Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
గోపీచంద్
తెలుగులో ప్రముఖ నవలా రచయిత శ్రీ త్రిపురనేని గోపిచంద్ . ఆయన తండ్రి నాస్తికుడు. తన తండ్రి అడుగుజాడలలోనే గోపీచంద్ నడిచాడు. 1954 లో కర్నూలులో ఏ పీ గవర్నమెంట్లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిసిటీ గా పని చేశారు. ఆయన భార్య ప్రసవం కోసం గవర్నమెంట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. నొప్పులు వస్తూ చాలా హార్డ్ లేబర్ గా ఉంది. 3 రోజులు అయినా గాని రిలీఫ్ లేదు. గోపీచంద్ నిద్రలేని రాత్రులు, పగళ్ళు గడిపాడు. మూడవ రోజున తుంగభద్ర నది ఒడ్డున ఉన్న బాబా గుడి వద్ద నుంచి నడుస్తూ వెళ్ళడం తటస్థించింది. ఇక తీవ్రమైన దుంఖము, ఆవేదనతో నిండి ఉన్న గోపీచంద్ బాబాని ఉద్దైశించి ఇలా అన్నారు. “ప్రజలంతా నువ్వు దేవుడవని అంటారు. నీలో చాలా శక్తులు ఉన్నాయి. ఆర్తులను నువ్వు ఆదుకుంటావని అంటారు. ఇదేకనక నిజమయితే నువ్వు నాకు సహాయం చెయ్యి. నా భార్యకు నొప్పులు లేకుండా సుఖ ప్రసవం అయ్యేటట్లు చూడు. అప్పుడే నేను నిన్ను సర్వంతర్యామివని నమ్ముతాను”. ఇలా అనుకుంటూ ఆస్పత్రికి వెళ్ళారు.
ఆయన ఆస్పత్రికి వెళ్ళేటప్పటికి ఆయన భార్యకు తేలికగా సుఖ ప్రసవం అయింది. మగ పిల్లవాడు జన్మించాడు. కొంత సేపటి తరువాత ఆయన గదిలో ఉన్న భార్య వద్దకు వెళ్ళారు.అప్పుడు ఆమె జరిగిందంతా చెప్పింది. ఒక ముసలాయన గడ్డంతో అంగరఖా తొడుక్కుని వుండి సటకాతో వచ్చాడు. మంచం మీద ప్రక్కన కూర్చుని “బిడ్డా బాథ పడవద్దు. నీకు నెప్పులు లేకుండా సుఖప్రసవం అవుతుంది ఇప్పుడే” అని చెప్పి నా నుదుటి మీద ఊదీ పెట్టారు. నీటిలో ఊదీ కలిపి నాచేత తాగించారు.నేను ఆనీటిని త్రాగగానె మగ పిల్లవాడు జన్మించాడు. నాకు ఇప్పుడు ఏవిథమయిన నొప్పులూ లేవు. నేను క్షేమంగా ఉన్నాను అని చెప్పింది. గోపీచంద్ ఆయన ఏ సమయంలో వచ్చారు అని అడిగారు. ఆమె ఆ ముసలాయన వచ్చిన సమయం చెప్పింది. గోపిచంద్ బాబాతో ఏ సమయంలో అయితే తన మనస్సులో సవాల్ చేశారో అదే సమయంలో ఇక్కడ ఆస్పత్రిలో బాబా ప్రత్యక్షమయి తను సర్వంతర్యమినని చాటారు. గోపిచంద్ తన కొడుకికి సాయిబాబా అని నామకరణం చేశారు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా వారు చేసిన లీలల ద్వారా బాబా మీద నమ్మకం లేని భక్తుని కుటుంబ సభ్యులందరినీ తన భక్తులుగా మార్చుకున్న సాయి మహారాజ్….
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, బాబా వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం.
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం
- తుంగభధ్ర తట వాసినే నమః …..సాయి@366 మే 10….Audio
- టికెట్స్ లేని ట్రైన్ లో కూడా బెర్త్ లు ఇప్పించిన బాబా …..!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబా నమ్మకం లేని వారిని కూడా తన వారిగా చేసుకుంటారు”
సాయినాథుని ప్రణతి
December 28, 2016 at 6:32 amఈ లీల చాలా ఆనంద దాయకంగా వుంది. బాబా రక్షణ మనకు ఎల్ల వేలలా వుంటుందన నమ్మకాని కలిగిస్తుంది.
Sreenivas
August 21, 2017 at 1:18 pmసాయిచంద్… నిన్న ABN ANDHRA JYOTHI షేర్ చేసుకున్న బాబా తో తమ కుటుంబానికి ఉన్న ఎక్సపెరిన్స్….
పుట్టినపుడు ఎక్కువ రోజులు బతకనని అన్నారట డాక్టర్లు. అప్పుడు మా నాన్న కర్నూలులో ఉంటున్నారు. నా కొడుకు బతికితే అందరం నీ భక్తులుగా ఉంటాం అని షిర్డీసాయిని మొక్కుకున్నాడట. నేను బతకడంతో నాన్న పూర్తిగా ఆస్తికునిగా మారిపోయాడు. నేను గుళ్లకు వెళ్లను. దైవం ఉందని నమ్ముతాను. కాసేపు ఇంట్లో షిర్డీసాయి దగ్గర కూర్చుంటాను. అంతే…
షిర్డీ సాయిబాబా నడిపిస్తున్నారా, నాన్నగారు, తాతగారు ఇద్దరూ చెరో చెయ్యి పట్టుకుని నన్ను నడిపిస్తున్నారా? ఏంటో తెలియదు. జీవితం అలా జరుగుతోంది. ఈ రోజున ఈ సినిమా అవకాశం కూడా కరెక్ట్ టైంలో వచ్చింది. వాట్ ఐ మిస్డ్ ఇన్ లైఫ్… అది నాకు గొప్ప అవకాశంగా ఇలా వచ్చింది.
పూర్తి ఇంటర్వ్యూ లింక్:
Sreenivas
August 21, 2017 at 1:19 pmhttp://www.andhrajyothy.com/pages/openheartarticle?SID=454326