అమ్మ, నాన్నను తెచ్చిన బాబా (రెండవ భాగం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-9-Amma-Nanna-2-by-Lakshmi-Prasanna 5:01

ఓం సాయి రామ్

మాకు అమ్మతో బంధం చెప్పలేనంతగా అల్లుకుపోయింది.

సొంత అమ్మాయిలా, సొంత మనవల్లుగా పెనవేసుకుంది ఆ ప్రేమ.

ప్రశాంతంగా ఉండే అమ్మ నాకు చాలా కబుర్లు చెప్తారు, అన్నీ తాత గారి ముచ్చట్లే. మా బాగోగులు అన్నీ వాళ్ళ నిర్ణయాలే.

పైగా ఇక్కడ (మా ఇంట్లో ) ఏమి జరిగినా అమ్మకి తెలిసిపోతుంది. మొదట్లో గెస్సింగ్ అనుకున్నా. కానీ తరువాత తెలిసింది తాత అమ్మని, నాన్నని మాకు రక్షణగా పంపారు.

ఒకరోజు మా వారు ఆఫీస్ కి బయలుదేరారు. బయటకు వెళ్ళగానే ఎవరో తుమ్మారు. తను వెనక్కి వచ్చారు.

నేను ఊది పెట్టి ఇలా చెప్పా అక్కడ  ఎదో ఉంది. తాత దానిని ఇప్పుడు వెళ్ళగొట్టారు. ఇప్పుడు మీరు బయలుదేరండి, అని చెప్పాను.

తను వెళ్ళారు, ఒక రెండు గంటల తరువాత నాకు కాల్ చేసి నేను బండి మీద నుండి కింద పడ్డాను. కాళ్ళకి కొద్దిగా దెబ్బ తగిలింది వేరే కార్ గుద్దేసింది, అని నాకు చెప్తున్నారు.

ఈలోగా అమ్మ నుండి పక్కన కాల్ వస్తుంది, నేను ఆ కాల్ తీసాను. కానీ ఈ విషయం అమ్మకి తెలిసిపోయింది.

అమ్మకి ఉదయం నుండి ఎదో అలజడిగా ఉంది అనీ , తాతకి ఇలా  చెప్పాను ,  “పిల్ల బాధపడితే నేను ఊరుకోను అని బాబా ని ప్రార్దిస్తూ ఉన్నాను అని అమ్మ చెప్పారు.”

పెద్ద గండం నుండి నేను వాడిని కాపాడాను అని బాబా చెప్పారు.  బాబాతో అభయం తీసుకున్నాక అమ్మకి ప్రశాంతంగా అనిపించింది ,

ఇక అంతా ఆయన చూసుకుంటారు. మీరు అంతా బాగున్నరుకదా అని అడిగారు అమ్మ.

నేను ఇలా చెప్పాను మీరు ఇంతగా మమ్మల్ని ఒక వలయంలో ఉంచి కాపాడుతున్నారు నాకు ఏమి అవ్వదు అమ్మ, మీరు బాధపడవద్దు అని జరిగిన విషయం చెప్పాను.

మా వారు ఇంటికి రాగానే అమ్మతో మాట్లాడితే అమ్మ ఏడ్చేసారూ. నిజంగా మా పిల్లలతో కూడా అంతే ప్రేమ, వాళ్ళు ఇప్పుడు ఏ విషయం చెప్పాలన్నా అమ్మమ్మకే చెప్తారు.

ఇప్పుడు వాళ్ళకి బెంగ లేదు. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళితే పుట్టిన ఇంటి నుండి ఒక ఆడపిల్ల ఎలా వస్తుంది, ఇప్పుడు నేను అంతే.

ఇక్కడ ఇంకో విచిత్రం అమ్మ ఇష్టాలు, నావి అన్నీ ఒకటే. తాత అమ్మని ఒక దేవతగా మార్చారు.

ఇప్పుడు అమ్మ నన్ను గైడేన్స్ చేస్తున్నారు. మా ఇద్దరికీ ఒకే విషయం బోధ చేస్తారు. అదీ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటాము.

మేము కాల్ మాట్లాడేటప్పుడు నీకు ఏమి చెప్పారు తాత, నీకు ఏమి చెప్పారు తాత అంటే ఇద్దరికీ ఒకటే.

ఒకసారి అమ్మ గోదుమ రవ్వ కు పట్టే పురుగు, దానిని ఎలా జాగ్రత్త చేయాలి అని చెప్పారు. నా పిచ్చి కాకుంటే తాత గురించి తప్ప వేరే విషయాలు మాట్లాడని అమ్మ ఇప్పడు ఎందుకు ఇలా మాట్లాడారు అని ఆలోచించలేదు.

గోడుమరవ్వ తీస్తే నిజంగా పురుగు. నాకు తెలిసి ఇది మొదటిసారి. అందుకే అంతగా ఆ విషయం పట్టించుకోలేదు.

ఈ విషయమ ఎందుకు చెప్పాను అంటే అమ్మ, బాబా అంతలా మమ్ము కనిపెట్టుకొని ఉన్నారు. అమ్మ ఏది అంటే అది జరిగి తీరుతుంది. ఎవ్వరితో ఎటువంటి బందాలు ఉండవు అమ్మకి.

ఎందుకు అంటే ఇవి శాశ్వతం కాదు కదా, బాద్యత ఉంటుంది కానీ ఇష్టం పెంచుకోరు.  అలాంటిది నేను, నా పిల్లలు, మా వారు వాళ్ళకి చాలా ప్రియంగా మరిపోయాము.

దీని తరువాత పూర్వ జన్మ సంబంధం అని నన్ను చూసిన తరువాత వాళ్ళకి అంతా గుర్తు వచ్చింది అనీ !  చాలా బంధాలు  తెచ్చారు తాత.

అందరూ తాతకి దగ్గర వాళ్ళే,  నాది ఇప్పడు చాలా పెద్ద కుటుంబం. నా ఏడుపుకి తాత సమాదానం మనుషుల రూపంలో నా చుట్టూ  ఇంత మందిని నా జీవితంలోకి పంపారు తాత .

 అందరి ప్రేమ నా కుటుంబంపై ఉంచారు తాత, ఆయన ఏమైనా చేయగలరు.

ఇది నిజమైన కధ. ఇప్పుడు నా ప్రతి నర, నరం లోను ఆయనను నింపేశారు అమ్మ.

నేను బాబాకి కృతజ్ఞతలు చెప్పడానికి షిర్డీ వెళ్లాను.

సర్వం సాయినాథార్పణమస్తు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “అమ్మ, నాన్నను తెచ్చిన బాబా (రెండవ భాగం)

బాబా వారి ప్రేమ మన మీద ప్రతి క్షణము ఉంటుంది అని చెప్పడానికి ఈ లీల చాలు…
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్‌కీ జై

Hi…Prasanna mam..We are eagerly awaiting some more miracles of your father and mother..which has been done By Baba….
Please publish some more articles about the approach that what they are following to reach the Baba feet…Thank you Sai.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles