Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘‘అవును, మీరు మసీదులో ఉండడమే మంచిది.’’ భక్తులంతా ముక్తకంఠంతో చెప్పారు.
‘‘అక్కడ నేనుండడం ఎవరికీ ఇబ్బంది కాదు కదా?’’ అడిగారు బాబా.
‘‘ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కాదు. మసీదులో ఎవరూ ఉండడం లేదు. ఖాళీ. పైగా మీకు అది అనుకూలంగా ఉంటుంది. మా మాట కాదనకండి. పదండి.’’ అన్నాడు శ్యామా.
‘సరే’నన్నట్టుగా సన్నగా నవ్వుతూ లేచి, మసీదుకేసి నడిచారు బాబా.అయన్ని అనుసరించారంతా.
రెండు గదుల మసీదు అది. ముంగిట బోసిగా ఉంది. బోసితనం పోవాలి. ఏం చెయ్యాలి? బాగా ఆలోచించారు
బాబా. ఒకరోజు అక్కడ తులసికోట స్థాపించారు. తానే స్వయంగా తులసి మొక్కను కోటలో నాటారు. రోజూ క్రమం తప్పకుండా కోటలో నీరు పోసేవారు.
అలాగే చీకటి పడితే చాలు, మసీదు గోడల మీద దీపాలు వెలిగించేవారు. అటు తులసికోట, ఇటు దీపాలు చూడముచ్చటనిపించేది మసీదు. ఇదంతా చూసి ‘బాబా హిందువు’ అన్నారు కొందరు. మసీదులో నివాసం తప్పేమో అన్నారు.
అయితే బాబా ఎల్లప్పుడూ కఫనీ ధరించి ఉండేవారు. పాగాలా తలకి గుడ్డ చుట్టుకుని ఉండేవారు.‘అల్లా మాలిక్’ అని స్మరించేవారు. ఇవన్నీ ముస్లిం వేష భాషలు. బాబా ముస్లిం. ముస్లిం మసీదులో ఉండడంలో తప్పు లేదన్నారు కొందరు.
ముస్లిం అయిన పక్షంలో బాబా ‘నమాజ్’ చెయ్యాలి. ఎన్నడూ చేసి ఎరుగరు బాబా.
కాని ముస్లిం భక్తులు నైవేద్యాన్ని సమర్పిస్తే దానిని మాత్రం వారి సంప్రదాయం ప్రకారం ‘ఫాతిహా’ చదివించి, అల్లాకి నివేదించేవారు.
ఇంతకీ బాబా ముస్లిమా? హిందువా? శ్యామాకి ఈ అనుమానం తీరేది కాదు.
బాబా కులం ఏమిటో తెలీదు. మతం ఏమిటో తెలీదు. ఆయన తల్లిదండ్రులెవరో తెలీదు. ఎవరో ఏమిటో తెలీదు. పిచ్చి వాగుడూ ఆయనా…మానవాతీతుడు కాదు. దేవుడు అంతకంటే కాదు. అలాంటి వ్యక్తిని ఆరాధించడం, ఆయనడిగితే ఏది పడితే అది ఇవ్వడం కొందరికి నచ్చలేదు.
ముఖ్యంగా షిరిడిలోని నూనె వ్యాపారులకి బాబా అంటే ఎందుకో ఒక్కసారిగా చులకన భావం కలిగింది.
సాయంత్రం పూట మసీదులో దీపాలు వెలిగించేందుకు బాబా అడిగితే అంత వరకూ నూనెను ఇస్తూ వచ్చిన వ్యాపారులు, ఆ రోజు బాబా అడిగితే నూనె ఇవ్వకూడదనుకున్నారు. అంతా ఆ మాటకి కట్టుబడ్డారు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (4వ. భాగం)
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (2వ. భాగం)
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (5వ. భాగం)
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (1వ. భాగం)
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments