Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా అమ్మాయి పుట్టిన తర్వాత దానికి 1 1/2 వయస్సు ఉండగా మేము ఎక్కడ సచ్చరిత్ర పారాయణ జరిగినా కుటుంబ సమేతంగా వెడుతుండేవాళ్ళం.
మా పాప మా అమ్మగారి ఒళ్ళో పడుకొని దానికి మాటలు కూడా సరిగ్గా రావు, ఆ వయస్సులో ఆ చదువుతున్న బాబా కథలు చాలా శ్రద్ధగా వింటుండేది మరి దానికా వయసులో ఏం అర్ధమయ్యేదో ఏమో.
మాకు ఒక షాపు ఉంది. ఒక రోజు రాత్రి మా షాపు మూసేసే సమయంలో మా అమ్మ గారి దగ్గర మా పాప ఉంది, అది ఇంకా నిద్ర పోలేదు,
అదే సమయంలో మా పనిమనిషి పనులు పూర్తి చేసుకొని ఇంటికి పోతూ, మా పాపతో ” నాన్న గారు షాపుకి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయాక మీ షాప్ లో సామానంతా నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను ” అంది దాన్ని ఉడికించడానికి,
దానికి మా పాపా ” సరే తీసుకో మా బాబా చూసుకుంటారు లే ” అంది మా అమ్మాయి.
మా పాప సమాధానానికి పని మనిషి ఆశ్చర్యపోయింది. అక్కడ నేను మా అమ్మ కూడా ఉన్నాం.
ఒక సారి మా ఇంటికి ఎవరో వచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మధ్యలో ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళ అబ్బాయి గురించి
మా వాడు సరిగ్గా చదువుకోవట్లేదు పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఎలా పాసవుతాడో ఏమో? అని మా అమ్మతో వాళ్ళ గోడు వెళ్లబోసుకుంటుంది ఆవిడ.
మా అమ్మ ఎదో చెప్పేలోపల మా అమ్మాయి ఎక్కడ నుంచి వచ్చిందో, అక్కడికి వచ్చి ” నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టండి ” అని చెప్పింది.
అంతే అక్కడున్న అందరం కళ్ళు తేలేసాము. ఆ పసి దాని నోటి వెంట బాబా కథలు సలహాలుగా వస్తుంటే, పసిపిల్లలని కూడా సచ్చరిత్ర ఎంత ప్రభావితం చేస్తుందో అర్ధం అవుతుంది.
ఒక చోట ఆధ్యాత్మిక శిక్షణా తరగతులు జరుగుతుండగా అక్కడికి వచ్చిన వాళ్లందరికీ స్వీట్, హాటు పెడదామని నేను మూడు, నాలుగు కేజీలు ప్యాక్ చేయించుకుని తీసుకువెళ్లాను.
మధ్యాహ్న భోజనంలో స్వీట్ పెడదామనుకుని, పెట్టాము. ఇంకా కొన్ని మిగిలిపోయాయి.
సాయంత్రం మళ్లీ గుళ్లో పారాయణ ఉంది. ఆ మిగిలింది సాయంత్రం పారాయణ తర్వాత ప్రసాదంగా పంచి పెడదాము అన్నాడు ప్రసాద్ అన్న ఆయన, నేను సరేనన్నాను.
సాయంత్రం పారాయణ అవ్వగానే ప్రసాదంగా పంచి పెడదామన్న ప్రసాద్ గారే, కాసేపయ్యాక ” నరసింహారావు – నువ్వు ఎక్కడైతే స్వీట్స్ తీసుకువచ్చావో అక్కడికి వెళ్ళి ఇవి ఇచ్చేసి డబ్బులు తీసుకువచ్చేయ్” అన్నారాయన.
ఇదేమిటి ఉదయం ప్రసాదంగా పనికి వస్తాయన్న ఈయన సాయంత్రం అయ్యేటప్పటికి ఇచ్చేసి డబ్బులు తీసుకురా అంటున్నాడు అనుకుని ఏమోలే! పెద్దాయన చెప్పాడు కదా అని సరే అన్నాను.
ఆ ప్యాకెట్స్ స్కూటర్ మీద పెట్టుకుని స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే ఎంతకీ స్టార్ట్ అవ్వటంలేదు? నిజానికి నేను సైకిల్ వేసుకుని వెళ్ళాను.
నా సైకిల్ అక్కడ ఉంచి గురువుగారి స్కూటర్ తీసుకుని గురువుగారింటికి వెళ్లి, పారాయణ సమయం అయిపోతుంది కాబట్టి నేను స్కూటర్ తీసుకువెళుతున్నాను అని చెప్పటానికి గురువుగారింటికి వెళ్ళాను.
నాలుగు కిలోమీటర్లు వెళ్లి రావాలి, అందుకని సైకిల్ కంటే స్కూటర్ అయితే తొందరగా వెళ్లి రావచ్చు అని అనుకున్నాను.
చాలా సేపటికి బండి స్టార్ట్ అయ్యింది, కొంచెం దూరంలోనే ఉన్న గురువుగారింటికి వెళ్ళాను.
ఆయన ఇంటి ముందు బండి ఆపి, ఆయనకీ విషయం చెప్పి, ఆయన టీ ఇస్తే తాగి బయలుదేరుదామని మళ్లీ స్కూటర్ స్టార్ట్ చేస్తే అవటం లేదు.
స్వీట్స్ ప్యాకెట్ బండి మీద ఉన్నాయి. నేను స్టార్ట్ చేస్తున్నాను, చేస్తున్నాను అవటం లేదు.
ఈ లోపు గురువుగారి అబ్బాయి వచ్చాడు. అతను ” మీరుండండీ నేను చూస్తాను” అంటూ స్కూటర్ నా చేతిలోంచి తీసుకున్నాడు. స్వీట్ ప్యాకెట్ తో నేను ఇవతలికి వచ్చి నుంచున్నాను.
రెండవసారి కిక్ కొట్టంగానే స్టార్ట్ అయ్యింది. మీరు కిక్ కొడితే స్టార్ట్ అయ్యింది అంటూ స్కూటర్ చేతిలోకి తీసుకున్నాను, బండి మీద పాకెట్స్ ఉంచి స్టార్ట్ చేశా, స్టార్ట్ అవ్వలేదు.
శిక్షణా తరగతులు జరుగుతున్న ప్రదేశానికి నడిపించుకుంటూ స్కూటర్ తీసుకువచ్చాను. మిగతా వాళ్లంతా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ ప్రసాదం ఇక్కడ మిగిలింది పారాయణ లో పంచుకుందామనుకుని మళ్లీ అమ్మేయటానికి తీసుకు వెళ్తుంటేనే బాబా బండికి అడ్డం పడుతున్నారులా ఉంది. అందుకే స్టార్ట్ అవ్వటం లేదు.
దాని మీద నుండి ప్రసాదం ప్యాకెట్ తీసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతోంది, అదే కారణం అనిపించింది నాకు.
నేను ప్రసాద్ గారు కనిపిస్తే అడిగేసాను. ” ఏమండీ! ప్రసాద్ గారు మీరు ఉదయం భోజనంలో – మిగిలిన స్వీట్స్ సాయంత్రం పారాయణ తర్వాత పంచుదాము అని అన్నారు, తర్వాత మీరే మళ్లీ తిరిగి షాప్ లో తిరిగి ఇచ్చేస్తే మనకి పైసలు ఇచ్చేస్తాడు అమ్మేయి అన్నారు.
నేను తీసుకువెళదామని ప్రయత్నం చేస్తుంటే బండి స్టార్ట్ అవటంలేదు. దాని మీద ప్రసాదం తీసేస్తే స్టార్ట్ అవుతుంది అన్నాను.
దానికాయన నొచ్చుకుంటూ ” అవును ఉదయం అలా అన్నాను కదూ మర్చిపోయి ఇలా అనేశాను. వద్దు ఇవ్వద్దులే అక్కడ పారాయణ అయ్యాక ప్రసాదంగానే పంచుదాం” అన్నాడు.
అంతే బండి వెంటనే స్టార్ట్ అయ్యింది. కొవ్వాడ దాకా ఇంకా ఎక్కడా ఆగనేలేదు.
The above the miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- బాబా స్వప్న దర్శనం….
- శ్రీ సాయి లీలామృత ధార – పోయిన స్కూటర్ దొరుకుతుందా లేదా? – రెండవ బాగం…
- చిన్న దెబ్బ కూడా తగలకుండా, పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడిన బాబా వారు
- సచ్చరిత్ర పారాయణ మొదలు పెట్టుటకు కారణము-బాబాగారు ఇచ్చిన నిదర్శనము.
- శ్రీ సాయి లీలామృత ధార – పోయిన స్కూటర్ దొరుకుతుందా లేదా? – మొదటి బాగం…
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments