Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna
- Mir-8-Amma-Nanna-by-Lakshmi-Prasanna 6:25
ఓం సాయి రామ్
ఇది కల కాదు నిజమైన నిజం.
సాయి భందువులకు నమస్కారం.
నా జీవితంలో నాకు ఊహ తెలిసినప్పటినుండి నాకు తోడుగా ఉన్నది ఒక్కటే . అదే కన్నీరు నాకు నెమ్మదిగా అలవాటు అయ్యిపోయింది .
అన్నీ ఒడిదుడుకులే కానీ ఈసారి మాత్రం మోతాదు మించినది. నాకు అయిన వాళ్ళే శత్రువులు.
మాకు ప్రేమ పంచె బావగారు మాకు దూరం అయ్యారు. రెండు నెలలు తిరగకుండానే మా అత్తగారు వెళ్ళిపోయారు. ఒక్కసారిగా మేము ఒంటరి వాళ్లము అయ్యాము.
మాది పెద్ద కుటుంబం మా వారు లాస్ట్ తనకి అమ్మ, అన్నయ్యతోనే చనువు ఎవరితో ఎక్కువ మాటలు ఉండేవికావు.
ఎందుకు అంటే ప్రేమ ఉన్నచోటికే కదా మనం వెళ్తాము. వారు దూరం అయ్యాక మాకు ఎవరూ లేరు, పైగా అన్ని వైపులా నుండి అనేక మాటలు, మనసు విప్పి మాట్లాడుకొనే మనిషి కోసం, ప్రేమ కోసం తపించాము.
చివరకు నన్ను కన్నతల్లి కూడా తేడగానే చూసింది. మా పిల్లలు కూడా ఒంటరి .
అమ్మా పెద్దనాన్న లేరు మనకు ఎవరు phone చేయరా, మనతో ఎవరూ మాట్లాడరా అని అడిగే వాళ్ళు నేను ఏమి చెప్పను.
అందరూ ఉన్న అనాధలు అయ్యాము. ఒక్కోసారి అందరమూ ఏదైనా తాగి ఈలోకం నుండి వెళ్ళిపోదామా అనే ఆలోచనలు కూడా వచ్చాయి.
ఇదే తరుణంలో ఒక రోజు బాగా ఏడ్చేసాను. ఎంతగా అంటే ఊపిరి కూడా ఆడలేదు, B.P కూడా తగ్గింది. నాకు కన్నీటితో కళ్ళు కూడా సరిగా కనపడలేదు కాని నేను ఒక దృశ్యం చూసాను.
ఒక కాషాయం కలర్ బట్టలు వేసుకున్న ఒక పెద్ద మనిషి ఒక ముని లాగా అనిపించారు. అతను ధ్యానం లో ఉన్నారు.
నా పిల్ల ఇంతగా ఏడుస్తుంటే నాకు ఎందుకు ఈ మహిమలు అన్నీ,! అని ఒక్కసారిగా లేచారు. ఇది అంతా కల కాదు నేను మేలుకొని ఉన్న సమయం.
ఎవరు ఆ కనపడింది, తాతకి తప్ప నేను ఎవరికీ వద్దు కదా, అనుకున్నా.
ఆ తరువాత ఒక నాలుగురోజులకు ఒక తెలిసిన అతను కాల్ చేసారు. తణుకు దగ్గర వేల్పూర్ అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక మహర్షి ఉన్నారు. అతను ధ్యానం తప్ప వేరే ఏది లేదు, రమణ మహర్షి శిష్యులు అక్కడికి రండి అన్నారు.
అసలే మనసులు బాగాలేవు సరే వెళ్దాము అని వెళ్ళాము చాలా హడావుడి గా వెళ్ళాము. రాత్రి అంతా కూర్చుని ప్రయాణం ఎప్పుడు పిల్లలని తీసుకొని అలా వెళ్ళలేదు . చివరకు వెళ్ళాము.
అందరి మహనీయుల దర్శనాలు బాబానే చేయిస్తారు, బాబానే అక్కడ ఇప్పుడు ఇలా ఉన్నారు.
నేను బాబాని చూడాలి అని వెళ్ళాను. వెళ్ళిన ఒక గంటకు కూడా నాకు ఆ మహనీయుని దర్శనం కాలేదు. ( ఆ ఆశ్రమం లోపలికి కూడా నాకు స్వాగతం పలికింది దత్తులవారే.) ఇది ఒక చిత్రం .
నేను ఆ మహనీయుని వెదుకుతూ ఒక గోశాల వద్ద నించున్నా హఠాత్తుగా నన్ను పలకరించింది ఒక గొంతు తిరిగి చూసాను.
ఆ రూపం చంద్రబింబం , పెద్ద బొట్టు, మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే రూపం, నాతొ మాట కలిపారు అమ్మ. నాతొ ఎన్నో జన్మల బంధం ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు.
కొద్దిసేపటికి మా పిల్లలని కూడా చాలా ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు.
మా రూమ్ ఎదురుగా కొద్ది దూరములో అమ్మ రూమ్ ఉంది. మా పిల్లలు ఏమైనా కనిపిస్తారేమో అని చూస్తూ ఉన్నాను అని అమ్మ చెప్పారు.
మేము ఉన్న ఒకరోజు మాతోనే ఉన్నారు. అన్నీ జాగ్రత్తలు చెప్పారు. ఇంకా మేము హైదరాబాద్ బయలుదేరుతూ ఉంటే మమ్మల్ని వదలలేక చాలా బాధపడుతున్నారు.
అమ్మా మీరు ఎవరు? ఎందుకు ఇంతలా ప్రేమ అని అడిగాను.
దానికి అమ్మ సమాధానం నేను ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నా, బాబా అక్కడ నిలబడి ఉన్నారు. ఇది ఏమి స్వామి ఇక్కడ ఉన్నారు, అని నేను దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ నువ్వు ఉన్నావు, స్వామి లేరు. నిన్ను చూడగానే నాకు ఆశ్చర్యం కలిగింది.
ఇది ఏ జన్మ భందమో, ఆయన సన్నిదిలో ఇలాంటి అనుబవం ఆయన నిజంగానే మనసేరిగిన మహనీయులు నాకు ఇలాంటి భందం ఇవ్వడానికే తాత నన్ను అక్కడకు హడావుడిగా పంపారు.
అమ్మ ” ది గ్రేట్ సింగర్ & రైటర్ ” , అంతకు మించి తాతకు తల్లి .
తాత గురించి ఎన్నో పాటలు రాసారు. సరస్వతి పుత్రిక. అమ్మ వయసు 59, అయిన పసిపిల్లా అన్నట్టుగా ఉంటారు అమ్మ.
ఆ అది దంపతులు ఇద్దరూ మాకోసం ఆ వేల్పూర్ వచ్చినట్టుగా ఉంది.
ఎందుకు అంటే అమ్మ ఎక్కడకు వెళ్ళరు. ఎప్పుడు ధ్యానం. అమ్మ ఎంత గొప్పవారు అంటే తాత శరీరంతో అమ్మ ఇంట్లో 4 నెలలు ఒక 11 ఏళ్ల పిల్లావాడిగా అమ్మ చుట్టూ, అమ్మ కొంగు పట్టుకొని, నువ్వు దేవకీ అమ్మవి, నేను నీ కృష్ణుడు అని తిరిగారు. అంత గొప్ప భక్తురాలు.
అమ్మ అనుమతితో తాత గురించిన అన్ని విషయాలు మీతో పంచుకుంటాను. అంత మహాత్మురాలు చాలా నిరాడంబరంగా ఉంటారు.
అమ్మని చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి అనిపిస్తుంది.
ఎంత ఎదిగినా ఇలా ఉండాలా అని మనకు నేర్పిస్తారు అమ్మ .
అటువంటి గొప్ప దంపతులు మాకు ఈరోజు తల్లిదండ్రులు అయ్యారు.
నేను మొదట అమ్మ ఇంటికి వెళ్ళిన విషయాలు అన్నీ చెప్తాను.
ఓం సాయి రామ్.
Latest Miracles:
- అమ్మా, నాన్నను తెచ్చిన బాబా (చివరి భాగం)
- అమ్మ, నాన్నను తెచ్చిన బాబా (రెండవ భాగం)
- ఇష్టమైన ఆహారాన్ని ప్రసాదంగా ఇచ్చిన బాబా ….!
- భవ్యష్యత్తుని ముందుగానే సూచించిన బాబా.
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “అమ్మా, నాన్నను తెచ్చిన బాబా.–Audio”
kishore Babu
August 6, 2018 at 2:31 pmమీ లీలలు ద్వారా స్వచ్ఛమైన భక్తి ఎలా ఉంటదో…తెలుసుకో కలుగుతున్నాము…సాయి.