Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (6) కర్మ సిధ్ధాంతం (4వ.భాగమ్)
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
పునర్జన్మల నుండి విముక్తి:
కొన్ని సమయాలలో కొంతమంది అసలు మంచి గాని, చెడు పనులు గాని ఏమీ చేయకుండా ఉన్నయెడల మంచి లేక చెడు ఫలితాలను మనమేమీ అనుభవించనక్కరలేదు కదా అని తర్కిస్తూ ఉంటారు. ఆవిధంగా పునర్జన్మ అనే ప్రశ్నే ఉండదు కదా అని అభిప్రాయ పడుతూ ఉంటారు. నిజమే. కాని అసలు ఏపనీ చేయకుండా ఆవిధంగా ఊరికే కూర్చుని ఉండటం సాధ్యమయిన విషయమేనా? మానవుడు జీవించినంత కాలం ఏదో ఒకటి చేయవలసిందే. ఆఖరికి సర్వసంగ పరిత్యాగులయిన సన్యాసులయినా తమ క్షుద్భాధను తీర్చుకోవడానికి భిక్ష ఎత్తవలసిందే. అలాకాకుండా అతని వద్దకు ఎవరు ఏఆహారాన్ని తెచ్చి సమర్పించినా కూడా దానిని నమిలి మ్రింగవలసినదే కదా? ఆవిధంగా నమిలి మ్రింగడం సరిగా చేసినా చేయకపోయినా దానివల్ల వచ్చే పర్యవసానాలన్నీ అనుభవించవలసినదే. అంతే కాదు ఇతరుల వద్ద నుంచి స్వీకరించిన దానికి ఋణగ్రస్తుడయి దానిని ఈజన్మలో కాని, మరొక జన్మలో గాని తీర్చుకోవలసిందే.
అందుచేత పునర్జన్మల నుండి విముక్తి పొందాలంటే ఈజన్మలో మానవుడు చేయవలసిన మంచి పనులు ఏమయితే నిర్దేశింపబడ్డాయో వాటిని నిజాయితీగాను, చిత్తశుధ్ధితోను ఆచరించాలి. కాని మానవుడు ఏకర్మ చేసినా అది మంచయినా, చెడయినా తాను కర్తగా ఉండక దాని ఫలితాలను ఆశించకూడదు. గీతలో శ్రీకృష్ణపరమాత్మ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన I
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగో-స్త్యకర్మణి II
2వ అధ్యాయం- 47 -శ్లోకం
(కర్తవ్య కర్మము నాచరించుట యందే నీకు అధికారము గలదు. ఎన్నటికినీ దాని ఫలముల యందు లేదు. కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్షరహితుడవై కర్తవ్య బుధ్ధితో కర్మలనాచరింపుము.)
సాయిబాబా కూడా ఈ విషయాల మీదనే ఉపదేశమిచ్చారు. అన్నాసాహెబ్ ధబోల్కర్, సాయిబాబా జీవిత చరిత్రను వ్రాయదలచి దానికి అనుమతిని ప్రసాదించమని శ్యామా (మాధవరావు దేశ్ పాండే) ద్వారా అభ్యర్ధించాడు. – అప్పుడు బాబా ఏమన్నారో చూడండి. “అతడు నిమిత్తమాత్రుడు. నాజీవిత చరిత్రను నేనే వ్రాసి నాభక్తుల కోర్కెలను నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడువవలెను. దానిని నాపాదములపై పెట్టవలెను. ఎవరయితే వారి జీవితములో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను” అధ్యాయం – 2
అదే విధంగా, రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్) లోని గోదావరీ తీరమందు శ్రీవాసుదేవానంద సరస్వతి (టెంబేస్వామి) శ్రీసాయిబాబాకు సమర్పించమని కొబ్బరికాయను నాందేడ్ వాసి శ్రీపుండలీకరావుకు ఇచ్చారు. కాని అనుకోకుండా పుండలీకరావు దారిలో దానిని పగులకొట్టి తిన్నాడు. షిరిడీకి చేరిన తరువాత పుండలీకరావుకు అసలు విషయం జ్ఞప్తికి వచ్చి చాలా విచారించాడు. తానెంతో పాపం చేశానని చాలా బాఢపడ్డాడు. బాబాకు క్షమాపణ వేడుకొన్నాడు. అపుడతనితో బాబా “ఆవిషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నాసంకల్పము ప్రకారము నీకివ్వబడెను. తుదకు దారిలో పగులకొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకొననేల? మంచిగాని, చెడుగాని, చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వాహంకార రహితుడవై యుండుము. అపుడే నీ పరచింతన అభివృధ్ధిపొందును” అని వేదంత విషయమును బోధించారు. అధ్యాయం – 50
శ్రీసాయి సత్ చరిత్ర మరాఠీ మూల గ్రంధంలో హేమాడ్ పంత్ ఈవిధంగా అంటారు. “ఏదయినా ఒక పనిని ప్రారంభించే ముందు సద్గురువు యొక్క దివ్యచరణాలను స్మరించుకుని త్రికరణశుధ్ధిగాను, నిజాయితీగాను, చేసినట్లయితే, పూర్తికావలసిన పనిలో సద్గురువు అన్ని అడ్డంకులను తొలగించి భక్తునికి కార్యసిధ్ధిని కలుగచేస్తారు. ఎవరయితే తాను కార్యాన్ని నిర్వహిస్తున్నపుడు తాను కర్తను మాత్రమే అని భావించి ఫలితాన్ని మాత్రం తన గురువు లేక భగవంతుని నిర్ణయానికి వదలివేస్తారో ఆపనిని అతడు ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. దీనికే కర్మయోగమని పేరు. అనగా ప్రత్యేకమయిన నేర్పుతో పనిని నెరవేర్చినపుడు (కర్మసు కౌశలం – గీత 2వ.అ. 50 శ్లో.) తామరాకు మీద నీటి బొట్టువలె ఆకర్మ ఫలము వానికి అంటదు.
(కర్మసిధ్ధాంతం సమాప్తం)
(రేపటి సంచికనుండి మానవ జన్మ)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (6) కర్మ సిధ్ధాంతం (1వ.భాగమ్)
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (6) కర్మ సిధ్ధాంతం (2వ.భాగమ్)
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (6) కర్మ సిధ్ధాంతం (3వ.భాగమ్)
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (4) భక్తి మార్గం (4వ.భాగమ్)
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (4) భక్తి మార్గం( 8వ.భాగమ్)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments