Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయిబంధువు మంజునాథ్ గారిని బాబా కాపాడిన తీరు ….వారి సోదరి మాటల్లో ..
నా పేరు లక్ష్మి.మేము బాబా ని పూజిస్తూ ఉంటాము.బాబా మాకు సూక్ష్మరూపం లో సహాయం అందిస్తూ ఉంటారు.
అది మా తమ్ముడి విషయం లో మరొకసారి ఆయన మహిమ ని తెలియజేసారు.
మా తమ్ముడికి మానసికంగా ఆరోగ్య౦ బాగుండదు.మనస్థిమితంగా వుండడు.
ఈ సమస్య వల్ల ఒక్కోసారి ఎవరికీ చెప్పకుండా ఇంటినుండి వెళ్ళిపోతాడు.
మేము కంగారు పడి వెతుకుతుంటాము.తానే ఒకటి లేదా రెండు రోజులలో ఇంటికి తిరిగి వచ్చేస్తాడు.
కానీ రెండు సంవత్సరాల క్రితం ఒకరోజు మేము ఎవరు చూడకుండా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు.
మేము ఎంత వెతికిన తన ఆచూకీ తెలియలేదు.మేము అన్ని విధాలా వెతికి చాల ప్రయత్నించాము.
తన ఆచూకీ సరిగ్గా నెలరోజులు తెలియలేదు.ఇంట్లో మా అమ్మ మేము చాల బాధపడి ఏడుస్తున్నాము.
ఇంకా తమ్ముడు అసలు దొరకడేమో అనిపించింది.
నేను బాబా ని అప్పుడు చాలా చాల అడిగాను.నువ్వే తిరిగి చేర్చాలి మా తమ్ముడిని క్షేమంగా ఇంటికి అని వేడుకున్నాను.
ఆ కోరికతో బాబాకి గట్టిగ సంకల్పం చేసుకుని బాబా “సాయిసచ్చరిత్ర ” పారాయణ వెంటనే మొదలుపెట్టాను.
బాబా శరణు వేడి ఆయన చరణాలను వదలలేదు.పారాయణ పూర్తి అయ్యేలోపు అంటే వారం రోజుల వ్యవధిలో మా తమ్ముడు తనకి తానే ఎప్పటిలాగా మా ప్రయత్నం చేయకుండా తిరిగి వచ్చేసాడు.
నెలరోజులు మేము ఎంత తీవ్రంగా వెతికినా దొరకని మా తమ్ముడు ఒక్క వారం రోజులలో మనఅందరి రక్షకుడు,తండ్రి అయిన మన సాయిబాబా కృపతో క్షేమం గా ఇంటికి వచ్చాడు.
మేము అంతులేని ఆశ్చర్యానికి ,సంతోషానికి గురి అయ్యాము. అయినా సృష్టి లోని ప్రతి ఆణువణువూ బాబాకి విదితమే.
“సాయి వంటి దైవంబు లేడు“ అని ప్రతి సాయిభక్తుడు ముక్తకంఠంతో చెప్పేందుకు ఈ లీల ఒక ఉదాహరణ.
బాబా ప్రేమను, మాతృ రక్షణను సాయిభక్తులు ఎంత చెప్పుకున్న తక్కువే … ఆయన మహిమ అద్భుతం,అపారం.
Latest Miracles:
- బాబా సచ్చరిత్ర పారాయణ వల్ల తమ్ముడు తమ్ముడి జాడ తెలిసింది-Audio
- అంత విచారించకపొతే ఒక్కసారి నా సచ్చరిత్ర పారాయణ చేయరాదా?–Audio
- నువ్వు బాబా మీద భారం వేసి సచ్చరిత్ర పారాయణ చేస్తూ కూర్చో
- నా కోరికను తీర్చిన బాబా.
- సచ్చరిత్ర పారాయణ తర్వాత నాకు జరిగిన అనుభవం ……..!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments