Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘‘ఆ జన్మలో పాలిచ్చి నన్ను పెంచినందుకు ఈ జన్మలో నీ కొడుకు తాత్యాని కంటికి రెప్పలా కాపాడుతాను. ప్రమాణం చేస్తున్నాను.’’ ఒట్టు పెడుతున్నట్టుగా గురుస్థానం మీద చేయి ఉంచారు.‘‘అల్లా మాలిక్’’ అని కళ్ళు మూసుకున్నారు.
ఆనందంగా తాత్యాని చేరబిలిచింది బయిజా. తాత్యాకే కాదు, బాబాకి కూడా తను తల్లి. తల్లిగా తను ప్రవర్తించాలి. బిడ్డల ఆకలి తీర్చి తను తినాలి. తల్లిగా అది తన బాధ్యత. ఇక మీదట బాబాకి భిక్షపెట్టకుండా తాను తినేది లేదనుకుంది బయిజాబాయి. గట్టి నిర్ణయం తీసుకున్నట్టుగా దీర్ఘంగా నిట్టూర్చింది.
ఎవరిని పడితే వారిని భిక్ష అడిగేవారు కారు బాబా. ఎంపిక చేసినట్టుగా ఓ అయిదుగురిని అడిగేవారంతే! వారిలో బయిజాబాయి మొదటిది.
భిక్ష పట్టుకుని, బాబా కోసం ఎదురు చూసేది బయిజా. బాబా వస్తే భిక్ష పెట్టి, అతని ముందు చేతులు జోడించి కూర్చునేది.
భక్తురాలితో భగవంతుడు మాట్లాడినట్టుగా బాబా ఆమెతో కాస్సేపు మాట్లాడి, అక్కడి నుంచి కదిలేవారు. అయిదంటే అయిదిళ్ళలో భిక్ష పూర్తి కాగానే వేపచెట్టు దగ్గరకి చేరేవారు. తెచ్చిన భిక్షను అల్లాకి నైవేద్యం చేసేవారు.
నైవేద్యం చేసిన తర్వాతే భిక్షను తాను ముట్టేవారు బాబా. ఆ భిక్షలో తను ఏ మేరకు తినాలో అంతే తినేవారు. మిగిలింది భిక్షాపాత్రలో వదిలి, ప్రేమగా కుక్కల్నీ, పిల్లుల్నీ, పక్షుల్నీ పిలిచేవారు. ఈగల్ని కూడా కేకేసి పిల్చేవారు. అవన్నీ వచ్చి భిక్ష స్వీకరిస్తే ఆనందంగా చూసేవారు. ‘అల్లా మాలిక్’ అంటూ ఆకాశం కేసి చూసి, చేతులు జోడించేవారు.
తాత్యా అంటే బాబాకి ఇష్టం. వాడి మాటా ఆటా పొంగిపోయి చూస్తుండేవారు.
తెలిసీ తెలియని వయసు తాత్యాది. ఆ వయసుకి తగినట్టుగానే బాబాని హింసించేవాడు తాత్యా. తోటి పిల్లలతో కలసి, అక్కడా ఇక్కడా దాగుని బాబా మీదికి రాళ్ళు రువ్వేవాడు.‘‘తప్పు. వద్దు’’ అని మహల్సాపతి వారించినా పిల్లలు వినిపించుకునేవారు కాదు.
వాళ్ళ మీద కోపగించుకుంటే బాబా ఒప్పుకునేవారు కాదు.‘‘వాళ్ళు పిల్లలు. అలాగే ఉంటారు. పిల్లలు పిల్లల్లా ఉంటేనే ఆనందం. పెద్దల్లా ఉంటే ఏం బాగుంటుంది. ఆడుకోనీ. వాళ్ళు విసురుతున్నది నువ్వు రాళ్ళనుకుంటున్నావు. కావు, పువ్వులవి.’’ అని నవ్వేవారు బాబా. రాళ్ళను పువ్వులను అదిమినంత మెత్తగా అదిమి చూపించేవారు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333, సాయి సురేష్ 8096343992
Latest Miracles:
- పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు (3వ. భాగం)
- పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు (1వ. భాగం)
- పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (2వ. భాగం)
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – ధనము (2వ. భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments