నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (2వ. భాగం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై

 

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

తల వంచుకుని, చేతిని ఆనుకుని ఉంది పాము. దాని తల మీద ఎడమ చేత్తో చిన్నగా తట్టారు బాబా. వెంటనే పడగ విప్పింది పాము. బుసలు కొట్టింది.‘నీ విషం నువ్వు తీసుకో! ఊఁ’’ మందలించారు దాన్ని.

పిల్లాణ్ణి ఎక్కడ కాటేసిందో అక్కడ పాముని ఆన్చారు. నాలికలు జాచింది పాము. కాటేసిన చోట నాకింది. విషాన్ని వెనక్కి తీసుకున్నదేమో! చల్లగా ఉన్నదేమో! కాటేసిన చోట పిల్లాడు తడిమి చూసుకున్నాడు. నవ్వుతూ లేచి నిల్చున్నాడు.

‘‘అయిందేదో అయిపోయింది. మళ్ళీ ఎవరినయినా కాటేశావో ఈసారి క్షమించేది లేదు.’’ అన్నారు బాబా. ‘సరే’నన్నట్టుగా తలూపింది పాము.‘‘పద’’ అన్నారు బాబా. చిట్టడవిలోకి ప్రవేశించారు. పాముని వదిలేశారక్కడ.‘‘పో’’ అన్నారు. పాము పరుగుదీసింది. నవ్వారు బాబా.‘‘అల్లరిపిల్ల’’ అన్నారు.

కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు ఎవరూ ఊహించని విధంగా షిరిడీని వర్షం ముంచెత్తింది. మర్నాటికి తగ్గుతుందని అనుకున్నారంతా. లేదు. మర్నాడు, ఆ మర్నాడు అలా వారం రోజులు పాటు వర్షం కురుస్తూనే ఉంది. ముసురు పట్టింది. బయట అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు.

మహల్సాపతికి, శ్యామాకి బాబా గురించి దిగులు పట్టుకుంది. వేపచెట్టు కింద బాబా ఎలా ఉన్నారో? ఏమయిపోయారో?ముసురు తగ్గింది. సన్నగా చినుకులు పడుతున్నాయి. బాబా కోసం మహల్సాపతి, శ్యామా వేపచెట్టు దగ్గరకి బయల్దేరారు. ఊరంతటా వరద ముంచెత్తుతోంది.

 నీటిలో నడవడం కష్టంగా ఉంది. మోకాలి లోతు నీటిలో నడిచి నడిచి అతి కష్టమ్మీద బాబాని సమీపించారు. చూస్తే బాబా అదేదీ పట్టించుకోనట్టుగా ధ్యానంలో ఉన్నారు. నిండుగా తడిసిపోయి ఉన్నారు. ఆయన్ని ఒరుసుకుంటూ నీరు ప్రవహిస్తోంది.‘‘బాబా’’ పిలిచాడు మహల్సాపతి. కళ్ళిప్పి చూశారు బాబా.

‘‘ఈ వర్షంలో ఈ చెట్టు కింద ఎలా ఉన్నారు బాబా?’’‘‘అలాగే ఉన్నాను. మీరంతా క్షేమంగా ఉండాలనీ, ఈ ముసురు తగ్గిపోవాలనీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.’’ అన్నారు బాబా.‘‘అల్లా మాలిక్‌’’ అంటూ ఆకాశం కేసి చూశారు.

అప్పటికే అనేక మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. అందరికీ బాబాని గురించిన ఆందోళనే!‘‘ఇక ఈ చెట్టు కింద మీరు ఉండవద్దు బాబా, పదండి, అదిగో అక్కడ మసీదులో ఉందురుగాని. పదండి.’’ అన్నాడు మహల్సాపతి.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles