బాబా వారు చేసిన లీలల ద్వారా బాబా మీద నమ్మకం లేని భక్తుని కుటుంబ సభ్యులందరినీ తన భక్తులుగా మార్చుకున్న సాయి మహారాజ్….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజేశ్వరరావు గారి అనుభవములు నాల్గవ భాగం

మా అమ్మాయి ఫార్మసి చేసింది 1000రూ స్టైఫండ్ ఇస్తామన్నారు. దానికి తండ్రి ఇన్‌కం సర్టిఫికేట్‌ కావాలన్నారు.

సర్షిఫికేట్‌ కోసం ఆఫీసుకి వెళ్ళితే ఆఫీసర్‌ ఎల్‌ .ఐ. సి ఏజంట్‌ గా నువ్వు నాకు తెలెయదు అని చివాట్లు పెట్తాడు. నేను బాబాను ప్రార్ధించాను. ఆఫీస్‌ వాళ్ళు సర్టిఫికేట్‌ ఇచ్చారు.

మా అమ్మాయికి డబ్బు రావడం, మా ఆవిడకి టైలరింగ్‌ లో డబ్బు రావడం మా మరదలి కి ఆపరేషన్‌ అన్నీ చూసి బాబాయే చేస్తున్నాడన్న విషయం మా ఆవిడకి నెమ్మదిగా అర్ధం అయ్యింది, తనకి బాబా మీద నమ్మకం కుదిరింది.

ఒకామెకి ఫిట్స్‌ వచ్చేవి. నేను బాబా ఊధి ఇచ్చాను. ఆమె రోజు ఊధి ధారణ చేసి నీటిలో కలిపి తాగేది. ఆమెకి క్రమంగా ఫిట్స్‌ తగ్గాయి.

మరో ముస్లిమ్‌ కి ఊధి ఇచ్చాను. అతనికి బాగా తాగుడు అలవాటు వుంది. ఊధి రోజు నీటిలో వేసుకొని బాబా ఫోటో ముందు తాగుతూ వుంటే క్రమంగా ఆ ముస్లిం తాగుడు వ్యసనానికి దూరం అయ్యాడు.

అతను అతని కుటుంబం శిరిడి వస్తామన్నారు. ఆ ముస్లిం కి వరంగల్‌ లో తాజుద్దీన్‌ బాబా అని గురువు వున్నాడు.

ఆయన కూతురికి ఒకసారి తలనొప్పి వస్తే ఈ ముస్లిం అతను నా దగ్గరికి వచ్చి విభూది అడిగి తీసుకు వెళ్లి ఇచ్చాడు. ఆమెకి తల నొప్పి తగ్గిపోయింది.

వాళ్ళు నన్ను రంజాన్‌ కి భోజనానికి పిలిచారు. ఆ ఆమ్మాయి వాళ్ళ మత గ్రంధం తెచ్చి ఇచ్చింది. ఖురాన్‌ బాబా దయ వలన చదవ గలిగాను. ఆ అమ్మాయి ఇప్పుడు దాక్టర్‌ మంచి బాబా భక్తురాలు కూడా.

మా నాన్నకి ఒంట్లో బాగుండక హైదరాబాద్‌ కేర్‌ హాస్పటల్‌ లో ఆపరేషన్‌ చేయాలన్నారు. షుగర్‌ కంట్రోల్‌ చేయడానికి ఇన్సులిన్‌ ఎక్కువ మోతాదులో ఇచ్చారు, అది వికటించి నాన్న కోమాలోకి వెళ్ళిపోయారు.

నేను బాబా ముందు కూర్చొని “బాబా నువ్వు ఉన్నదే అందరికి మంచి చేయడానికి ఎందుకంటే, మేమందరం నీ పిల్లలం మా నాన్నని కాపాడు” అని అరగంట మొకాళ్ళ మీద వుండి బాబా ని ప్రాదేయపడ్డాను.

అర గంట తర్వాత నాకు హైదరాబాద్‌ నుండి ఫోన్‌ వచ్చింది, నాన్నకి ప్రమాదం తప్పి, కోమాలోంచి బయటికి వచ్చినట్లుగా. నేను హైదరాబాద్‌ వెళ్ళలేదు కొన్ని కారణాల వల్ల వరంగల్‌ లోనే ఉండి పోయాను,

అందుకని నాన్న కోసం నేను ఇక్కడ నుంచే బాబాను ప్రార్ధించాను. నాన్న బాగయిన దగ్గర నుండి అమ్మ ప్రతి గురువారం బాబాకి దండ వేయనారంభించింది.

మా తమ్ముడు మరదలు పిల్లలతో కూడా మాతోనే ఉంటారు. మా తమ్ముడికి మొదట సంతానం పాప పుట్టింది. రెండో సారి మా తమ్ముడు బాబు పుట్టాలి అనుకున్నాడు.

ఒకసారి మా తమ్ముడుకి జ్యోతిష్కుడు ఒకాయన కలసి వీడి జాతకం పరిశీలించి, నీకీసారి కూడా అమ్మాయే పుడుతుంది, అని చెప్పాడు.

అబ్బాయి అసలు నా జాతకంలో లేడుట అని విరక్తి చెందాడు. నెలలు నిండి మా మరదలిని హస్పటల్‌ కి తీసుకు వెడితే, తను కూడా వెళ్ళకుండా, నాకు అమ్మాయే పుడుతుందని, ఇంట్లోనే కూర్చున్నాడు.

నేను చూసి ఒరేయ్‌! నీకు అబ్బాయే పుడతాడు, రారా హాస్పటల్‌ కి పోదాం అన్నాను. అయినా కూడా వాడు వినలేదు, ఆ అమ్మాయికి కానుపు కష్టమయి ఆపరేషన్‌ చేయవలసి వచ్చింది. సిజేరియన్‌ చేసాక బాబు పుట్టాడు.

మా తమ్ముడు ఆశ్చర్యపోయాడు. బాబా మహత్యం ఇంత ఉందా? ఇంత ఉంటుందా? అని జాతకాలు కూడా తారుమారు అయిపోతాయి.

పురుడు కాంగానే అందరమూ కలసి శిరిడి కి వెళ్ళాము. తమ్ముడు కూతురికి జ్వరం వచ్చి ఏ మందులకి తగ్గలేదు. M.G.M లో జేర్పించాము. అయినా ఎటువంటి గుణం కనపడలేదు.

నేను పాపకి ఊధి పెట్టి బాబాని తలచుకొని పాప మీద చెయ్యి వుంచాను. జ్వరం తీవ్రత తగ్గు మొహం పట్టింది.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles