బాబా దర్శనం మరియు ఆయన ఇచ్చిన కానుక



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

కోడూరు కి చెందిన మహతి(రమణి) గారు తమకు బాబా ప్రసాదించిన మరో దివ్య అనుభవాన్ని saileelas.com ద్వారా సాయి బంధువులతో పంచుకోవడానికి నాకు whatsapp లో పంపించారు. అది మీకోసం క్రింద ఇస్తున్నాను. ఆమె మాటలలోనే చదవండి. వారికీ బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను.

సాధారణంగా మనకు కష్టం కలిగితే దేవునికి చెప్పుకుని కష్టం గట్టెంక్కించమని వేడుకుంటాం. కాని తన భక్తులకు వచ్చే కష్టం తనకు చెప్పకముందే తీర్చే దేవుడు సాయి అని చెప్పక తప్పదు.

నేను సాయి భక్తురాలిని అయిన కొత్తలో నాకు ఆర్ధిక ఇబ్బంది చాలా వుండేది. బాబాది పెద్ద ఫోటో కావాలనే ఆశ వుండేది. కొనే స్తోమత లేదు. కాబట్టి యెవరైనా ఇస్తే తప్ప నేను కొనలేను అనుకున్నాను.

తర్వాత ఆ విషయం మరచిపోయి చాలా యేళ్ళు గడిచింది. 2009లో షిరిడి అమ్మ, నాన్న, నేను వెళ్ళాము. షిరిడి చేరాక ముందు రూమ్ తీసుకుని రూమ్ లో దిగి స్నానాలు కానిచ్చి ముందు ఊరంతా తిరిగి చూశాం. ఎందుకంటే మా నాన్న అమ్మ గారికి హిందీ రాదు. కొన్ని చోట్లు చెప్పి తప్పిపోతే అక్కడకు రమ్మని చెప్పాను. మాదగ్గర ఫోన్స్ లేవు.

సాయంత్రం బాబా దర్శనం కోసం ఆంజనేయ స్వామి గుడి వుండే ద్వారం వైపు నుండి వెళ్ళ బోయాము. అనుకున్నట్టే మా నాన్న గారు తప్పిపోయారు. రూమ్ యడ్రస్ తెలుసు కాబట్టి మేము భయపడలేదు. ద్వారకామాయికి వుండే గుమ్మం ఒకటి మూసేసి గోడ కట్టేశారు. కాని మెట్లు అలాగే వున్నాయి.

ఆ మెట్లపై ఒక వ్యక్తి కాషాయ వస్త్రాలు అచ్చు బాబా లాగే వస్త్రధారణ తో కూర్చొని వున్నారు. నా మనసు పదే పదే ఆయన బాబాయేనని ఆనంద పడుతోంది. కాని మా అమ్మ నాది మూఢ భక్తి అనుకుంటారని మనసుకు కళ్ళెం వేశాను. ఇంతలో మా అమ్మ నాతో “అమ్మలూ ఆయన బాబాలాగే“ వున్నారు కదా అన్నారు.

నాకు కలిగిన ఫీలింగే మా అమ్మకూ కలిగిందని అర్ధమై గిర్రున వెనక్కు తిరిగి ఆయన వద్దకు వెళ్ళి పది రూపాయల నోటు అయన చేతిలో పెట్టి ఇంతకన్న నీకేమివ్వగలను బాబా అని మనసులో అనుకున్నాను. ఆయన ఒక చిరునవ్వు నవ్వారు. దానర్ధం నాకు ధనమిచ్చేంతటిదానివా? అని.

నోటు జోలెలో వేసుకొని రెండు అరచేతులు పైకెత్తి దీవించి యెడమ చేయి(ఖాళీ) గాలిలో ఆడించి గుప్పెట మూసి నా చేతిలో పెట్టి నా గుప్పెట మూసేశారు.

గుప్పెట్లో యేముందో నాకు తెలియలేదు. అక్కడే చూద్దామంటే ఆయనను అవమానించినట్లవుతుందని కొంత దూరం పోయి చూసుకున్నాను. అదేమిటంటే బాబా ముఖం మాత్రమే ఉన్న ఒక స్టిక్కర్. మీకు కూడా తెలియాలని ఈ లీలతో పాటు ఆ ఫోటో క్రింద ఇస్తున్నాను చూడండి.

అది చూశాక కృతజ్ఞతతో నా కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. మరలా ఆయన దగ్గరకు వెళ్లాను. నాకుమాటలు రావడంలేదు యేడుపే వస్తోంది.

నా అవస్త చూసి ఆయనే “డబ్బులు లేవని బాధ పడుతున్నావుగా నీ పర్స్ కి అంటించుకో” అన్నారు. నేను షిరిడి వెళ్ళడానికి రూపాయి రూపాయి కూడబెట్టుకుని వెళ్ళాను. బాబా పోటో నేను కొనను యెవరైనా ఇస్తే ఇంట్లో పెట్టుకుంటానన్నానుగా. అందుకు బాబాయే నాకు అ మూర్తిని అనుగ్రహించారు.

ఆయన సాక్షాత్తు బాబాయే. లేకపోతే నేను ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నానని ఆయనకెలా తెలుస్తుంది.

అన్నట్లు మరచిపోయాను. ఇటు కాదు ముందు ద్వారకామాయి దర్శించి తర్వాత సమాధి మందిరం దర్శించుకోమని ఆయనే మాకు చెప్పి వెనక్కు పంపారు.

అప్పుడే మాకు సమాధి మందిరం లో మూడు తలల బాబా దర్శనమైంది. ఆ లీల ఇదివరకే మీకు తెలియజేసాను.

మూడు తలలతో బాబా దర్శనం గురించి మహతి గారు చెప్పిన బాబా లీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles