భక్తురాలు దసరా రోజు ఇంట్లో పెట్టుకున్న సత్సంగం కు తాను సైతం వచ్చి నిదర్శనము చూపించిన బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మేము రూముకు వెళ్లిపోయాం. మర్నాడు మా పక్క రూమ్ వాళ్ళు మీరు ఎప్పుడు వచ్చారు. మీరు రూమ్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసారు అంటూ అడిగారు.

మేము నిన్ననే వచ్చాము రాగానే మాకు రూమ్ ఇచ్చారు అని చెప్పాము. అది ఎలా సాధ్యం నాలుగు రోజుల ముందు వచ్చిన వారికిప్పుడు  రూములు ఇస్తున్నారు.

మీరు నిన్న వస్తే, నిన్నే రూము ఎలా ఇస్తారు? అన్నారు. అది మాకు తెలియదన్నాము.

ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అన్నారు, మాకు ఎవ్వరు తెలిసిన వాళ్ళు లేరన్నాము.

మూడురోజులున్నాము. మూడోరోజు తాళం ఇవ్వటానికి వెళ్తే ఆ కౌంటర్లో వున్న అతను ఈ తాళం మీకు ఎవరిచ్చారు? అన్నాడు.

నువ్వే ఇచ్చావు అంటే, నేను ఇవ్వలేదంటాడు.  సంతకం చేసాను. తాళం నువ్వే ఇచ్చావంటే డబ్బులు కట్టావా? అంటాడు.

కట్టినట్టుగా రిసీట్ వుంది ఆ పొడుగాయన తన పేరు కూడా చెప్పారు. ఆ పేరు చెపితే అలాంటి పేరు కలవారెవరు లేరన్నాడు.

సాక్షాత్తూ ఆ సాయినాధుడే వెంట పెట్టుకొని తనే శిరిడీ తీసుకువచ్చి, రూమ్ తానె ఇచ్చి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తానే చూసుకున్నాడు.

మేము తరచూ విఠల్ బాబాగారి వద్దకు వెళ్తూ పూజలలోను, భజనల లోను పాల్గొంటూ ఉండటాన మాకు బాగా దగ్గరయ్యారు.

అయన ద్వారా మౌలానా బాబా అన్నవారు కూడా మాకు బాగా పరిచయం అయ్యారు.

మౌలానా బాబాగారు ఒకరోజు రాత్రి 9 గం!!ల కి ఫోన్ చేసి – (అందరు నన్ను సీతక్క అంటారు), సీతక్క స్వీట్ తీసుకొనిరండి అన్నారు.

తయారు చేయడానికి సమయం కావాలంటే, ఏంచేస్తారో నాకు తెలియదు స్వీట్ తోటి 5 ని!!లో  ఇక్కడుండాలి అన్నారు.

పిల్లలని పడుకోపెట్టి బయట తాళం వేసుకొని సుష్మా థియేటర్ దగ్గర స్వీట్ షాపులో స్వీట్ కొనుక్కొని పనామా గౌడౌన్ దగ్గర వున్న ఆయన ఆశ్రమానికి వెళ్ళాము.

ఆయన లోపలవున్నారు. అయన దగ్గర చాలా మంది పిల్లలు వుంటారు. పిల్లలు గంపలతో పూలు లోపలికి పట్టుకొని వెళ్లారు.

దాదాపు గంట తర్వాత పిల్లలు బయటికి వచ్చి మిమ్మల్ని స్వామి పిలుస్తున్నారు అని చెప్పారు.

లోపలికి వేరే ఎవర్నీ రానీయరు. మేము కూడా ఇంతకముందు ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు.

ఎప్పుడూ వచ్చినా హాలులోనే కూర్చుంటాము. అలాంటిది ఈ రోజు ఫోన్ చేసి ప్రత్యేకించి  పిలిపించి  లోపలికి రమ్మంటున్నారే, అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాము.

లోపల పెద్ద హాలు వుంది హాలు మధ్యలో బాబాగారి విగ్రహం వుంది. దాని చుట్టూ రకరకాల పూలతోటి అలంకరించబడి వుంది. లోపల నుంచి మౌలానా బాబా వచ్చారు.

మమ్మల్ని చూసి ఈ రోజు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే, వేరేవాళ్లు దసరా ఉత్సవాలు అక్కడెక్కడో చేసుకుందాం రమ్మంటే నేను మా దగ్గరే చేసుకుంటాం అని చెప్పాను.

ఈ రోజునుండి దసరా నవరాత్రులు మొదలుకదా అందుకని మొదటిరోజు మీ చేత స్వీట్ బాబాకి పెట్టిద్దామని పిలిపించాను అన్నారు.

ఆ స్వీట్ ప్యాకెట్ బాబా పాదాల దగ్గర పెట్టి కూర్చోండి అన్నారు, మరియు దసరా రోజు సీతక్క మీ ఇంట్లో భజన, పూజ చేయించు అన్నారు.

నేను సరేనన్నాను, మిగతా రోజులన్ని మౌలానా బాబాగారి ఆశ్రమంలో పూజలు భోజనాలు జరిగాయి,

దసరా రోజు మా ఇంట్లో భజన పెట్టుకున్నాం. చాలా మంది సాయిబాబా భక్తులు వచ్చారు, వేరే వేరే వూర్ల నుండి కూడా వచ్చారు. వంటలు చేయిస్తున్నాం.

అంతమందికి భోజనాలు పెట్టాలని పొంగలి చేయించాము. పొంగలి గిన్నెలో ఎవరో చేత్తో కొంత భాగం తీసినట్లుగా గుర్తులు కనపడ్డాయి,

వంట దగ్గర మా అమ్మ గారు ఉన్నారు. నేను అది చూసి ఇక్కడికి ఎవరైన వచ్చారా? అని అడిగాను, లేదు ఎవరు రాలేదు, ఏం జరిగింది అని అడిగింది మా అమ్మ.

నేను గిన్నె చూపించి చూడు గిన్నె లోంచి పొంగలి ఎవరో తీసినట్టుగా ఎలా కనపడుతుందో అన్నాను.

మా అమ్మ అది చూసి – అవునే సీత నువ్వు చెప్పింది నిజమే ఎవరో తీసినట్టుగా గుర్తులు కనిపిస్తున్నాయి.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles