Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
పేరు తెలియని ఒక భక్తురాలి అనుభవం:
2009లో జరిగిన ఒక అనుభవాన్ని సాయి బంధువులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను జాబు చేసే కంపెనీలో నన్ను బెంచ్ మీద ఉంచారు. సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఎక్కువ రోజులు ప్రాజెక్ట్ లేకుండా బెంచ్ పై ఉంటే రిస్క్. ఎందుకంటే జాబు పోయే ప్రమాదం ఉంది.
నేను చాలా ఆందోళన చెందాను. నేను సాయి సచ్చరిత్ర 7 రోజుల్లో పూర్తి చేయాలనీ మొదలు పెట్టాను. 5వ రోజు గురువారం వచ్చింది. ఆ రోజు అకస్మాత్తుగా నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. నాతోటి ఇతర ఉద్యోగస్తులు కొన్ని నెలలుగా ప్రాజెక్ట్ కోసం బెంచ్ పై వేచి ఉన్నారు. వారిలో ఎవరికి ప్రాజెక్ట్ రాకుండా నాకు రావడం వలన నిజంగా చాలా ఆశ్చర్యపోయాను.
2 రోజుల తరువాత నేను ఆ ప్రాజెక్ట్ శిక్షణ కోసం విదేశాలకు వెళ్లాలి అని చెప్పారు. అది వినగానే నా ఆనందానికి అవధులు లేవు. కాని నా తల్లిదండ్రులు నేను అమ్మాయిని కావడం వలన ఏ వ్యక్తి తోడూ లేకుండా తెలియని ప్రదేశానికి వెళ్లవలసి వచ్చిందని భయపడ్డారు. ఈ పరిస్థితిలో బాబా మళ్ళి తమ కరుణ చూపారు, నాతోపాటు మరొక అమ్మాయికి కూడా అవకాశం వచ్చింది.
నాకు సాయి ఒక ప్రేమించే తల్లిలా నా అవసరానికి అనుగుణంగా అయన తీపి లేదా చేదు మందులను ఇస్తారు. నాకు తెలుసు అయన నాకు ఏది మంచిదో అది చేస్తున్నారు. అందుకు ప్రతిగా అయన మన నుండి ఆశించేది ప్రేమ మరియు భక్తి మతమే.
బాబా మీకు చాలా చాలా ధన్యవాదాలు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సచ్చరిత్ర పారాయణ మొదలు పెట్టుటకు కారణము-బాబాగారు ఇచ్చిన నిదర్శనము.
- సచ్చరిత్ర పారాయణ తర్వాత నాకు జరిగిన అనుభవం ……..!
- సచ్చరిత్ర పారాయణ సమయములో వచ్చిన కలకు, చాగంటి గారి ప్రవచనం ద్వారా అర్ధం తెలుసుకుని సంతోషించిన భక్తురాలు
- సచ్చరిత్ర పారాయణ ఫలితం – కలలో వచ్చి వైద్యం చేసి ఆపరేషన్ అవసరం లేకుండా చేసిన బాబా గారు.
- సమస్యలలో ఉన్న తన తోటి సాయి భక్తులకు సచ్చరిత్ర, సహస్రనామ పారాయణ ద్వారా పరిష్కారం చూపించిన రాజేశ్వర రావు గారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments