Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మహల్సాపతి, చాంద్ పాటిల్, కాశీరాం, అప్పాజోగ్లే, బయిజాబాయితో పాటు ఇప్పుడు శ్యామా కూడా బాబా భక్తుడయ్యాడు.
బాబాని చూస్తూ పారవశ్యం చెందడం కాదు, ఆయన చర్యల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి. భక్తునిగా అది తన విధి అనుకునేవాడు శ్యామా. బాబాని అంటి పెట్టుకుని ఉండి, ఆయన ప్రతి చర్యనీ అర్థం చేసుకునేందుకు ప్రయత్నించేవాడతను. అయితే బాబా చర్యలు శ్యామాకే కాదు, ఎవరికీ అంతు చిక్కకుండా ఉండేవి. ఎవరి ఆలోచనలకీ అందనంత ఎత్తులో ఉండేవి.
భక్తుడయితే చాలు, కుల మతాలు పరిగణించేవారు కాదు బాబా. పేద గొప్ప తేడాలు చూసేవారు కాదు. ఎటువంటి వివక్షా లేకుండా అందరినీ ఆదరించేవారు బాబా. తెగని సమస్యల్ని తీరిగ్గా పరిష్కరించేవారు. చికిత్సకు అందని జబ్బుల్ని చిత్రంగా నయం చేసేవారు. బాబా చికిత్సలు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉండేవి. చేతులెత్తి దండం పెట్టేలా ఉండేవి.
బాబాని చూసేందుకు పిల్లలూ పెద్దలూ ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. చిట్టడవిలోంచి నడచి వచ్చేవారు కొందరు. తన కోసం అడవిలోంచి నడచి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందీ కలగజెయ్యొద్దని అడవిలోని జంతువులకీ, పాములకీ చెప్పేవారు బాబా.
ఆయన చెప్పినట్టే భక్తులకి ఎటువంటి ఇబ్బందినీ కలుగజేసేవి కావవి. కాని ఒకసారి ఏం జరిగిందంటే
ఓ భక్తుణ్ణి అడవిలో ఓ పాము కాటేసింది. పాపం, ఆ పిల్లాడికి పదహారేళ్ళు కూడా లేవు. కాటుకి కుప్పకూలిపోయాడు. బాధతో మెలికలు తిరిగాడు. నురగలు కక్కసాగాడు. పిల్లాడి తల్లిదండ్రులూ, బంధువులూ గోల గోలగా బాబాని చేరుకున్నారు. పిల్లాణ్ణి బాబా ముందు పడుకోబెట్టారు.‘‘బాబుని పాముని కరచింది. నువ్వే కాపాడాలి బాబా! మీరే కాపాడాలి.’’ అని మొర పెట్టుకున్నారు. వారిని చేత్తో వారించి కళ్ళు మూసుకున్నారు బాబా. తర్వాత కళ్ళు తెరిచారు. కోపంగా గట్టిగా ఇలా అరిచారు.‘‘ఆగక్కడ! ఆగిపో! దిగు…కిందికి దిగు!
’’ఆ సమయంలో అక్కడే ఉన్న శ్యామాకి బాబా ప్రవర్తన అర్థం కాలేదు. బాబా కసురుకున్నది ఎవరిని? ఆగమని హెచ్చరించింది ఎవరిని? దిగమంటున్నారు, ఎవరిని కిందికి దిగమంటున్నది?
ఆలోచనలు ఓ కొలిక్కి రానేలేదు, పాము కాటుకి బాధగా మెలికలు తిరుగుతున్న కుర్రాడు, బాధ తగ్గిందేమో! మెలికలు తిరగడం మానుకున్నాడు. గమనించాడది శ్యామా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (1వ. భాగం)
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (2వ. భాగం)
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (3వ. భాగం)
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (4వ. భాగం)
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (5వ. భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments