Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (3) వాక్కు – (4వ. భాగం)
ఆంగ్ల మూలం: లెఫ్టినెన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
ఎల్లప్పుడూ నీవిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకో —
ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని, ఆడి తప్పవద్దని సాయిబాబా భోధించారు. అనగా నువ్వు ఎవరికయినా ఒక పని చేస్తానని చెప్పినపుడు ఆపని చేసి తీరాలి. ఎప్పుడూ తప్పుడు వాగ్దానం చేయవద్దు. సాధారణంగా భక్తులు చేసేదేమిటంటే తమ కోరికలని తీర్చమని, తాము పూజించే భగవంతుని గాని, గురువుని గాని ప్రార్ధించి మొక్కుకుంటారు. కాని, కోరికలు తీరిన తరువాత మొక్కులు చెల్లించడం మరచిపోతారు. సాయిబాబా తన భక్తులెవరయినా మొక్కుకొన్న మొక్కులు మరచిపోతే వారికవి గుర్తు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి 33వ.అధ్యాయంలో అప్పాసాహెబ్ కుల్ కర్ణి తాను ఇంటిలో లేనపుడు వచ్చిన ఫకీరుకు, తానే కనక ఉంటే రూ.10/- ఇచ్చి ఉండేవాడిని అనుకొన్నాడు. బాబా మరల అతని వద్దకు వచ్చి రూ.10/-పూర్తిగా దక్షిణ అడిగి తీసుకొని అతని కోరిక తీర్చారు. శ్యామా తల్లి తమ గృహదేవతయిన సప్తశృంగి దేవతకి ఏనాడో మొక్కుకొంది. కాని ఆమె తన మొక్కును చెల్లించలేదు. ఆమె చనిపోయే సమయంలోఆవిషయం శ్యామాకు చెప్పి ఆ మొక్కులు తీర్చే భారం అతనిపైవేసింది. కాని శ్యామా కొన్నాళ్ళకు ఆమొక్కుల సంగతి పూర్తిగా మరచిపోయాడు. బాబా శ్యామానే స్వయముగా వణికి వెళ్ళి అతని తల్లి మొక్కులను తీర్చవలసినదని చెప్పి అతని చేత మొక్కులను చెల్లించేలా చేశారు. ఆవిధంగా బాబా శ్యామా తల్లి మొక్కులను నెరవేర్చారు. (అధ్యాయం – 15)
మితముగా మాట్లాడు:
సాయిబాబా కూడా ఈసూత్రాన్నే అనుసరించి మితముగా మాట్లాడేవారు. అయన ఎప్పుడూ పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. తన భక్తులకు తగినట్లుగా కధలను చెప్పి, అనుభవాలను కలుగచేస్తూ ఉండేవారు. ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలంటే ప్రతి రోజు కొంత సమయం మౌనంగా ఉండాలి. సాయిబాబా తాను స్వయంగా క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు లెండీబాగ్ లో తమ జీవితాంతం వరకు ఆచరించారు. అధికంగా మాటలాడటం వల్ల శక్తి చాలా ఖర్చవుతుంది. అందుచేత మన రోజువారీ కార్యక్రమాలలో అనవసరంగా మాట్లాడటం, అనవసర చర్చలు మానుకోవాలి.
భగవన్నామస్మరణ :
సాయిబాబా తన ప్రసంగాలలో ముఖ్యంగా చెప్పినది భగవంతుని సదా స్మరిస్తూ ఉండమని. ఆయన ఎప్పుడూ ‘అల్లామాలిక్’ (భగవంతుడే యజమాని) అంటూ ఉండేవారు. ఒక వారమంతా పగలు రాత్రి, ఇతరుల చేత భగవన్నామస్మరణ చేయించడం ఆయనకు ఎంతో ఇష్టం. దీనినే నామ సప్తాహం అంటారు.
హేమాడ్ పంత్ అంటారు “భగవంతుని నామానికున్న శక్తి అందరికీ తెలుసు. అది మనలని అన్ని పాపాల నుండి, చెడు ప్రవృత్తుల నుండి రక్షిస్తుంది. జనన మరణ చక్రాల నుండి తప్పిస్తుంది. దీనికన్నా సులభమయిన సాధన మరొకటి లేదు. అది మన మనసులని అమోఘంగా శుధ్ధి చేస్తుంది. మన ఆలోచనలు పవిత్రమవుతాయి. చెడు తలంపులు నశిస్తాయి. దీనికి ఎటువంటి సామాగ్రి, అవసరం లేదు. ఎటువంటి నిబంధనలు లేవు.”
సారాంశం :
సంక్షిప్తంగా భాషణమ్ (వాక్కు) గురించి సాయిబాబా ఇచ్చిన సలహాలు
1. ఎవ్వరితోను వారి మనస్సు వెంటనే బాధపడేలాగ పరుషంగా మాట్లాడవద్దు. దానికి భిన్నంగా ఎవరయినా నీతో పరుషంగా మాట్లాడినా నీవు శాంతం వహించు.
- వాదవివాదాలను మానుకోవాలి.
- ఎప్పుడూ ఎవరిమీదా నిందలు వేయడంగాని, చాడీలు చెప్పడంగాని, ఎగతాళి చేయడంగాని. వీటికి పాల్పడవద్దు.
- ఎప్పుడూ సత్యమునే పలుకవలెను.
- ఎప్పుడూ మృదువుగాను, మధురంగాను మాట్లాడాలి.
- ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
- తక్కువగా మాట్లాడి తరచూ మవునం వహించాలి.
- తరచూ ఎప్పుడు వీలయితె అప్పుడు భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము (3) వాక్కు – 3వ.భాగమ్
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము (3) వాక్కు 2వ.భాగమ్
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – ధనము (2వ. భాగం)
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (4) భక్తి మార్గం (4వ.భాగమ్)
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (6) కర్మ సిధ్ధాంతం (4వ.భాగమ్)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments