బాబా స్వప్న దర్శనం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ముందుభాగం ఈ లింక్ క్లిక్ చేసి చదవండి. 

మా రూమ్ మెట్ ఒకమ్మాయి కి ఎవరో పూజారి ఒక నలభై రోజులు ఆంజనేయస్వామి గుడికి ఎర్లీ మార్నింగ్  వెళ్లి దీపం పెట్టి, లలితా సహస్రనామం,గురుచరిత్ర పారాయణ చేస్తే జాబ్,మ్యారేజ్ సెటిల్ అవుతాడని చెప్పారట.

తాను అలాగే చేసింది.వెంటనే నలభైఒక్కరోజే తనకి ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న జాబ్ కి ఆఫర్ వచ్చింది ఎలాంటిఇంటర్వ్యూ లేకుండా, జస్ట్ డైరెక్ట్ గా వెళ్లి ఆలా జాబ్ లో జాయిన్ అయి వచ్చింది.

మ్యారేజ్  కూడా సెట్ ఐంది.అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది.ఇలా బుక్స్ చదవగానే ఆలా వెంటనే జాబ్ వచ్చిందే అని..దానిని   పారాయణ అంటారని కూడా నాకుతెలియదు

.నాకు   కూడా వెంటనే జాబ్ రావాలి అంటే నన్నుకూడా గురుచరిత్ర బుక్ చదవమని ,నన్ను టెంపుల్ కి పరిచయం చేసినఫ్రెండ్ చెపితే వెంటనే ఆమె దగ్గర బుక్ తీసుకుని చదవటం స్టార్ట్చేశా…

తానుబుక్ ఇచ్చేటప్పుడు 7  రోజులు చదవాలి ఈ బుక్ ని అని చెప్పి నెక్స్ట్ డే  ఇంటికి వెళ్ళింది.నేనుఒక్కదాన్నే ఉన్నాను రూమ్ లో తరువాతి రోజు ఉదయమే బుక్ చదవటం స్టార్ట్ చేశా.

నాకు బుక్ ఎలా చదవాలో తెలియక మా ఫ్రెండ్  ఏడురోజులలో చదవాలి అని చెబితే నేను ఏడు రోజులు ఉదయం నుండి మధ్యాహ్నం వరకి చదువుతూ,ఏడు పారాయణాలు చేశా ( రోజు కొన్ని అధ్యాయాలు చదివిఏడు రోజులలో పూర్తి చేయాలనీ చెప్పిందని తెలియక రోజు బుక్ మొత్తం చదివేసేదాన్ని  )..

ఆలా గురుచరిత్రపారాయణ తరువాత ,బాబా సచ్చరిత్ర కూడా స్టార్ట్ చేశా.ఆలా చదువుతున్నప్పుడు   కలలోఒక బ్లూ కలర్ లో బాబా ఫోటో కనిపించింది.

నేను బాబా ఏంటి బ్లూ కలర్  లో ఉన్నారు అని డౌట్ తో ఫ్రెండ్ ని అడిగా..ప్రియా బాబా కలలో బ్లూ కలర్ లో కనిపిస్తారా అని..ఆమెకి అర్ధం కాలేదు.

అప్పుడు నేను కలలో బాబా ఫోటో బ్లూ కలర్ లో కనిపించింది అని చెప్పాను.అప్పుడు తను నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది.

ఇన్నిరోజులు నుండి పారాయణ చేస్తున్న నాకు బాబా ఎప్పుడు కలలో కనిపించలేదు.నువ్వు ఇలా స్టార్ట్ చేయగానే ఆలా కనిపించరు.ఫస్ట్ టైం గుడికి రాగానే నీతో అలకరించుకున్నారు,నువ్వు వచ్చిన ఫస్ట్ గురువారమే పల్లకీ  ఛాన్స్ ఇచ్చారు..

ఇన్నిరోజులనుండి చేస్తున్న నాకేమి స్వప్న దర్శనం  ఇవ్వలేదు అని.. నేను అదేంటీ బాబా బుక్ చదువుతున్నప్పుడు బాబా

స్వప్నదర్శనం ఇస్తారని ఉంది కదా బుక్ లో.నువ్వు ఎప్పటినుండో చదువుతున్నావు కదా నీకుకనిపించలేదా అని ఆడిగితే

..చాలా రోజులనుండి పారాయణ చేస్తున్న కానీ,నాకు ఒక్కసారి కూడా కనిపించలేదు.

నీకు బాబా బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని అంది . నాకు చాల హ్యాపీ గా అనిపించింది..

తరవాతి భాగం ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా స్వప్న దర్శనం….

Sreenivas

Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles