శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (4) భక్తి మార్గం(7వ.భాగమ్)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (4) భక్తి మార్గం(7వ.భాగమ్)

ఆంగ్లమూలం లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

ఉత్తమమైన భక్తి అంటే ఏమిటి?

మొట్టమొదటగా భక్తిలో ఉండవలసినది మనం పూజించే దైవం మీదగాని, గురువు మీదగాని అమితమైన ప్రేమ.  ఆయన గొప్పతనంమీద, శ్రేష్ఠత మీద సంపూర్ణమయిన  విశ్వాసం  ఉండాలి. నువ్వు ఆయనకి ఎంత ఖరీదయినవి సమర్పిస్తున్నావు లేక ఎన్నేసి గంటలు పూజిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు.  నువ్వు సమర్పించే దానిలో  ఎంత  నిజాయితీ, త్రికరణ శుధ్ధి ఉంది అన్నదేముఖ్యం.  16వ.అధ్యాయంలో హేమాడ్ పంత్ బాబా గురించి ఈవిధంగా చెప్పారు.

“భక్తితోను, ప్రేమతోను సమర్పించినది ఏదయినా సరే,  అది ఎంత చిన్నదయినా నేను సంతోషంగా స్వీకరిస్తాను.  కాని, గర్వంతోను,  అహంకారంతోనుసమర్పించినదానిని నేను  నిరాకరిస్తాను.”   అధ్యాయం – 16

“నాకు ఎటువంటి పూజా తంతులతోగాని, షోడశోపచారములతో గాని, అష్టాంగ యోగములతో కాని పని లేదు.  భక్తి యున్న చోటనేనానివాసము” అన్నారు బాబా.  అధ్యాయం  – 13

భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముల వారు కూడా ఇదే విషయాన్నిచెప్పారు.

“పత్రం పుష్పం ఫలంతోయం యోమేభక్త్యా ప్రయచ్చతి  I

తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః       I 26 I

(నిర్మల బుధ్ధితో, నిష్కామ భావంతో, పరమ భక్తునిచేసమర్పింపబడిన పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమునుగాని, జలమును గాని, నేను ప్రత్యక్షముగా ఆరగింతును)

ఇక రెండవది భక్తిలో ఎటువంటి ఫలాపేక్ష ఉండకూడదు.  నాకోరిక తీరిస్తే నీకు ఏదయినా సమర్పించుకుంటాను అని మొక్కులు మొక్కుకొని భగవంతుని  గాని సద్గురువును  గాని  పూజిస్తే అది వ్యాపారమే అవుతుంది.  మనం భగవంతుని నుంచి ఏదయినా అర్ధిస్తున్నామంటే ఏమిటి దానర్ధం?  శ్రీసాయి సత్ చరిత్రలో దివ్యమైన ఉదాహరణలు  ఉన్నాయి.   ఉదాహరణకి బాబా శ్యామా బుగ్గ మీద గిల్లినపుడు శ్యామా బాబాతో ఏమన్నాడో చూడండి.  “ఎల్లప్పుడు ముద్దులు, మిఠాయిలు ఇచ్చు దైవము మాకు  కావలెను.   మీ నుండి మాకు గౌరవము గాని, స్వర్గము గాని, విమానము గాని అవసరము లేదు.  మీ పాదముల యందు నమ్మకము మాకెప్పుడును ఉండుగాక” –  అధ్యాయము – 36

అమీర్ శక్కర్ కీళ్ళవాతముతో బాధ పడుచుండుట చేత భగవంతుడయిన బాబాను జ్ఞప్తికి తెచ్చుకొన్నాడు.  ఆయన గురించి వివరిస్తూ,  హేమాడ్ పంత్ మరాఠీ  శ్రీసాయి  సత్  చరిత్రలో  కుంతీదేవిని ఉదహరించారు.  కుంతీదేవి పాండవుల తల్లి.  మహాభారత యుధ్ధం ముగిసిన తరువాత శ్రీకృష్ణపరమాత్ముల వారు కుంతీదేవిని ఏదయినా వరం  కోరుకోమన్నారు.  అరణ్యంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తూ అజ్ఞాతవాసంలో ఉన్నా కూడా “కృష్ణా! ఎవరయితే సుఖసంతోషాలని కోరుకుంటారో వారికది ప్రసాదించు కాని,  నాకు మాత్రం మరలామరలా కష్టాలనే ఇవ్వు. కష్టకాలంలో ప్రతి క్షణం నిరంతరం నిన్నేగుర్తుంచుకొంటూ నిన్నే స్మరిస్తూ ఉంటాను” అని కష్టాలనే వేడుకొంది.  అధ్యాయం – 22 ఓ వి110 – 112

(కుంతీదేవి ఆ విధంగా కోరుకొంది.  ఆ విధంగా మనం కూడా కష్టాలనే కోరుకోలేము కదా నేటి పరిస్థితుల్లో.  కాని కష్టాలలోను, సంతోషాలలోను మనం మన బాబాని కాని లేక మనం ఏభగవంతుడినయితే పూజిస్తున్నామో ఆయనని వదలకూడదు.  కష్టాలు వచ్చాయని మనం పూజించే దైవాన్ని వదలి మరొక దైవాన్ని పట్టుకుంటామా?  అది చాలా పొరపాటు పని.  దైవమ్ ఒక్కడే అని మనం నమ్ముతున్నపుడు కష్టాలలోను, సుఖాలలోను మనం పూజించే  దైవాన్ని విస్మరించరాదు.)

శ్రీహేమాడ్ పంత్ శ్రీసాయి సత్ చరిత్ర తుది పలుకులలో ఈ విధంగా ప్రార్ధించారు.  “మా మనస్సు అటునిటు సంచారము చేయకుండు గాక.  నీవుదప్ప మరేమియును కోరకుండు  గాక.  ఈ సత్ చరిత్రము  ప్రతి గృహమందుండు గాక.   వానిని  ప్రతి నిత్యము  పారాయణ   చేసెదముగాక.  ఎవరయితే నిత్యము పారాయణ  చేసెదరో వారి యాపదలు తొలగిపోవుగాక! అలా కాకపోతే అందరూ శాశ్వతంగా సుఖంగా ఉండాలని  భక్తితో  ఉండాలని ప్రార్ధిస్తున్నాను.”

ఆదర్శవంతమయిన (ఉత్తమమైన) భక్తి గురించి సాయిబాబా రెండే రెండు మాటలలో చెప్పారు. – శ్రధ్ధ, సబూరీ.  ఎవరికయినా సరే తాము పూజించే దేవుడు, లేక సద్గురువు మీద గట్టి నమ్మకం ఉండాలి.  వారు మనకేమి చేసినా కూడా అంతిమంగా మనకు మంచే  చేస్తారు.  సహనం అంటే  కష్టాలు ప్రాప్తించినపుడు ధైర్యంగా ఉండాలి.  మొదట్లో  అపజయాలు గాని  ఓటమి గాని ఎదురయినా సరే మన సద్గురువు నందు మన భక్తి  కొంచమైనా సడలకూడదు.  ఈ రెండు అనగా శ్రద్ధ, సహనం ఎవరయితే తూ చా తప్పకుండా అలవరచుకుంటారో వారిలోని భక్తి మరింతగా ప్రకాశిస్తుంది.

 సాయిబాబా భక్తి గురించి ఒక ముఖ్యమయిన విషయం చెప్పారు.  బాబా చెప్పిన ప్రకారం భక్తి అనేది ఒక్కదాని మీదనే అనగా పతివ్రత తన భర్తను ఏవిధంగానయితే పూజిస్తుందో (పతిభక్తి) ఆవిధంగా కేంద్రీకృతమయి ఉండాలి. ఎవరయినా తమ కుటుంబ సాంప్రదాయాలను బట్టి లేక సంబంధాలననుసరించి తమ సద్గురువు మీద భక్తిని విడచిపెట్టి తన వద్దకు ఉపదేశానికి రావడాన్ని ఆయన అంగీకరించేవారు కాదు.  పంతు అనేవాడు మరొక సద్గురుని శిష్యుడు.  అతను బాబా దర్శనానికి వచ్చినపుడు బాబా ఈవిధంగా అన్నారు—

“ఏమయినను కానిండు, పట్టు విడువరాదు.  నీగురునియందే ఆశ్రయము నిలుపుము.  ఎల్లప్పుడు వారి ధ్యానమునందే మునిగియుండుము”.  అధ్యాయం – 26

(ఇంకా ఉంది)

 ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles