Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం శ్రీ సాయినాథాయ నమః
బాబాతో నా పరిచయం
నాకు పదకొండు సం II ల వయస్సు ఉన్నప్పుడు నేను మొదటిసారిగా బాబా గుడికి వెళ్ళాను. అలా తీరిక దొరికినప్పుడు బాబా గుడికి వెళ్ళేదాన్ని.
తెలిసినవాళ్ళు వాళ్ళ ఇంటికి రమ్మని పదే పదే ఆహ్వానించేవాళ్ళు. ఇంక ఒక రోజు వాళ్ళ మాటని కాదనలేక వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
వాళ్ళ ఇంటిలో పూజామందిరంలో బాబా పాదుకాలు, విగ్రహము చూశాను. చూడగానే గుడిలో ఉన్న అనుభవం కలిగింది.
5 సం II క్రిందట మొదటిసారిగా నేను షిరిడీకి వెళ్ళాను. అక్కడ నుంచి బాబా విగ్రహం, పాదుకాలు తెచ్చుకున్నాను, అవి చూడగానే నా మనసు సంతోషముతో ఉప్పొంగిపోయాను.
తిరుగు ప్రయాణంలో బాబా విగ్రహం, బాబా పాదుకాలు మనసులో ఊహించుకుంటూ పూజ చేసుకున్నట్టు సంతోషంగా మా ఊరికి క్షేమంగా చేరుకున్నాను.
బాబాతో నా అనుభవాలు:
నాకు ఒక సమస్య ఉండేది. పూజారిగారికి చెప్పాను. పూజారి గురువారం నుండి ఒక పూజ మొదలుపెట్టుకోమని చెప్పారు.
ఆ పూజ యాభై నాలుగు రోజులు చెయ్యమన్నారు. పదకొండు పిండి దీపాలు పెట్టి 108 నామాలతో బాబా పూజ చెయ్యమన్నారు.
నైవేద్యం పండు గాని, పాలు గాని, బిస్కెట్లు అలా ఏమైనా పెట్టామన్నారు. అలా కొన్ని రోజులు పెట్టాను.
సాయంత్రం పూట బాబా హారతి, చాలీసా, సచ్చరిత్రము చేసేదాన్ని. ఇవన్నీ చదవడం వలన, బాబాకి అన్నదానము ఇష్టమని తెలుసుకోగలిగినాను.
నిత్యము నేను పూజ అవగానే అన్నదానము చేసేదాన్ని. నేను కరివేపాకు అన్నము చేసి ఒకరోజు బాబాకు నైవేద్యం పెట్టాను.
పూజ అయిపోయిన తరువాత నేను కొద్దిగా స్వీకరించాను ప్రసాదం చాలా కారంగా ఉంది ఉప్పు వేశాను. అనుకున్న దాని కంటే చాలా సప్పగా ఉంది.
బాబా మీద భారం వేసి బాబా ఊదీ ప్రసాదంలో కలిపి ఒక కోచింగ్ సెంటర్ లో ఇచ్చాను.
ఈ ప్రసాదం స్వీకరించి చాలా బాగుంది, అద్భుతంగా ఉందని, ఇలాంటి నైవేద్యం ఎక్కడా స్వీకరించలేదు అని కూడా వాళ్ళు చెప్పారు.
సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణ మస్తు.
Latest Miracles:
- నా కోరికను తీర్చిన బాబా.
- విభూది మహిమ
- నీలం బి.సంగ్లీకర్ – పూనా వారు వ్రాసిన ఊదీ మహిమ (1983)
- గురు చరిత్ర మహిమ
- బాబా ఊదీ మహిమతో ఇంట్లో ఉన్న దృష్ట శక్తులు మాయమగుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments