దిల్ సుఖ్ నగర్ బాబా గుడి విగ్రహ ప్రతిష్ట కు ఉన్న అడ్డంకులను తొలగించిన బాబా వారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


తర్వాత విగ్రహ ప్రతిష్ట కోసం విగ్రహం రాజస్థాన్ లో ఆర్డర్ చేసాము. గుడి అయితే పూర్తి అయింది కానీ విగ్రహ ప్రతిష్ట కు నాలుగు లక్షలు అవుతుందని అంచనా వేశారు. డబ్బులు లేవు. ఇచ్చే దాతలు అందరు అయిపోయారు.

మాకు ఎవరిని అడగాలో తెలియలేదు. ఆ సమయం లో ద్వారకా బదరికాశ్రమం, విద్యా నారాయణ తీర్థ స్వామీ వారు వేరే పని కోసం హయత్ నగర్లో ఎవరింటికో వచ్చారు.

ఆ సమయం లో ఆయన పూజ లో కూర్చుంటే, ఆయనకు ”Dilshukhnagar లో గుడి కట్టారు కానీ ప్రతిష్ట జరుగలేదు” అంటూ ఆయన చెవిలో వినిపించడం మొదలైనది అట.

ఆయన శిష్యులని దిల్ సుఖ్ నగర్ పంపించి, మా వాళ్ళని తీసుకు రమ్మన్నారు. మేము కొంతమంది పెద్ద మనుషులని తీసుకుని వెళ్ళాము.

ఆయన మమ్మల్ని చూస్తూనే విగ్రహ ప్రతిష్ట జరుగలేదు కదా! అందుకు బాబా డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 23 ఉదయం 5 .30 కి చేయమంటున్నారు. అన్నీ ఆయనే చూసుకుంటారు. మీ పనులన్నీ నిరాఘాటంగా జరుగుతాయి, అని చెప్పారు.

అది మే నెల. మా దగ్గర పది వేలు వేసే శక్తి కూడా లేదు అని అంటూ మేము చెప్పాము ఆ స్వామిజి కూడా మాతో వచ్చిన పెద్ద మనుషులకి ఒక్కొక్కళ్లకి, ఒక మామిడి పండు , ఒక పది రూపాయల నోటు ఇచ్చారు .

”ఈ డబ్బులు మీరు ముందుగా ఎవరికీ పేమెంట్ ఇస్తారో వాళ్లకి ఈ డబ్బులు కూడా కలిపి ఇవ్వండి” అన్నారు.

అక్కడ నుంచి గుడికి రాగానే, పోస్టర్స్ 1000  వేయించి, అన్ని బస్సులకు అంటించాము . ఫ్లెక్సీలు వేయించి కొన్ని సెంటర్లో కట్టాము. కొంచము  డబ్బులు వచ్చాయి .

ఆ డబ్బులు ప్రెస్ వాళ్లకి ఇచ్చి కరపత్రాలు వేయించాము. తర్వాత బేనరు కట్టాము. అన్నదానం జరుగుతుండేది .

గ్వాలియర్ నుండి ఎవరో దాతలు విగ్రహం పంపిస్తామన్నారు. లక్ష యాబయివేలు విగ్రహం కోసం ఒకాయన హైదరాబాద్ లోనే ఇవ్వడానికి ఒప్పుకున్నాడు .

అలా అలా రైస్ మిల్లుల వాళ్ళు రైస్ పంపడం పప్పులు, ఉప్పులూ, చింతపండు అన్ని డొనేషన్లు వచ్చాయి .

జైపూర్ నుంచి విగ్రహం తేవడానికి  కొంతమంది ఖాళీ లారీతో వెళ్లి  అక్కడ నుండి విగ్రహాన్ని 75  వేలకు పట్టుకుని వచ్చారు.

షిరిడి వచ్చి పూజ చేయించుకొని, ధుని కూడ అక్కడ ద్వారకామయి  నుండి తీసుకోని వచ్చారు.

తెలుగు రాష్ట్రం లో మొదటి విగ్రహం కావడంపై దాని రేటు అక్కడ తగ్గించారు. అలా ఆ స్వామిజి ద్వారా బాబా నిర్ణయించిన ముహూర్తం కి  అంగ రంగ వైభవంగా బాబా విగ్రహ ప్రతిష్ట జరిగింది.

The above text has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles