Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
గురువు గారి ఆశ్రమంలో గూడూరులో మేము కొంత డబ్బు ఇద్దామనుకున్నాము. అనుకోకుండా మేమంతా నైమిశారణ్యం వెళ్ళాము.
అక్కడ గురువు గారికి బాబా గుడి ఉంది. అక్కడ దసరాల్లో ఉత్సవాలు జరుగుతుంటాయి.
అవి చూడటానికి అక్కడ సేవ నిమిత్తంగా మేము నైమిశారణ్యం వెళ్ళాము. అక్కడ మాతాజీకి మేము డబ్బులు ఇద్దామనుకున్నాము.
ఈ లోగా నైమిశారణ్యం బాబాగుడి చూసుకుంటున్న పూజారి గారు బాబా విగ్రహం చుట్టూ కట్టడిలాగా గ్రిల్ కావాలి అంటూ చెప్పారట.
ఆ గ్రిల్ కొనటానికి సెలక్షన్ కోసం అక్కను పూజారి గారు తీసుకు వెళ్ళారు. నన్నూ రమ్మనమన్నారు.
ఇది కొనాలంటే డబ్బులు కావాలి అనుకుంటుంటే మాకే అనిపించింది. ఎక్కడో ఎందుకు ఇవ్వడం ఎలాగో మేమిద్దరము ఇద్దామనుకుంటున్నాము ఆ డబ్బేదో ఇక్కడ ఈ గ్రిల్ కోసం ఇస్తే మా పేర్లు చిరస్థాయిగా ఉండిపోతాయి అనిపించింది.
40,500 రూపాయలు అయ్యింది. ఆ గ్రిల్ పని మేము ఇక్కడ ఉన్నప్పుడే అయిపొయింది.
మా ఇంట్లో అందరం నాలుగు హారతులు ఇస్తాము. అలాగే మా చెల్లెలు, మా అక్క కూడా చేస్తుంటారు.
మా చెల్లెలు కూడా తను ఏది వండితే అది బాబాకి నైవేద్యం పెడుతుంటుంది. మా చెల్లెలు కూతురు నేపాల్ లో మెడిసిన్ చదువుతోంది.
దానికేవో అనుకోకుండా సెలవులు వచ్చి వైజాగ్ వచ్చింది. అప్పటికే మేమంతా నైమిశారణ్యం రావడానికి రిజర్వేషన్ చేయించుచేసుకున్నాము.
దాన్ని ఒక్కదాన్నే వదిలేసి మేమందరం బయలుదేరి వచ్చేసాము. వాళ్ళుండేది వైజాగ్ దగ్గరలో ఒక పల్లె.
మేమంతా బయలుదేరి వచ్చేసాక దానికి ఎవరో జున్ను పాలు తెచ్చి ఇచ్చారుట! అది జున్ను వండి చుట్టూ పక్కల పిల్లలందరికీ పెడుతోందిట!
వెనుక నుండి ఎవరో ఒక ముసలామె వచ్చిందిట, వంట చేసుకుంటున్న అమ్మాయి ఆవిడను చూసి ఎవరు కావాలి అని అడిగిందట!
మీ అమ్మ అయితే నాకు పెట్టి గాని ఎవరికీ ఏమి పెట్టదు, నువ్వు నాకు పెట్టకుండా అందరికి పెట్టేస్తున్నావు అందిట. మీరెవరో నాకు తెలియదు అని సరే ఉండండి అని స్టీలు గిన్నెలో కొంచెం జున్ను పెట్టి ఇచ్చిందట.
మా చెల్లెలు కూతురు ”సాయి చైత్ర”. నాకు స్టీలు గిన్నె వద్దు ప్లాస్టిక్ గిన్నెలో పెట్టి పట్టుకురా అందిటావిడ.
సరేనని లోపలికి వచ్చి ప్లాస్టిక్ గిన్నె లో జున్ను వేసి స్పూన్ కోసం చూస్తూ కిటికీ లోంచి గ్రిల్స్ లోంచి బయటికి చూసిందట, దానికి బయట ఎవరూ కనపడలేదట,
దానికి చాలా భయం వేసి వెంటనే ఏడ్చుకుంటూ మాకు ఫోన్ చేసింది. మేము ప్రతీదీ నైవేద్యం ”బాబా” కి పెడుతుంటాము కదా,
మా పిల్లకావిషయం గుర్తు లేదో, తెలియదో, ఆ రోజు తయారు చేసిన జున్ను నైవేద్యం పెట్టలేదు. నీ నైవేద్యం స్వీకరిస్తాను అని తానే తెలియబరుస్తూ ఇలా పాపకి కనపడి ఉంటారు ఆయన.
మా చెల్లెలికి ఒక సారి స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో ”రామ విజయం” చదువు అని వచ్చిందట.
ఆ రామ విజయం ఏమిటో ఎక్కడ దొరుకుతోందో తెలియదు. గురువు గారికి ఫోన్ చేశాను అవునా అలా కల వచ్చిందా అయితే తప్పక చదవాలి. ”షిరిడి సంస్థానం” లో దొరకవచ్చు. ఆ పుస్తకం తెప్పించుకుని చదవమని చెప్పారు.
మా చెల్లెలు ఎవరో షిరిడి వెళ్తుంటే వారి చేత ఆ పుస్తకం తెప్పించుకుని చదివింది.
ఆ తర్వాత మా చెల్లెలికి ”నీ కూతురి కీడు బట్టలు (పాత బట్టలు) తీసుకెళ్ళి సముద్రంలో కలుపు” అన్న మాటలు వినిపించాయట.
ఎందుకో ఇలా ”బాబా” చెప్తున్నారు అని అనుకుని వైజాగ్ వెళ్లి మా చెల్లెలు తన కూతురి బట్టలు సముద్రంలో కలిపి వచ్చిందట.
ఆ తర్వాత మా చెల్లెలి కూతురు సాయి చైత్ర నేపాల్ నుండి వచ్చి ఏదో పని మీద తల్లి , కూతురు రోడ్డు మీద వెళ్తుంటే హఠాత్తుగా ఎదురుగా లారీ వచ్చేసింది,
మా చెల్లెలు తను తప్పుకుంది, ఆ సమయంలో తనకి తెలియకుండానే మా చెల్లెలు పాప చనిపోయిందని ఊహతో పడిపోయింది.
మా చెల్లెలు ఆ అమ్మాయిని చెయ్యి పెట్టి లాగేసిందట బయటికి వచ్చిందో లేదో ఆమెకి ఏమి తెలియదు.
అమ్మా అమ్మా అంటూ కూతురు పిలుపుతో తెలివి వచ్చింది. మా చెల్లెలి కూతురు చున్నీ మాత్రమే లారీ తో వెళ్ళిపోయింది, దానికి ఏం మాత్రం ఒక దెబ్బ కూడా తగల లేదు.
మా చెల్లెలు హారతులు నాలుగు ఇస్తుంది. ఎప్పుడైనా ఉదయం కాకడ హారతికి దానికి మెలకువ రాకపోతే మా నాన్న గొంతుతో దాన్ని ”బాబా” వచ్చి లేపుతారట.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni.
Latest Miracles:
- అయ్యప్ప స్వాములతో పాటు వచ్చి భిక్ష స్వీకరించిన బాబా వారు!
- ఒక నాస్తికుని చేత శివదీక్ష చేయించి మోక్షాన్ని ప్రసాదించిన బాబా వారు!
- మృత్యు ముఖం నుండి నన్ను కాపాడిన సమర్ధ సద్గురు సాయిబాబా-10
- నచ్చిన ఆహారాన్ని వదిలిపెట్టమని సందేశం ఇచ్చి ఉద్యోగం ఇప్పించిన బాబా వారు …..!
- ఇంత చిన్నసేవకు బాబా స్వయంగా నాతో వచ్చేశారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments