దిల్ సుఖ్ నగర్ కోణార్క్ థియేటర్ దగ్గర జరిగిన బాంబ్ పేలుడు నుండి కాపాడిన బాబా వారు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-7-Bomb-by-Lakshmi-Prasanna 3:32

2013 ఇయర్ లో మా పెద్ద అమ్మాయి కి పెళ్లి అయింది. మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకి చాలా మంది వస్తారు.

రెండు రోజులు తంతు ఉంటుంది, చాలా కార్యక్రమాలు ఉంటాయి. అందుకని ఎంత పని చేసినా కూడా ఇంకా పని వుంటూనేవుంటుంది.

మా వంట పనులంతా చేయాడానికి ఒక వంటయనను మా బావమరిది మాట్లాడాడు. అనుకున్న దానికంటే పెళ్ళికి జనం ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ వంట చేయవలసి వచ్చింది,

అందుకు మరింత డబ్బు వంట వాళ్ళు డిమాండ్ చేసారు. మా బావమరిది సరేలే పెళ్లి అయిన తరువాత ఇస్తాను, ముందు పని కానీయండి అన్నాడు.

పెళ్లి అయిన తరువాత డబ్బులు ఇమ్మన్నాడుట వంటవాడు. ఇలాకాదు మా అక్కయ్య బావల ఎదుటే ఇస్తాను, నువ్వు అక్కడికి రా అన్నాడుట.

ఒక గంట తరువాత మా బావమరిది మా ఇంటికి వచ్చి, వంట వాడిని డబ్బులు తీసుకోవటం కోసం ఇక్కడికి రమ్మనాను అని చెప్పాడు.

ఇంతలో ఆ వంటవాడి దగ్గరి నుండి మా బావమరిదికి ఫోన్ వచ్చింది. ‘నేను రాను, నువ్వు ఎక్కడో ఉంటె నేను అక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వడం ఏమిటి? నువ్వు ఇక్కడికి రా” అని గట్టిగా అరుస్తున్నాడు మా బావమరిది.

ఇంతకీ ఎక్కడ ఉన్నావు అన్నాడు. ‘నువ్వు కొంచెం ముందుకురా నేను వస్తున్నాను ఇద్దరం ఇక్కడికి వద్దాం’ అని వాడు కోణార్క్ ధియేటర్ దగ్గర ఉన్నాడట ఉండండి వాణ్ని తీసుకొని వస్తాను అంటూ మా బావమరిది బయటికి వెళ్ళాడు.

ఆ వంట అతను కోణార్క్ థియేటర్ నుండి ముందుకు వచ్చాడు. ఇద్దరు కలిసి ఒకచోట తీ తాగారు, తిరిగి మా ఇంటికి వచ్చారు.

ఇద్దరూ మా గుమ్మంలో అడుగు పెడుతుండగానే పెద్దగా శబ్దాలు వినిపించాయి, ఏమైందో ఏమో అనుకున్నాము. యింతలో ఎవరో వచ్చి కోణార్క్ థియేటర్ దగ్గర బాంబ్ పేలిందని అన్నారు.

ఆ మాటలు వినంగానే మా వంటయన దిమ్మెరపోయాడు, మేము షాక్ తిన్నాము, ఎందుకంటే ఆ వంట అతనిని మా బావమరిది బలవంతంతోటే ఆ కోణార్క్ థియేటర్ నుండి బయటికి తెచ్చాడు.

మా బావమరిది అతన్ని అక్కడనుండి రమ్మనక పోయినా, ఆ వంట అతనికి డబ్బులు అక్కడే ఇచ్చేస్తే సరిపోతుందని అక్కడే ఇచ్చేసినా ఆ వంట అతనితో పాటు మా భావమరిదికి కూడా ప్రమాదం వాటిల్లేది.

ఆ బాంబ్ సంఘటనలో అనేక మంది దుర్మరణం పొందారు, మరికొందరు వికలాంగులుగా మారిపోయారు.

మా ఇంట పెళ్లి అయిన వెంటనే ఇలాంటి ఆపదనుండి బాబా మమ్మల్ని కాపాడారు అని అనుకున్నాము.

ఆ వంటాయన కూడా నన్ను ఏదో శక్తి కాపాడిందయ్యా ! అటుంటాడు. ఇంకెవరూ ఆ శక్తి బాబాయే ఆ మహాశక్తి .

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles