా పేరు గీతా, మాది విశాఖపట్నం దగ్గర.

బాబా నా జీవితం లో ఎన్నో అద్భుతాలు నాకు నా కుటుంబానికి అందించారు.

మా పాపా ప్రెగ్నెంట్  సెప్టెంబర్ 27 న date ఇచ్చారు, కానీ సెప్టెంబర్ 1 అర్ధరాత్రి 1 గంటకు మా పాపా కు ఉమ్మనీరు పోయింది సడన్ గా,

మేము అంతా కంగారుపడి ఆటో కోసం ఫోన్ చేసాం కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు,

మా వారు వేరే ఆటో కోసం వెళ్లారు వాళ్ళు ఊరు లో లేరు  చాలా కంగారుగా బాబా ఏంటి ఈ పరీక్షా అనుకోని మా పాపా కి బాబా వారి ఊదీ పెట్టాము.

మరల ఆటో కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి 5 నిమిషాల్లో వస్తా అని చెప్పారు మనసు లో బాబా కి ధన్యవాదాలు తెలియజేసి హాస్పిటల్ కి వెళ్ళాము,

మా ఊరు నుండి హాస్పిటల్ కి వెళ్లాలంటే 20 నిమిషాలు పడుతుంది, వెళ్ళేసరికి ఉమ్మ నీరు పోతూ వచ్చింది,

హాస్పిటల్ కి వెళ్లి జాయిన్ చేసేసరికి డాక్టర్ చెప్పారు ఉమ్మనీరు పోయింది కాబట్టి ఆపరేషన్ అవ్వచ్చు అన్నారు కానీ నార్మల్ కి ట్రై చేస్తా అన్నారు.

నేను మా వారు బాబా కి ప్రార్ధిస్తూ పారాయణ చేస్తే 33 వ చాప్టర్ ఊదీ మహిమ మైనతాయి ప్రసవవేదన వచ్చింది.

బాబా నీవు మైనతాయి ని ఎలా కాపడేవో నా కూతుర్ని కాపాడాలి అని వేడుకున్నాను

Labor రూమ్ నుండి సాయిబాబా పాటలు వినిపించాయి నర్స్ ఫోన్ నుండి, బాబా మీరు లోపలే వున్నారు కాబట్టి అన్ని చూసుకుంటారని అనుకోని చాలా ధైర్యం గా ఉన్నాము

సెప్టెంబర్ 2 గురువారం ఉదయం 5 గంటల 4 నిముషాలు నార్మల్ డెలివరీ లో బాబు పుట్టాడు అని డాక్టర్ చెప్పారు.

బాబానే అన్ని చూసుకొని తల్లి బిడ్డను క్షేమంగా ఇచ్చారు

బాబా నీవు పిలిస్తే పలికే  దైవం తండ్రి నీ కృప కు ఎల్లవేళలా అర్హులుగా ఉండేలా చూడు తండ్రి, దయమయా నీకు శతకోటి వందనాలు.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “పిలిస్తే పలికే దైవమని, భక్తురాలికి అనుభవపూర్వకంగా తెలియచేసిన బాబా వారు.

Kalyan babu

Baba please cure my physical psychological mental sexual problem… I’m a gay and I wanted to become normal and lead a normal family life with my own wife my own children … Please baba.. My only trust hope is on you.. Nuvvu tappa evaru e samasya ni solve cheyyaleru.. Please baba forgive me my sins and karmas… Na valLa kavatledu thandri… Ee samasya nunchi nannu bayata padey thandri… Please I cannot bear this situation

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles