Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఈ రోజు మనము ఊదీ మహిమ గురించి తెలుసుకుందాము. ఈ లీల సాయి లీల మాసపత్రికలో నీలం.బీ.సంగ్లికర్, పూనా వారు వ్రాసినది. ఈలీల చదివితే బాబాగారిలో యెంత మహాత్మ్యం ఉందొ ఆయన ఊదీలో కూడా అంతే మహిమ ఉంటుందని మనకు అర్థమవుతుంది.
ఆ రోజు జూలై, 5 తా. 1983, మంగళవారం, మథ్యరాత్రిలో మంచం మీద పడుకుని గట్టిగా ఆవలించాను. హటాత్తుగా నా దవడ వద్దనున్న జాయింట్స్ బిగుసుకుపోయి నోరు మూత పడలేదు. నా నోరు ఒక అంగుళం మేర అలా తెరుచుకునే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం రెండు సార్లు నాకు ఇలా జరిగింది. వెంటనే నేను మంచం మీద నుంచి లేచి దవడకి మెల్లిగా అయొడెక్స్ రాయడం మొదలుపెట్టాను. కాని యేమీ ఫలితం కనిపించలేదు. నేను నా గదిలో ఒంటరిగా ఉండడంతో నాకు చాలా అందోళన కలిగింది, యెందుకంటే నా రూం మేట్ ఆరోజు రాత్రి అనుకోకుందా యెక్కడికో వెళ్ళింది. నేను మాట్లాడే పరిస్తితిలో లేను, అప్పటికే రాత్రి ఒంటిగంట అయింది, అందుచేత మిగతా రూం లో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడము యెందుకనుకున్నాను. చాలా నిస్సహాయ స్థితిలోఉన్న నాకు శ్రీ బాబా గారిని పిలవడం తప్ప, వేరెవరి సహాయము లేదని తెలుసుకున్నాను. అయొడెక్స్ పనిచేయకపోయేటప్పటికి, బాబా ఊదీ ని తీసుకుని కొంచెం కొంచెం గా నోటిలో వేసుకుంటూ, యెడమ దవడ మీద కూడా మెల్లగా రాయడం మొదలుపెట్టాను. అదే సమయంలో నా హృదయాంతరాళలోనుంచి సాయి నాథ్ ని స్మరించడానికి ప్రయత్నించాను, కాని నత్తి గా ఉండి శబ్దం కూడా బయటికి రాలేదు. మెల్లిగా ఫలితం కనపడడం మొదలు పెట్టింది. నా పెదిమలని కొద్దిగా దగ్గరికి చేర్చగలిగాను, కాని దవడ వద్దనున్న జాయింట్స్ బిగుసుకునే ఉండడంతో నోరు తెరవలేకపోయాను. నా భయానికి ఇంక అంతులేదు.
అదే నిజమైన ఊదీ మహిమ: పడుకునే ముందు నోటిలో కొంచెం ఊదీ వేసుకున్నాను. (ఇది నేను సాథారణంగా చేయను, నేనెప్పుడైనా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు, యేదయినా పనిమీద బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఊదీ ని వేసుకుంటాను.) ఆ రోజు నేను చాలా తీవ్రమైన వేదనని అనుభవించి సుఖమైన నిద్రకి దూరమయ్యాను. అణచిపెట్టుకున్న నా బాథని దిగమింగడానికి గట్టిగా యేడవాల్సొచింది. ఈ సంఘటన జరిగిన వెంటనే నేను ఊదీ వేసుకున్నాను. రెండు గంటలపాటు చాల బాథపడుతూ యేడిచి అలసిపోయాను. బాబా ముందు దీపం వెలిగించిన తరువాత గాఢ నిద్ర పోయి, మరునాడు ప్రొద్దున్న మామూలు సమయానికే నిద్ర లేచాను. రాత్రి అంత నరకం అనుభవించాక పొద్దున్న చాలా సంతోషంగా లేచాను. ఈ సాయి లీల పత్రిక ద్వారా ఇంతమంది సాయి బంథువులందరితోనూ నా అనుభవాన్ని పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా నైవేద్యంలో ఊదీ మహిమ.
- పవిత్రమైన బాబా ఊదీ – నయం కానివాటిని కూడా నివారిస్తుంది (1983)
- గురు చరిత్ర మహిమ
- ఊదీ లీల – తగ్గిన కడుపు నొప్పి
- గురుపౌర్ణమి రోజు భక్తురాలి ఇంటికి వెళ్లిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments