Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా చెల్లెలి ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఇది. మా మరిది సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప మాల వేసుకుంటాడు.
ఆ సంవత్సరం అతనికి కొంచెం ఒంట్లో బాగుండక వేసుకోలేదు. మాల వేసుకోలేదు కదా కొంతమంది అయ్యప్పలకి భిక్ష అయినా పెడదామనుకుంది మా చెల్లెలు.
వాళ్ళమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ నాన్న కూడా అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటాడు, ఆయనకి చెబితే
మేము రేపే శబరికి వెళ్ళిపోతున్నాము ముందు రోజు ఎవరింటికీ భిక్షకి వెళ్లము కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి సాయంత్రం ఫలహారం చేస్తాం. నేను ఇంకో ముగ్గురమూ కలిసి వస్తాము అని చెప్పి వెళ్లిపోయాడు.
మా చెల్లెలు అన్ని ఏర్పాట్లు చేసుకుంది నాలుగు రకాల టిఫిన్స్ చేసి రెడీ గా ఉంచింది.
ఈ లోపు వాళ్ళు వచ్చారు పాప వాళ్ళ ఫ్రెండ్ నాన్నతో పాటు ఇద్దరు మాత్రమే ఉన్నారు నాలుగో వ్యక్తి రాలేదు.
వాళ్ళకి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చింది. వాళ్ళు లోపలికి వచ్చారు, తినటానికి ఆకులు వేసి అన్నీ వడ్డించింది.
అందులో ఒకాయన మాత్రం వంచిన తల ఎత్తడం లేదు. అసలు ఏమీ మాట్లాడటం లేదు, అయ్యప్ప గురించిన కబుర్లు చెప్పుకుంటున్నారు.
ఇంకో ఆయన, ఫ్రెండ్ వాళ్ళ నాన్న మాట్లాడుతున్నారు కానీ ఆ మూడో వ్యక్తి అసలు మాట్లాడటం లేదు.
అంతా అయ్యాక ఆఖరుగా నేను ఎన్ని పూజలు అమ్మవారికి చేసినా, అయ్యప్ప పూజలు చేసినా, నేను ఆఖరుగా నమ్మేది కొలిచేది ఒక్క బాబానే ఆయనే నాకన్నీ ఆయన లేకపోతే మేము లేము అని తేల్చేసింది మా చెల్లెలు.
వాళ్ళు వెళ్ళిపోతూ మేము సివిల్ అయ్యాక మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలుస్తాము అని చెప్పి వెళ్లిపోయారు.
అలా వెళ్ళినవాళ్ళు 6 నెలల తర్వాత మామూలు బట్టలతో వాళ్ళింటికి వచ్చారు.
చెల్లి వాళ్ళని ‘ఎవరు మీరు? ఏం కావాలి” అని అడిగింది వాళ్ళు మేమండీ 6 నెలల క్రితం మీ ఇంటికి టిఫిన్ చేయటానికి అయ్యప్ప డ్రెస్ లలో వచ్చాము, మేము మళ్ళీ కలుస్తామని చెప్పాము కదా! అందుకనే వచ్చాము” అన్నారు.
వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ నాన్న కాకుండా మరో ఇద్దరు వచ్చారుగా వాళ్ళిద్దరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అట.
ఒకాయన మాట్లాడాడు రెండవ ఆయన అసలు మాట్లాడలేదు అన్నాను కదా, అతను ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు ఈ రోజు చెబుతున్నాడు ,
”మేము కాళ్ళు కడుక్కోటానికి వెడుతూండగానే, మా కంటే ముందే బాబా అక్కడున్నారు లోపలకి వచ్చి విస్తరి దగ్గర కూర్చునేసరికి, మా కంటే ముందే ఆయన అక్కడ విస్తరి వేసుకుని వడ్డించుకుంటున్నాడు.
నా కాయన కనపడుతున్నాడు, నేను ఇక్కడ బాబా ఉన్నాడని చెప్పేబోతే నన్ను చూపుడు వేలు ఆడించి చెప్పవద్దని మాట్లాడవద్దని సైగ చేసాడు.
అందుకనే నేను మాట్లాడ లేదు. మీ ఇంట్లో మాకు బాబా దర్శనం ఇచ్చారమ్మా నువ్వు చాలా గొప్పదానివి ” అంటూ చెల్లెల్ని పొగిడారు.
వాళ్ళు అప్పుడప్పుడూ వచ్చి బాబాకి స్వీట్స్, దండలు ఇచ్చి వెడుతుంటారు. అంతా బాబా దయ.
సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణ మస్తు
శుభం భవతు
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- ఆకలితో వున్నా భక్తురాలు వేదనగా సాయిని ప్రార్ధించగా ఆహారంతో పాటు జీవనోపాధిని చూపించిన బాబా వారు–Audio
- భక్తురాలు దసరా రోజు ఇంట్లో పెట్టుకున్న సత్సంగం కు తాను సైతం వచ్చి నిదర్శనము చూపించిన బాబా వారు.
- నాలుగు హారతులు చూడాలనుకున్నా భక్తురాలి కోరికను తీర్చిన బాబా వారు….
- భక్తురాలు నైవేద్యం గా పెట్టిన కిచిడి, దక్షిణను మారు రూపంలో వచ్చి స్వీకరించిన బాబా వారు
- బంగారు బాబు రూపంలో వచ్చి నా భార్య కాలు నొప్పిని సరి చేసినా బాబా వారు ……!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments