నువ్వు బాబా మీద భారం వేసి సచ్చరిత్ర పారాయణ చేస్తూ కూర్చో



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అయితే గురువారం  ఇంకా నాలుగు రోజులు ఉంది (వాళ్ళు బాబా భక్తులు)  మేము బాబాని చూసి కూడా చాలా రోజులు అయింది, మేము వస్తాము. అదే రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అన్నారు. వచ్చారు.

రిజిస్ట్రేషన్ కి 15 వేలు తక్కువైతే PF లోనుండి లోన్ తీసుకున్నాను.

రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ తర్వాత నాకు ఊర్లో ఉన్న కొద్ది పాటి పొలం అమ్మేసి లోన్ తీసుకొని మూడు అంతస్థుల బిల్డింగ్ కూడా కట్టాము.

పొలం తొంభై వేలకి అమ్మేద్దాం అనుకుంటే నాలుగు రేట్లు పెంచి ఇప్పించాడు బాబా.

లోన్ మీద మూడు అంతస్థుల బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చి సొంత ఇల్లు ఇప్పించాడు బాబా.

నేను స్వచ్చందంగా పదవీ విరమణ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్లడం ఇష్టం లేదు.

2012 వ సంవత్సరంలో ఇల్లు మరొకటి నిర్మాణం చేసి దానిపై కూడా అద్దె వచ్చేటట్లుగా,పెన్షన్ , అద్దెలతో ఆర్ధికంగా ఇబ్బంది లేకుండా బాబా నాకు సాయం చేసారు. తన దగ్గరే ఉంచేసుకున్నారు బాబా.

మా అబ్బాయి 2009 సెప్టెంబర్లో 9 , 10 తరగతులు ఇక్కడే షిరిడీలో చదివాడు. 11 , 12  హైద్రాబాదులో శ్రీ చైతన్య లో చేర్పించాను.

ఇంజినీరింగు కూడా మొదటి సంవత్సరం హైదరాబాద్ లోనే జాయిన్ చేసాము.

దసరా సెలవులకి షిరిడి వచ్చాడు,  ఖండోబా మందిరం దగ్గర రోడ్ క్రాస్ చేస్తుండగా మా అబ్బాయి సైకిల్ మీద వస్తున్నాడు. ఎదురుగా ట్రక్ వచ్చి గుద్దేసింది.

గుండెల పైనుంచి ట్రక్ చక్రం వెళ్ళిపోయింది. నేను బ్యాంకు లో ఉన్నాను. నాకు ఎవరో ఫోన్ చేసారు.

ఎదో మామూలు దెబ్బలు అనుకున్నాను. ఆసుపత్రిలో చేర్పిస్తే  చాలా కష్టం అని చెప్పారు.  ఊపిరి అందడం లేదు అని ఆక్సిజన్ పెట్టారు.

మూడు రోజులు సాయి నాథ్ ఆసుపత్రిలో ఉన్నాడు. మా గురువు గారికి ఫోన్ చేశాను. నువ్వు బాబా మీద భారం వేసి సచ్చరిత్ర పారాయణ చేస్తూ కూర్చో అని అన్నారు. నేను అలాగే అన్నాను.

వాడికి గుండెలపై ఉండే పక్కటెముకలు 13  చోట్ల విరిగి పోయాయి. లోపలంతా రక్తం పోతుంది అన్నారు. మూడు రోజులకి నాసిక్ లో చేర్చామన్నారు. మావల్ల కావడంలేదన్నారు.

అక్కడైతే గుండె ఎముకల స్పెషలిస్టులు ఉన్నారు అక్కడికి తీసుకువెళ్లమన్నారు. తెల్ల రక్తకణాలు తగ్గిపోతున్నాయి అన్నారు. అవి ఎక్కడో దొరుకుతాయి. అవి పట్టుకొని రమ్మన్నారు. అవి తెచ్చాక ఎక్కించారు.

కొంత మెరుగు అయింది. అబ్బాయి మాట్లాడుతున్నాడు. బాబాను తలచుకోమని చెబుతున్నాను.

నాసిక్ లోని ఒక డాక్టర్ కొంత కాలం షిరిడి లో పని చేశారట. ఆయన బాబా భక్తుడు. ఆయన అన్నాడు ” ఇటువంటి పేషెంట్ బతుకుతాడన్నది నమ్మకం చాలా తక్కువ” ట్రీట్మెంట్ చెయ్యమంటే చేస్తాను అన్నాడు.

బాబా గారే ఉన్నారు చేయమని చెప్పాను. రోజు MRI స్కానింగ్ చేసేవారు. రోజు రోజుకి ఇంఫ్రూమెంట్ వచ్చింది.

రోజు చుట్టుపక్కల మెడికల్ కాలేజీ నుండి డాక్టర్స్ ఈ కేసును చూడడానికి వచ్చేవారు.

మా అబ్బాయికి ఎనిమిది చోట్ల గుండెలపై కన్నాలు చేసి గుండెలోపల గడ్డ కడుతున్న రక్తం, లోపల బ్లీడ్ అవుతున్న రక్తం తీసేసేవారు.

18 రోజులు ICU లో పెట్టారు. ఆ పక్కన ఈ పక్కన ఉన్న పేషెంట్లు చనిపోతుండేవారు. మాకు చాలా భయంగా ఉండేది.

నాసిక్ నుండి బ్లడ్ platelets కావాలి అంటే ఒక టీం వెళ్లారు. తీరా వాళ్ళు శాంపిల్ తీసుకెళ్లడం మర్చిపోయారు. మళ్ళీ మరో టీం వెళ్లారు.

జోరున వాన కురుస్తుంది. ఆ వానలో వాళ్ళు వెళ్లి తీసుకు వచ్చారు. 18 బ్యాగుల రక్తం ఇచ్చారు.

ఆ బ్లడ్ బ్యాంకు వ్యక్తి నన్ను చూడడానికి వచ్చాడు.  ఎందుకంటే ఒక వ్యక్తికి ఇంత బ్లడ్ ఎక్కించడం అనేది సాధారణం గా జరగదు.

నాసిక్ లో డాక్టర్ పేరు బందోపాధ్యాయ. ఆయన బాబా భక్తుడు. ఆయన రౌండ్స్ కి వచ్చినప్పుడు మా అబ్బాయికి దిండు కింద బాబా ఫోటో, మా అబ్బాయి నుదుటన ఊదీ ఉందా లేదా అని చూసేవారు.

మేము షిరిడీ నుండి బయలు దేరేటప్పుడు బాబాకి రాత్రి వేసిన వస్త్రం ఒకటి పూజారి గారు ఇచ్చారు. అది వాడి తల కిందే ఉంచాము.

వాడికి బెడ్ మార్చినా అది కూడా దుప్పటి కిందే ఉంచేవాళ్ళం. నెలా పదిహేను రోజులు హాస్పిటల్ లో ఉన్నాడు . రిబ్స్ అన్ని కూడా సెట్ అయిపోయాయి.

ఆ తర్వాత మా వాడు చదువు గురించి ఆతృత పడుతుంటే ఫరవా లేదు చదువు ఒక సంవత్సరం పోతే పోనీ అన్నాను. అయినా మా వాడు వినకుండా ఫరవాలేదు నేను రాయగలను అని హైదరాబాద్ వెళ్ళిపోయాడు.

ఇంజినీరింగ్ distinction  లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత 6 నెలలలో cap gemini లో ఉద్యోగం వచ్చింది. థానే లో ఉన్నాడు. నెలకోసారి వచ్చి బాబా దర్శనం చేసుకుంటూ ఉంటాడు .

మేము ఈనాడు ఇలా ఉండడానికి కారణం బాబా. ఈ మార్గంలోకి రావడానికి మాకు బాబాను చూపించింది గౌరీ శంకర్ గారు. ఆయనకు మేము జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము .

ఎవరైనా సచ్చరిత్ర పారాయణ చెయ్యాలి. ఆయన నామస్మరణ చేయాలి. వీలైనంతగా ఆయన సేవ చేసుకోవాలి.

హారతులు పాడుకుంటూ ఉండాలి. అవి మరాఠి హారతులైనా గాని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.

ఊదీ పరమౌషధం దాన్ని ధారణ చేస్తూ ఉండాలి. రోజు మొత్తంలో రెండు నిముషాలు అయిన ఆయన నామం జపించాలి.

ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన సేవ చేసుకోవాలి. ఎప్పుడూ విడవకూడదు.

సాయి అనడం కూడా అప్పుడప్పుడు సాధ్యం కాదు. చిన్న తనం నుండి సాధన అవసరం.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles