బాబా ఇచ్చిన ఇటుక (రెండవ భాగం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఓం సాయి రామ్

నా పేరు లక్ష్మి ప్రసన్న.

ఆ విదంగా ఆవిడ ఇటుక గురించి బాబా చెప్పమన్నారు. అని ఇంకా కొన్ని విషయాలు చెప్పారు.

నాకు సంతోషం, ఏడుపు రెండు కలసి పైగా అప్పుడు నేను ఉన్నది ద్వారకామాయిలో, ఈ విషయాలతో కాకడ హారతి సమయం అయ్యింది.

హారతి చూసుకొని వెన్న ప్రసాదం కోసం వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తి నేను పరిచయం ఉన్నట్టుగా నా దగ్గరకు వచ్చారు.

బాగా మాటల్లో పెడుతున్నారు, నేను మీకు తెలియదు, మీరు నాకు తెలియదు సాయి రామ్ అంటే లేదు నీకు ఏమి గుర్తు రాలేదా నిన్ను చూడగానే నాకు అంత గుర్తు వచ్చింది అని చెప్తున్నారు.

బాబా నేను మీ దగ్గర ఉన్నాను నాకు బయం లేదు, ఇది మీ సన్నిది అని నేను లోపల మనసులో బాబాకి చెప్పాను .

మరలా ఇంకో ఆవిడ  అంతే చెప్తూ నా వెంట, అబ్బో !!! ఇది ఎదో తేడాగా ఉందే, ఒక వైపు బాబా సన్నిది నమ్మకం, చివరకు మా మాటలు మాకు నవ్వుకొనే పరిస్తితి.

నిజంగానే ఆ వచ్చిన వాళ్ళు వేరు, వేరు వాళ్ళు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్లు, బాబాకి చాలా ఆప్తులు కూడానూ.

నిజంగానే నందా దీపం వద్ద ఎన్నో ఏళ్ల  పరిచయం ఉన్న వాళ్ళ లాగా కబుర్లు బాబావి చెప్పుకున్నాము.

బాబా కూడా శ్యామాని, ఖాపర్డే, కాకాని, అందరూ ఒకే వీదిలో ఉండేవాళ్ళు, నా సన్నిదిలో కలిస్తే మీరు ఆనందంగా మాట్లడితే చూస్తున్నా అని అంటారు.

అదే మా విషయములో జరిగింది. అప్పటికే సమయం ఏడు గంటలు అయ్యింది అని నేను బయలుదేరాను. రూమ్ కి వెల్లాగానే మా అమ్మ చెప్పిన మాటలు విని నిర్గాంత పోయా.

రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నువ్వు చాలా చిన్న పాపవు నువ్వు నా దగ్గర పాలు తాగుతూ ఉంటే మీ తాత (బాబా) నిన్ను తీసుకొని వెళ్లి ఒక ఆవిడకి ఇచ్చేసారు అని చెప్పింది.

నాకు ఏమి అర్ధం కాలేదు, బాబా ఏమి చేసిన ఒక అర్ధం, పరమార్దం ఉంటుది.

నా ఈ ప్రయాణం ఎటుపోతుంది అనేది మాత్రం మీకు తెలుసు అని అనుకోని ఫ్రెష్ అయ్యి మళ్ళీ గుడికి వెళ్ళా, రాత్రి మాట్లాడిన ఆవిడ కనిపించారు.

అమ్మా అని సంబోదించి పలకరించా, ఈ షిర్డీ లో నువ్వు నన్ను అమ్మా అని పిలిచావు పైగా రాత్రి నిన్ను మీ తాత నాకు ఇచ్చేసారు .. నువ్వు నాకు బాబా ఇచ్చిన బిడ్డవి అని దగ్గరకు తీసుకున్నారు .

నాకు ఇప్పటికి అమ్మ ప్రేమ పంచుతున్నారు అమ్మ కాని అమ్మ, తరువాత తెలిసిన విషయాలు ఆవిడ గ్రేట్ రైటర్, హిందీ పండిట్, ఆమెకి ఎవరూ లేరు.

నాతో మాట్లాడకుండా ఉండలేరు, నేను అన్నా మా పిల్లలు అన్నా అమ్మకి చాలా ప్రాణం.

బాబా ఎవరిని ఎక్కడకు చేరుస్తారో, ఎవరిని ఎక్కడ కలుపుతారో నిజంగా చిత్రమయా మీ లీలలు .

నా కుటుంబ బాద్యతల వల్ల నేను అమ్మతో ఎక్కువగా సమయం గడపలేకపోతున్నా. కాని అమ్మ ఎప్పటికి నేను మీకు ఉన్నాను. ఇది అసలు బందం.

ఎందుకు అంటే ఇది ఆత్మ సంబంధం, ఈ జన్మది కాదు. ఎప్పటికైనా నిన్నే చేరుకోవాలని మీ పాదాలలో కలిసిపోవాలని ఆకాంక్షతో

ప్రేమతో మీ మనవరాలు.

ఓం సాయి రామ్

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “బాబా ఇచ్చిన ఇటుక (రెండవ భాగం)

INNA VENKATESWARA RAO. MANDAVALLI . KRISHNA DIST

OMSAIRAM

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles