పాలరాతి విగ్రహం కావాలనుకుంటే, పంచలోహ విగ్రహం గా ఇంటికి వచ్చిన బాబా …!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా పాలరాతి విగ్రహం అక్కడ కొనుక్కొని తీసుకురావాలని అనుకున్నాను. ఈ లోపున మా ఇంటి దగ్గర ఒకళ్ళింట్లో పంచలోహాలతో చేసిన బాబా విగ్రహం ఉంది.

ఏ కారణాల చేతనో వాళ్ళు పూజ చేయడం లేదు. అందుకని వారు ఈ విగ్రహం ఇంట్లో ఉండే కంటే గుడిలో ఇచ్చేస్తే గుడిలో పూజారులు పూజ నైవేద్యం చేస్తారనిపించి ఆ విగ్రహాన్ని సంచిలో (ఒక అడుగు ఎత్తు ఉంటుందది) పెట్టుకుని గుడికి తీసుకువచ్చారు.

అదే సమయానికి నేను, రాజన్న బాబా గుడికి వెళ్ళాము. ఆ సంచి చూసి ”ఏమిటి” అని అడిగాము.

అతను ”ఇది పంచలోహాలతో చేసిన బాబా విగ్రహం, మా ఇంట్లో పూజ నైవేద్యం కుదరడం లేదు. అందుకని గుడిలో ఇచ్చేద్దామని తెచ్చాము” అన్నాడు .

”ఇది పంచలోహ విగ్రహం కదా, గుడిలో మాత్రం పూజారులు ఏం పూజ చేస్తారు” అని చెప్పాడు రాజన్న.

మరి ఎలా అన్నాడతడు. “శ్రీకాంత్ నువ్వు తీసుకోరా” అన్నాడు రాజన్న

”నాకు ఇస్తారా” అన్నాను చేతులు చాపుతూ. అంతే! ఆతను ఆ బాబా విగ్రహం సంచి లోంచి బయటికి తీసి నా చేతిలో పెట్టాడు.

చాలా బరువుగా ఉందా విగ్రహం. సంతోషంతో అది తీసుకుని ఇంటికి వచ్చి, ”అమ్మా బాబా వచ్చారు” అని చెప్పాను.

అమ్మ కూడా సంతోషంగా పరుగున వచ్చి చేయి చాపింది, నేనా విగ్రహాన్ని అమ్మ చేతిలో పెట్టాను.

”ఆమ్మో! ఇంత బరువుగా ఉందేమిట్రా” అంది. ”అమ్మా! ఇది పంచలోహ విగ్రహం ఎవరో గుడిలో ఇచ్చేద్దామనుకుంటే నేను అడ్డగించి ఇంటికి తీసుకువచ్చా” అన్నాను.

మామూలు పాలరాతి విగ్రహం కొనాలనుకున్న మాకు తానే పంచలోహాలతో వచ్చాడు.

అమ్మ అప్పటినుండి ఆ విగ్రహానికి అభిషేకం, పూజ, నైవేద్యం పెడుతోంది.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles