శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (6) కర్మ సిధ్ధాంతం (1వ.భాగమ్)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాబా ఆశ్శిస్సులతో అందరికి ఈ నూతన సంవత్సరంలో శుభం జరగాలని కోరుకుంటున్నాను.

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (6) కర్మ సిధ్ధాంతం (1వ.భాగమ్)

ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

సాధారణంగా కర్మ సిధ్ధాంతం గురించి అర్ధం చేసుకోవాలంటే కష్టమయినా గాని,  సైన్స్ పరంగా అనగా శాస్త్రీయ సూత్రం ప్రకారం ‘చర్య ప్రతిచర్య’  (ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది) అని గుర్తు చేసుకొంటే, సులభంగా అర్ధమవుతుంది.  ప్రతిరోజూ మనం చేసే దినచర్యల్లో మనం ఏపని చేసినా దాని ఫలితం మనం అనుభవంచవలసిందే. ఒక్కొక్కసారి వెంటనే జరిగితె, ఒక్కొక్కసారి తరువాత జరుగుతాయి. ఉదాహరణకి మనం నిప్పుని ముట్టుకుంటే చెయ్యి వెంటనే కాలుతుంది.   దాని ఫలితం వెంటనే అనుభవించాల్సిందే.  మనం సిగరెట్లు కాల్చినా, విపరీతంగా త్రాగుడు తాగినా కొన్నాళ్ళకు మన శరీరం వివిధ రకాల జబ్బులకు నిలయమవుతుంది.  అందుచేత గత జన్మలలో మనం చేసిన మంచి పనులు గాని, చెడు పనులు గాని వాటియొక్క పర్యవసానాలు అనుభవించాల్సినవి ఏమయినా మిగిలి ఉంటే ఎవరయినా సరే ఈ జన్మలో అనుభవించాల్సిందే. తప్పించుకోవడానికి ఇక మార్గం లేదు.

పైన ఉదహరించిన దానిని బట్టి మనం నేర్చుకోవలసిన నీతి – “ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను.  అనగా ఎవరి కర్మకు వారే కర్తలు. ఇతరులతో సంబంధములన్నిటిని, బాధను కూడా అనుభవించి తీరాలి.  ఇక తప్పించుకునే మార్గమే లేదు.  తనకెవరితోనయిన శతృత్వమున్న యెడల దాని నుండి  విముక్తిని పొందవలెను.  ఎవరికైన ఏమయిన బాకీ యున్న దానిని తీర్చివేయవలెను. ఋణము గాని, శతృత్వముగాని, యున్నచో దానికి తగిన బాధపడవలెను.  ధనము నందు పేరాస గలవానినది హీనస్థితికి దెచ్చును. తుట్టతుదకు వానికి నాశనము కలుగజేయును.”  అధ్యాయం – 47

“జైసే జిస్ కీ  నియత్, వైసె ఉస్కి బర్కత్” “నువ్వు మంచి చేస్తే నీకు మంచే జరుగుతుంది”. 

సాయిబాబా రఘువీర పురందరేతో అన్నమాటలు. ఎల్లప్పుడు మంచి పనులే చేయి.

శాస్త్రాలలో చెప్పిన విధంగా మాత్రమే నడచుకోమని సాయిబాబా తన భక్తులకు బోధించారు.  “ప్రతివారు నిజాయితీగా వ్యవహరించాలని, జ్ఞానంతో ఎఱుక  కలిగి (ఏదిమంచో, ఏది చెడో గ్రహించుకొని నిర్ణయించుకోవాలని) ఉండాలని హితోపదేశం చేశారు.  మనం ఏపని చేసినా త్రికరణశుధ్ధిగా, సద్భావంతో చెయ్యాలి.  ఈ పని నేనే చేశాను, నావల్లనే జరిగిందనే అహంకారం, గర్వం ఉండకూడదు.  ఒక్కొక్కసారి మనవల్ల ఇతరులు సహాయం పొందవచ్చు.   ఆకారణం చేత, నేనే కనక సమయానికి సహాయం చేయకపోయినట్లయితే అతను ఈ పాటికి ఏమయిపోయేవాడో అని నలుగురిలోనూ మన గొప్పతనాన్ని ప్రదర్శించుకోకూడదు.  మనం ఇతరులకి సహాయం చేశామంటే అది మనకు భగవంతుడిచ్చిన అవకాశంగా భావించి అణకువతో ఉండాలి.       మనం ఏమి చేసినా కూడా దానివల్ల వచ్చే కర్మఫలాలకి మనం బధ్ధులం కాకుండా భగవంతునికే అర్పించాలి.  అందరి యందు మనం ప్రేమతో ఉండాలి.  మనం ఏవిధమయిన వివాదాలలోను జోక్యం చేసుకోకూడదు.  మనలని ఎవరయినా నిందించినా మౌనం వహించాలి. లేదా చిన్న చిరునవ్వు నవ్వి అక్కడినుండి తప్పుకోవాలి.  ఎవరయినా నిందించినా వారు మాట్లాడే మాటలు మన శరీరానికి హాని కలిగించవు.  వాటి వల్ల మన శరీరమేమీ తూట్లుపడిపోదు.  మనం ఎవరితోను శతృత్వం పెట్టుకోకూడదు.  ఎదటి వారిని దూషించకూడదు.  ఎవరు ఏమి అన్నా కూడా మనం వాటిని పట్టించుకోకూడదు.  వారి పని వారిదే, మన పని మనదే అన్నట్లుగా ఉండాలి. సోమరితనం వదిలేసి ఎప్పుడూ శ్రమిస్తూ ఉండాలి.  భగవన్నామ స్మరణ చేసుకోవాలి.  ఆధ్యాత్మిక గ్రంధాలను చదువుతూ ఉండాలి.

శ్రీమతి సావిత్రిబాయి టెండూల్కర్ గారు వ్రాసిన సాయినాధ్ భజనమాల అన్న పుస్తకంలో కాకాసాహెబ్ దీక్షిత్ గారు ముందు మాట వ్రాసారు.  ఆయన రాసినదానిలోనివే సంగ్రహంగా పైన చెప్పినటువంటి బాబా బోధనలు.

మన శాస్త్రాలలో (తైత్తరీయ ఉపనిషత్) దానం గురించి చాలా ప్రముఖంగా చెప్పబడింది.  దానము గట్టి విశ్వాసముతోను, ధారాళముగను, అణకువతోను చేయాలి.  ఇవేమీ లేకుండా చేసిన దానాలన్నీ నిష్ప్రయోజనం.   దానం చేసినా సమాజంలో గొప్పకోసం, పేరుకోసం చేయకూడదు.  మనపేరు బయటకు రాకుండా గుప్తదానం చేయాలి.  అధ్యాయం – 14

(నాకు ఒక సాయి భక్తుడు/భక్తురాలి నుంచి రెండు సంవత్సరాల క్రితం బాబా  వారికి  సంబంధించిన పుస్తక  ప్రచురణ నిమిత్తం విరాళం అందింది.  తన పేరు ఎక్కడా ప్రస్తావించవద్దని ప్రత్యేకంగా నన్ను కోరడం జరిగింది.   ఆవిధంగానే పుస్తక ప్రచురణ జరిగింది. భక్తులందరికీ ఉచితంగా పంచడం జరిగింది. త్యాగరాజు)

(ఇంకా ఉంది)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles