Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఆ తరువాత నేను ”శిరిడీ” వెళ్లాలని అనుకున్నాను. నేను ఒక్కడిని ఉగాది అమావాస్య రోజున బయలుదేరాను.
ఎందుకంటే పండుగ రోజు సెలవు ఉంటుంది కాబట్టి సెలవు కలిసి వస్తుందని. అసలు అమావాస్య రోజున నేను ప్రయాణం చేయను.
శిరిడీలో ఒక్కరికి రూమ్ ఇవ్వరు. కానీ నేను వెళ్ళేటప్పుడు వెస్ట్ గోదావరి ఫ్యామిలీ ఒకరు నాకు పరిచయం అయ్యారు.
వాళ్ళు ”ఏమండీ! మాకు అసలు హిందీ రాదు, మీది హైదరాబాద్ అంటున్నారు, మహారాష్ట్ర అంటే అంతా మోసాలు ఉంటాయి అంటారు, మీరు కొంచెం మా కూడానే వుండండి అన్నారు.
నాగర్ సోల్ లో రైలు దిగాక టాక్సీ మాట్లాడాను, నేనూ, నాతొ పాటు ఆ ఫ్యామిలీ ఆంతా బయలుదేరి ‘శిరిడి’ కి వెళ్ళాము.
మీరు ఒక్కరే వేరే ఎక్కడో ఎందుకు మాతోనే ఉండండి అంటూ వాళ్ళ రూమ్ లోనే నాకు ప్లేస్ ఇచ్చారు .
ఉగాది పండుగ కాబట్టి జనం అసలు లేరు. అంతా ఖాళీగా ఉంది. చాలా సార్లు దర్శనం చేసుకున్నాను.
మా ఇంటి దగ్గర ”నరసింహ స్వామి” గుడి ఉంది. ఆ గుడికి నేను రోజూ పూజకి పూలు తీసుకెళుతుంటాను.
మాకు ”సాయి బాబా” గుడి దూరంగా ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే కొంత దూరం వెళ్ళాలి. అందుకని నేను నరసింహ స్వామికే రోజూ 40 ప్రదిక్షణలు, ఆయన్నే బాబా లాగా అనుకుని చేశాను.
ఐదవ రోజు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు పైన దత్త సాయి, క్రింద దుర్గా దేవి లాగా దర్శనం అయింది.
ఆరవ రోజు నేను మధ్యాహ్నం పూట పడుకుని ఉంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసారు. అంతక ముందు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి.
ఆ సమయంలోనే నేను బాబాకు చెప్పుకున్నాను, ”బాబా నా దగ్గర డబ్బు అంతా అయిపోతుంది. అవి కాస్త అయిపోయాయంటే నా దగ్గర ఇంకేమి ఉండవు, నువ్వే చూసుకోవాలి. ఏం చేయాలో” అనుకున్నాను.
అప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసి ”గిరిధర్ నువ్వు ఏమైనా జాబ్ చేస్తున్నావా అని అడిగాడు”, ”ఏం చెయ్యటం లేదురా” అన్నాను.
”నువ్వు నా దగ్గర పని చెయ్యి, నేన్ను నీకు కావాల్సిన వన్నీ చూసుకుంటాను, అది ఇంట్లోంచి పని చేసుకోవచ్చు online లో అని చెప్పాడు. ” ఇప్పుడు నేను అతని దగ్గరే పని చేస్తున్నాను.
ఆ తర్వాత మా స్నేహితుడైన ”నరసింహ మూర్తి” గారు మా ఇంటికి వచ్చి, ”నాకు ట్యాంక్ బండ దగ్గర పని ఉంది నేను వెడుతున్నాను, నువ్వు వస్తావా” అని అడిగారు.
”నేను సరే” అన్నాను. వెళ్ళేటప్పుడు క్రెడిట్ కార్డు పట్టుకుని మరీ వెళ్ళాను. ఆయన పని అయ్యాక, నేను శిరిడీ టికెట్స్ బుక్ చేసుకుంటాను అన్నాను, టికెట్ బుక్ చేశాను.
నేను బయలుదేరేటప్పుడు ”నాకు 3 దర్శనాలు తప్పని సరిగా ఇవ్వాలి బాబా” అని అనుకున్నాను.
మేము వెళ్ళగానే పాదాల వైపు దర్శనం అయింది. మరో సారి మధ్యలో అయింది. ఇంకోసారి దర్శనం మిగిలి పోయింది.
మేము రెండవ సారి దర్శనం చేసుకుని బయటకు రాగానే, మాకు ఒక మినిష్టర్ గారి భార్య ఎదురు వచ్చింది.
ఆవిడ మా దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర VIP పాస్లు ఉన్నాయని, వాళ్ళలో ఇద్దరు తక్కువయ్యారని నన్ను పిలిచి ”మీరు దర్శనానికి వస్తారా” అని అడిగింది.
మేము VIP పాస్ తో లోపలికి వెళ్ళాము. బాబా స్పెషల్ దర్శనం ఇప్పించాడు. ఈ సారి బాగా దగ్గరగా బాబా దర్శనం జరిగింది.
మా బావ మరిది పెళ్ళికి బాణాసంచా కొన్నారు మా వాళ్ళు. ఆ షాప్ లో బాణాసంచాతో పాటు బాబా ఫోటో కూడా ఇచ్చారు.
మా వాళ్ళు ఆ ఫోటో తో పాటు సంచిని పెళ్ళి మండపానికి తెచ్చారు. గేటు పక్కనే నా కార్ పార్కింగు చేశాను.
పిల్లలంతా సామాను కాల్చేసి నా కారు మీద ”బాబా ఫోటో” అలానే ఉంచారు. రెండు రోజుల పాటు అది అలానే ఉంది.
నేను అందర్నీ అడిగాను. ఈ ఫోటో తీసుకోమని చెప్పాను. కానీ ఎవరూ ఆ ఫోటోని తీసుకోలేదు. చివరికి నా కారు లో ఆ ఫోటో ఉంచి ఇంటికి తెచ్చుకున్నాను.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబా దర్శనం మరియు ఆయన ఇచ్చిన కానుక
- పసివాళ్లుగా దర్శనం ఇచ్చిన బాబా, దత్త భగవానుడు…!
- సాయి పాము, కుక్క రూపాలలో దర్శనం
- కువైట్ కి చెందిన సాయి గీత గారికి ఈరోజు(07th November 2016) బాబా ఇచ్చిన అనుభవము
- బాబా నాకు అలా తినిపించటం నేను మర్చిపోలేని అనుభూతి.-9
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments